‘పేకాట ఆడితే తప్పా.? పేకాట ఆడటం మాత్రమే కాదు, కాసినోలకీ వెళతాను..’ అంటాడో అధికార పార్టీ నేత. ‘పేకాట ఆడితే, పేకాట నిర్వహిస్తే ఉరిశిక్ష వేసెయ్యరు కదా. జరీమానా వేస్తారు, కడతారు.. మళ్ళ ఆడతారు..’ అని ఇంకో అధికార పార్టీ నేత చెబుతాడు. ఇద్దరూ ప్రభుత్వంలో కీలక పదవుల్లో వున్నవారే. సభ్య సమాజానికి ఇలాంటోళ్ళు ఏం సంకేతాలు పంపదలచుకున్నారు.?
ఎవరన్నా విమర్శిస్తే చాలు, బూతులతో విరుచుకుపడిపోతారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అధికారం వుంది కదా.. అని విర్రవీగిపోబట్టే.. ఇప్పడు ‘నన్ను మళ్ళీ గెలిపించండొ మహాప్రభో..’ అని ఓటర్ల యెదుట వాపోవాల్సి వస్తోంది. అయితే, చంద్రబాబు ఆవేదన కాస్త అసహనం హద్దులు దాటేసి, బెదిరింపులదాకా వెళుతోందనుకోండి.. అది వేరే సంగతి.
చంద్రబాబు పరిస్థితి చూసయినా, అధికార పార్టీ నేతలు తమ పద్ధతి మార్చుకోవడంలేదు. ‘చంద్రబాబు వ్యభిచార గృహాల్ని నిర్వహించారు..’ అంటూ ఓ మంత్రిగారు అత్యంత జుగుప్సాకరమైన రీతిలో విమర్శల దాడికి దిగారు. ఔనా.? అది నిజమా.? అదే నిజమైతే, చంద్రబాబు నాయకత్వంలో గతంలో సదరు నాయకుడు ఎందుకు పనిచేసినట్లు.? ఎమ్మెల్యేగా సదరు నేత గతంలో గెలిచింది చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడిగా వున్నప్పుడేనని మర్చిపోతే ఎలా.?
మంత్రిగా వున్నాం.. ఫలానా మాట మాట్లాడకూడదు.. అన్న ఇంగితం లేకపోవడమంటే, అసలు అలా మాట్లాడేటప్పుడు ‘సోయలోనే వున్నరా.?’ అన్న అనుమానాలు కలగకమానవు. ఓటీటీకి కాదు, ముందుగా తెలుగు న్యూస్ ఛానళ్ళకు సెన్సార్ అవసరం. కాదు కాదు, ప్రెస్మీట్లకు హాజరవుతన్న జర్నలిస్టులు, రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతుంటే, అక్కడికక్కడే నిరసన తెలపాలి. అసలు ఇలాంటోడి ప్రెస్‌మీట్‌కి ఎందుకు వెళ్ళాలి.? అన్న ఆలోచన జర్నలిస్టులు కూడా చేయాల్సిందే. లేకపోతే, ఈ మొత్తం బూతు వ్యవహారానికి జర్నలిస్టులు కూడా పరోక్ష మద్దతిచ్చనట్లవుతుందనే అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోంది.
పేకాట.. వ్యభిచారం.. ఇవి తప్ప రాష్ట్రంలో రాజకీయ చర్చకు మరో అంశాలు లేవా.? నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లు వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులు ఆంధ్రపదేశ్‌లో.
30046 129890Some genuinely good stuff on this internet website , I enjoy it. 171777
601230 947346Some genuinely nice stuff on this web site , I enjoy it. 637680
166241 293700Woh I enjoy your posts , bookmarked ! My wife and i take problem along along with your last point. 177819
620696 370456I like your writing style truly loving this web site . 884934