Switch to English

విశాఖ ఉక్కుపై రాష్ట్రానికి హక్కులేదు: తేల్చేసిన సీఎం జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. అనేది ఒకప్పటి నినాదం. ఇప్పుడూ అదే నినాదంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. అయితే, విశాఖ ఉక్కుపై రాష్ట్రానికి హక్కు లేదని తేల్చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన కార్మిక సంఘాల ప్రతినిథులతో భేటీ అయిన వైఎస్ జగన్, విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై సర్వ హక్కులూ కేంద్రానికే వున్నాయనీ, నష్టాల్లో వుందని చెప్పి కేంద్రం ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనుకోవడం తగదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఇప్పటికే ఈ విషయమై లేఖ రాశానన్న వైఎస్ జగన్, విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంతంగా గనులు లేవనీ, నష్టాలను తగ్గించుకునే మార్గాల్ని అన్వేషించాలి తప్ప, ప్రైవేటీకరణ చేయకూడదనే విషయాన్ని కేంద్రానికి తెలిపానన్నారు. కాగా, విశాఖ స్టీలు ప్లాంటుపై కన్నేసిన ‘పోస్కో’ సంస్థ ప్రతినిథులు తనను గతంలో కలిసిన మాట వాస్తవమేనని వైఎస్ జగన్ చెప్పారు. కడప, కృష్ణపట్నం, భావనపాడుల్లో ఏదో ఒక చోట స్టీలు ప్లాంటు ఏర్పాటు గురించి మాత్రమే తమ మధ్య చర్చలు జరిగాయనీ, కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేస్తే బావుంటుందని తాను వారికి సూచించాననీ, విశాఖ ఉక్కు పరిశ్రమ జోలికి పోస్కో వచ్చే అవకాశం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

అయితే, విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన భూముల్లో స్టీలు ప్లాంటు నెలకొల్పేందుకు పోస్కో ఇప్పటికే అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెల్సిందే. అదే పోస్కో సంస్థకు విశాఖ స్టీలు ప్లాంటుని అప్పగించేందుకూ కేంద్రం సుముఖంగానే వుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఇప్పటికే కేంద్రం ప్రకటన చేయడం, పలు దఫాలుగా పోస్కో కేంద్రంతోనూ, విశాఖ ఉక్కు యాజమాన్యంతోనూ సంప్రదింపులు చేపట్టడం… ఇవన్నీ జరిగాక, కేంద్రం వెనక్కి తగ్గుతుందని ఎలా అనుకోగలం.? ఏదిఏమైనా, రాజకీయాల్ని పక్కన పెట్టి.. అన్ని రాజకీయ పార్టీలూ విశాఖ ఉక్కు ఉద్యమంలోకి ఉక్కు సంకల్పంతోనే రావాల్సి వుంటుంది. వైసీపీ, టీడీపీ.. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటే ఆ ఆధిపత్య పోరు విశాఖకు, ఆంధ్రపదేశ్‌కీ తీవ్ర నష్టం చేస్తుందన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...