టాలీవుడ్ లో సమంత క్రేజే వేరు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు స్టార్ హీరోలతో జోడి కట్టి టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ రేసులో నిలబడింది. తాజాగా సమంత నటించిన ఓ బేబీ నిన్న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు ఆ సినిమాలో సమంత నటనకు జనాలు ఫిదా అయ్యారు. నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తరువాత సమంత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని నిలుపుకునే పనిలో పడింది. తాజాగా మాజీ గ్లామర్ భామ ఛార్మి సమంత గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఛార్మి సోషల్ మీడియాలో చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఇంతకీ ఛార్మి సమంత ను ఏమని వ్యాఖ్యలు చేసింది అని అనుకుంటున్నారా !..అయితే ఆమె పాజిటివ్ గానే కామెంట్స్ చేసింది లెండి!! ఓ బేబీ సినిమా చుసిన ఛార్మి ట్విట్టర్ లో ” ఏ టైం లో పుట్టావమ్మా నువ్వూ .. నీ హార్డ్ వర్క్, నీ నిర్ణయాలు, నీ జాతకానికి నమస్కారం .. సమంత ఓ బేబీ రాక్స్ .. ఎంతో హ్యాపీగా ఉంది. డైరెక్టర్ నందిని రెడ్డి, ఓ బేబీ టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు” అంటూ ట్విట్ చేసింది ఛార్మి.
ప్రస్తుతం ఛార్మి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిజమే ఓ బేబీ సినిమా విషయంలో మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించింది సమంత. ఇక ఛార్మి విషయానికి వస్తే .. గ్లామర్ హీరోయిన్ గా అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఛార్మి .. ఆ తరువాత వరుస పరాజయాలతో డీలా పడింది. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో వెంటనే దర్శకుడు పూరి జగన్నాద్ టీం లో చేరి .. అక్కడ నిర్మాతగా వ్యవహారాలు చూసుకుంటుంది. ప్రస్తుతం పూరి తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ కు ఛార్మి కూడా ఓ నిర్మాత.
285931 839473Id need to talk to you here. Which is not some thing Which i do! I like reading an article that can make individuals believe. Also, thank you for permitting me to comment! 689790
293028 833512Would enjoy to constantly get updated great web blog ! . 646763