Switch to English

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? రివ్యూ: పాట మాత్రమే బాగుంది, మిగతా అంతా అస్సాం.!

Critic Rating
( 2.00 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow
Movie 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
Star Cast ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్
Director మున్నా
Producer ఎస్.వి బాబు
Music అనూప్ రూబెన్స్
Run Time 2 గంటల 23 నిముషాలు
Release జనవరి 29, 2021

టాలీవుడ్ టాప్ యాంకర్ అయిన ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతూ చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. తమిళంలో గోల్డెన్ హీరోయిన్ అనిపించుకున్న అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి వచ్చిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ పాట అంత బాగుంటుంది సినిమా అంటూ ప్రమోట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ప్రస్తుతం ఉన్న జెనరేషన్ లో నిజమైన ప్రేమ ఉందా అని వెతుకుతున్న ఓ యంగ్ సాధువుకి సమాధానంగా తన గురువు 1947లో ఎంతో స్వచ్ఛంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోకుండా చచ్చిపోయిన ప్రదీప్ – అమృతలు మళ్ళీ జన్మలో అర్జున్(ప్రదీప్ మాచిరాజు) – అక్షర(అమృత అయ్యర్)లుగా జన్మిస్తారు. అనుకోకుండా ఒకే కాలేజ్ కి వస్తారు. మొదటి నుంచీ ప్రతి విషయంలోనూ వారిద్దరికీ అస్సలు పడదు. టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఇంటర్వల్ టైంకి వారు అనుకోకుండా గత జన్మలో ప్రేమించుకున్న టెంపుల్ దగ్గరికి వెళ్లడం అక్కడ వారి ఆత్మలు ఒకరి బాడీ నుంచి ఇంకొకరి బాడీలోకి మారిపోతాయి. ఇక అక్కడి నుంచి వారు ఒకరితో ఒకరు ఎలా ఆదుకున్నారు? ఇద్దరూ ఎదుర్కున్న సమస్యలేమిటి? చివరికి వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ పుట్టి మళ్ళీ ఒకరి బాడీస్ లోకి ఒకరు వచ్చారా? లేదా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

ప్రదీప్ మాచిరాజుకి హీరోగా మొదటి సినిమా.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉన్న పాత్ర చాలా చిన్నదే అయినా నటన పరంగా సూపర్బ్ అనిపిస్తాడు. ప్రెజంట్ యూత్ ఫుల్ లుక్ లో ఉన్న పాత్రలో డాన్సులు బాగా చేసాడు. జోష్ ఫుల్ గా నటించాడు కానీ ఎక్కడో యాంకర్ గా ఎలాంటి కామెడీ చేస్తుంటాడో సేమ్ టు సేమ్ అలాంటి కామెడీ, అదే స్లాంగ్, అదే టైపు పంచ్ డైలాగ్స్ చెప్పడం బాగా రొటీన్ గా అనిపించడం మైనస్ అని చెప్పుకోవాలి. అమృత అయ్యర్ తన పాత్రలో బాగా చేసింది. మొదటి హాఫ్ లో ట్రెడిషనల్ లుక్ లో సెకండాఫ్ లో మోడ్రన్ లుక్ లో స్కిన్ షో చేస్తూ యూత్ ని బాగా ఆకట్టుకుంది. కచ్చితంగా అమృత అయ్యర్ కి మరికొన్ని అవకాశాలు వస్తాయి. ఎమోషల్ సీన్స్ లో పోసాని కృష్ణమురళి మెప్పిస్తాడు. హర్ష అండ్ భద్రమ్ అక్కడక్కడా తమ వన్ లైనర్స్ తో నవ్విస్తారు.

తెర వెనుక టాలెంట్..

ఈ సినిమాకి ఇంత క్రేజ్ రావడానికి కారణం అనూప్ రూబెన్స్ కంపొజిషన్ లో సిద్ శ్రీరామ్ పాడిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ అంత పెద్ద హిట్ అవ్వడమే.. ఇప్పుడు సినిమాకి వచ్చే కలెక్షన్స్ లో కూడా 70% క్రెడిట్ వాళ్ళకే ఇవ్వాలి అనడంలో అతిశయోక్తి లేదు. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్. పాటలు బాగున్నాయి, ముఖ్యంగా సినిమాలో పెద్దగా కంటెంట్ లేని చోట కూడా తన మ్యూజిక్ తో ఆడియన్స్ ని హుక్ చేయడానికి ట్రై చేసాడు. అలాగే దాశరధి శివేంధర సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. లవ్ సీన్స్ లో విజువల్స్ బాగున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. డైలాగ్స్ కాలేజ్ సీన్స్ లో డైలాగ్స్ అన్నీ మన జబర్దస్త్, ఢీ షో లో వచ్చే పంచ్ డైలాగ్స్ లా ఉన్నతాయి. దానికి తోడు సినిమాలో వచ్చే సీన్స్ అన్నీ మనం సక్సెఫుల్ సినిమాల్లో చూసేసిన హిట్ సీన్స్ అవ్వడం వలన అంతగా ఎక్కవు. ఎమోషనల్ సీన్స్ కి మాత్రం మంచిగా రాసాడని చెప్పాలి.

ఇక డైరెక్టర్ మున్నా విషయానికి వస్తే.. తను గత జన్మల కాన్సెప్ట్ తో సినిమా చెప్పాలనుకున్నాడు. అలాంటప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో స్ట్రాంగ్ లవ్ స్టోరీ చెప్పాలి కానీ సింపుల్ గా ఒక సాంగ్ లో ప్రేమ కథ చెప్పేసి దాన్ని మరో రెండు గంటల కథకి సింక్ చేయాలనుకోవడం వలన ఫ్లాష్ బ్యాక్ లోని ప్రేమ కథతో ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ అవ్వరు. ఇక కాలేజ్ ఎపిసోడ్స్ లో అంతా స్పూఫ్ కామెడీ మీదే డిపెండ్ అయ్యారు. అందులో పటాస్ స్పూఫ్ అండ్ ఎగ్జామినేషన్ స్పూఫ్ వర్కౌట్ అయ్యింది కానీ మిగతా సీన్స్ అన్నీ బోర్ కొడతాయి. అలా ఓవరాల్ గా కథ ఎంగేజింగ్ గా లేదు. అలాగే నేరేషన్ అండ్ స్కీన్ ప్లే అయినా ఆసక్తిగా ఉందా అంటే అదీ లేదు. ముఖ్యంగా సెకండాఫ్ అయితే పూర్తిగా మైనస్ అయిపోవడం, కనెక్ట్ కావాల్సిన ఎమోషన్ కనెక్ట్ కాకపోవడం బిగ్గెస్ట్ మైనస్. ఇకపోతే డైరెక్టర్ గా కూడా కామెడీ అండ్ ఎమోషన్స్ విషయంలో కాస్త జెన్యూన్ గా వెళ్ళాల్సింది. ఆల్రెడీ బుల్లితెరపై చూస్తున్న కామెడీ మళ్ళీ వెండితెరపై చెప్పడం వలన ఉపయోగం ఏముంది. ఆ లాజిక్ ని అలోచించి ఉంటే ఇదే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. రీసెంట్ గా వచ్చిన జంబ లకిడి పంబ’ సినిమాకి చాలా అంటే చాల అపోలికలు ఉండడం. అలాగే సినిమా టైటిల్ కి కథకి జస్టిపై లేకపోవడం మరో విశేషం. ఎస్.వి బాబు నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– నీలి నీలి ఆకాశం సాంగ్
– ఫస్ట్ హాఫ్ లో వచ్చే స్పూఫ్ కామెడీ
– అమృత అయ్యర్ పెర్ఫార్మన్స్
– పోసాని ఎమోషనల్ సీన్

బోరింగ్ మోమెంట్స్:

– అందరూ ఊహించిన రొటీన్ కథ
– బోరింగ్ స్క్రీన్ ప్లే
– నేరేషన్ లో సినిమాని సాగదీయడం
– ప్రేమకథలో ఉండాల్సిన ఎమోషన్ మిస్ అవ్వడం
– ఫ్లాష్ బ్యాక్ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం
– వీక్ డైరెక్షన్
– సినిమా నిడివి

విశ్లేషణ:

’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమా నుంచి వచ్చిన ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్ చాలా పెద్ద హిట్ అయ్యింది. దాన్ని బేస్ చేసుకొని ఆ పాట అంత సినిమా బాగుంటుంది అని ప్రమోట్ చేసుకున్నారు. కానీ సినిమాలో పాట మాత్రమే బాగుంది మిగతా అంతా రొటీన్ రొట్టాలా ఉంది. ఫస్ట్ హాఫ్ లో యూత్ కి కనెక్ట్ అయ్యే రెండు మూడు కామెడీ సీన్స్ బాగుండడం వలన పరవాలేధనిపించినా సెకండాఫ్ మాత్రం మరీ బోరింగ్, మరీ లాగ్ లా ఉండడం ఫస్ట్ హాఫ్ లో వచ్చిన ఫీలింగ్ ని పోగొట్టేసి, ఏంటి సినిమా ఇలా ఉంది అనుకుంటూ ప్రేక్షకులు బయటకి వస్తారు. ప్రదీప్ కి ఉన్న క్రేజ్ వలన కొంత ఓపెనింగ్స్ వచ్చినా ప్రదీప్ ఇంకాస్త బెటర్ సినిమా చేసి ఉండచ్చు అనే టాక్ కూడా కచ్చితంగా వస్తుంది.

చూడాలా? వద్దా?: బాగుండే ఒక్క పాట కోసం 143 నిమిషాల టార్చర్ భరించడం కష్టమే సుమీ.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...