Switch to English

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీది అదే వ్యూహమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్లు ఖరారైన అభ్యర్థులు, సొంత పార్టీని కాదనుకుని.. వైసీపీలోకి దూకేసిన విషయం విదితమే. చివరి నిమిషంలో ఈ గోడ దూకుడు వ్యవహారాలు టీడీపీని దారుణంగా దెబ్బ తీశాయి. అయితే, టీడీపీ చేసిన తప్పిదాలూ చాలానే వున్నాయి.. అభ్యర్థుల ఎంపికలో అడ్డగోలు రాజకీయాలు నడిచాయి టీడీపీలో. చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ.. ఇంకొందరు ముఖ్య నేతలు.. అడ్డగోలుగా వ్యవహరించి, పార్టీని భ్రష్టుపట్టించారనే విమర్శలున్నాయి.

ఇక, జనసేన నుంచి కూడా కొందరు నేతల్ని చివరి నిమిషంలో వైసీపీ ఆకర్షించింది. ఏపీకి చెందిన చాలామంది రాజకీయ నాయకుల ఆర్థిక మూలాలు తెలంగాణలో వున్నాయన్నది బహిరంగ రహస్యం. అలాంటివారందరి లెక్కలు తీసి, తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా.. వారిని బెదిరించి, వైసీపీ.. తనవైపుకు తిప్పుకోవడమో లేదంటే వారంతా సైలెంటయిపోయేలా చేయడమో చేసిందనేది అప్పట్లో వినిపించిన ఓ బలమైన వాదన.

అదంతా ఉత్తదేనని అనడానికి వీల్లేదు మరి.. ఆ స్థాయిలో దిక్కుమాలిన రాజకీయాలు అప్పట్లో నడిచాయ్. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, అప్పట్లో టీడీపీకి వ్యతిరేకంగా, వైసీపీకి అనుకూలంగా ఏపీలోని పలు కీలక నియోజకవర్గాల్లో చక్రం తిప్పేశారు. ఇదే పరిస్థితి, తదుపరి ఎన్నికల్లోనూ కనిపిస్తుందా.? ఖచ్చితంగా కనిపిస్తుంది.

ఎందుకంటే, ఇప్పుడు అధికారంలో వున్నది వైసీపీ. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థుల్ని వైసీపీ ఎలా ప్రలోభపెడుతుందో, ఎన్నికల్ని ఎలా ‘టాకిల్’ చేస్తుందో తిరుపతి ఉప ఎన్నికతోపాటు రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు స్థానిక ఎన్నికలు నిరూపించాయి. పరిషత్ ఎన్నికల్ని సోలో ఫైట్‌గా మార్చేయడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. అదే పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో వుంటుందా.? అంటే, ‘వుండదు’ అని ఖచ్చితంగా చెప్పేయలేం.

ఎందుకంటే, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ‘కప్పల తక్కెడ నాయకులే’ ఎక్కువ మరి. ఆ కప్పల తక్కెడ నాయకుల వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నానాటికీ భ్రష్టుపట్టిపోతోంది. రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాలతోపాటు, రాష్ట్ర ప్రయోజనాల గురించీ ఆలోచించే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దేశంలో ఎక్కడా కనిపించని వింత ఇది.

102 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...