అక్కినేని అఖిల్ పరిస్థితి మరి దారుణంగా తయారైంది. చేసిన మూడు సినిమాలు తనకు సరైన సక్సెస్ ని అందించలేదు .. పోనీ కనీసం ఈ నాలుగో సినిమాతో అయిన సరైన హిట్ అందుకుందామంటే .. ఆ సినిమా షూటింగ్ మాత్రం మొదలవ్వడం లేదు. అఖిల్ నాలుగో సినిమా వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది పరిస్థితి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ నాలుగో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మద్యే పూజ కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభించారు కానీ రెగ్యులర్ షూట్ విషయంలో మాత్రం సైలెంట్ అయ్యారు.
ఈ సినిమా విషయంలో అఖిల్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ విషయంలో అఖిల్ కోపంగా ఉన్నాడని, కావాలనే తన సినిమాను డిలే చేస్తున్నారని భావిస్తున్నాడట. ఇంత వరకు ఈ సినిమా విషయంలో ఏ ప్రోగ్రెస్ లేదట. హీరోయిన్ విషయంలో పలువురు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదట. దానికి తోడు ఈ సినిమాకు ఇంకా సినిమాటోగ్రాఫర్ ని కూడా ఫిక్స్ చేయలేదని టాక్ ?
ఈ రెండు విషయాల్లో అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు ఇటు నిర్మాత బన్నీ వాసు కు అభిప్రాయాలూ కుదరాలి. అప్పుడే వీరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే గీత ఆర్ట్స్ లో సాయి తేజ్ తో మారుతి చేస్తున్న సినిమా మాత్రం స్పీడ్ గా షూటింగ్ జరుపుకోవడంతో అఖిల్ కోపానికి ఆజ్యం పోసినట్టయింది. అందుకే అయన ఈ సినిమా విషయంలో గుస్సామీదున్నాడు. మరో వైపు అఖిల్ సినిమా ఆగిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏమి జరుగుతుందో.
509090 413481Empathetic for your monstrous inspect, in addition Im just seriously great as an alternative to Zune, and consequently optimism them, together with the really good critical reviews some other players have documented, will let you determine whether it does not take appropriate choice for you. 188723
217511 346776Very informative and exceptional bodily structure of content material material , now thats user friendly (:. 262010