Switch to English

బర్త్ డే స్పెషల్‌: నవరస నటసింహం బాలయ్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

నందమూరి తారాక రామారావు గారి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి చాలా తొందర్లోనే బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అన్న గారి నటన పరంగా నిజమైన వారసుడు బాలకృష్ణ అంటూ అభిమానులు స్టార్‌ హీరోగా చేశారు. తెలుగులో దాదాపుగా రెండు దశాబ్దాల పాటు నెం.2 హీరోగా కొనసాగి నెం.1 చిరంజీవికి బలమైన పోటీగా నిలిచిన బాలకృష్ణ సుదీర్ఘ కాలంగా సినీ ప్రస్థానంను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఏకంగా ఒక గ్రంధం రాయవచ్చు. అంతటి ఘనత కలిగిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు బోయపాటి అఘోర లుక్ లో చూపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ ను అఘోరా లుక్ లో చూపించబోతున్నట్లుగా గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన ఎలా ఉంటాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే బాలయ్య గత చిత్రాలను అభిమానులు ముందు పెడుతున్నారు. అద్బుతమైన పాత్రలు ఎన్నో చేసిన బాలయ్యకు అఘోర లుక్ పెద్ద కష్టం ఇబ్బంది ఏమీ కాదు. భైరవ ద్వీపం సినిమాలో కురూపి గా నటించి మెప్పించిన బాలకృష్ణ ఆ తర్వాత కూడా పలు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆయన నటించిన వందకు పైగా చిత్రాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి నవరస నటుడిగా పేరు దక్కించుకున్నాడు. అద్బుతమైన నటుడిగా ఇప్పటికే అభిమానులు మరియు విమర్శకులతో కీర్తించబడుతున్న బాలయ్య కొత్త సినిమాల్లో మరింత కొత్తగా కనిపించేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు.

వంద సినిమాల్లో నటించి మెప్పించిన బాలయ్య మరిన్ని సినిమాలు చేసే స్టామినా ఉందంటూ చెప్పకనే చెబుతున్నాడు. ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొడుకును వెండి తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు తాను హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఒక వైపు అఖండ సినిమా విడుదల కాకుండానే మరో వైపు యంగ్‌ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. ఈ రెండు సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్ రాబోతున్నాయి. సక్సెస్‌ ప్లాప్‌ లు పట్టించుకోకుండా కెరీర్‌ లో ముందుకు వెళ్తున్న నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఇండస్ట్రీ హిట్‌ లు ఎన్నో దక్కించుకున్న నందమూకి బాలకృష్ణ ఇప్పటికి యంగ్‌ హీరోలకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. అలాంటి బాలయ్య నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అభిమానులు సోషల్‌ మీడియా ను హోరెత్తిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈయన బర్త్‌ డే వేడుకలు జరగాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా వాయిదా వేశారు. ఇక బాలయ్య అఖండ పోస్టర్‌ తో సందడి చేస్తున్నారు. బాలయ్య కు మా తరపున మీ తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మరిన్ని సినిమాలు చేసి సక్సెస్ లు దక్కించుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్‌ డే బాలయ్య.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....