Switch to English

అల్లరి నరేష్ బంగారు బుల్లోడు మూవీ రివ్యూ – ఈ బుల్లోడు బోరింగ్ బాబోయ్.!

Critic Rating
( 1.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow
Movie బంగారు బుల్లోడు
Star Cast అల్లరి నరేష్, పూజ జవేరి, ప్రవీణ్
Director పి గిరి
Producer రామబ్రహ్మం సుంకర
Music సాయి కార్తీక్
Run Time 2 గంటల 9 నిముషాలు
Release జనవరి 23, 2021

చివరిగా ‘మహర్షి’ సినిమాలో కనిపించి ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్ అందుకున్న అల్లరి నరేష్ సోలో హీరోగా మాత్రం హిట్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. కానీ కామెడీ సినిమాలు పెద్దగా హిట్ అవ్వడం లేదు. అందుకే ఈ సారి సినిమాలో కామెడీనే కాదు కథ కూడా ఉండాలని అన్నీ సెట్ చేసుకొని చేసిన సినిమా ‘బంగారు బుల్లోడు‘. కోవిడ్ తర్వాత థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తుండడంతో నేడు ఈ సినిమాని రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాతో అయినా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి అల్లరి నరేష్ హిట్ కొట్టాడో లేదో చూద్దాం..

కథ:

ఓపెన్ చేస్తే సీతానగరం.. అందులో మావుళ్ళమ్మ తల్లి బాగా ఫేమస్. పెళ్లి కానివారు ఎవరు ఆమెకి మొక్కుకున్నా వెంటనే పెళ్ళైపోతుంది. కానీ అదే ఊర్లో ఉంటున్న భవాని ప్రసాద్(అల్లరి నరేష్) అండ్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరికీ మాత్రం పెళ్లిళ్లు అవ్వవు. దానికి కారణం భవాని ప్రసాద్ తాత గారు(తనికెళ్ళ భరణి) చేసిన ఓ తప్పిదమని భవాని ప్రసాద్ కి తెలుస్తుంది. అందుకే ఆయన మనవళ్ళైన తమకి పెళ్లి కావట్లేదని తెలుసుకున్న భవాని ప్రసాద్ తాత చేసిన తప్పుని సరిదిద్ధి అమ్మవారికి పాప పరిహారం చేసుకోవాలి అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి గ్రామీణ బ్యాంకు లో గోల్డ్ లోన్ డిపార్ట్మెంట్ లో పనిచేసే భవాని ప్రసాద్ ఎలాంటి ఎత్తులు వేసాడు? అమ్మవారి నగలకి – భవాని ప్రసాద్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? అమ్మరి నగల విషయంలో భవాని ప్రసాద్ అలాంటి ఇబ్బందులు పడ్డాడు.? ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? చివరికి అమ్మవారు కరుణించి భవాని ప్రసాద్ తప్పుల్ని క్షమించిందా? లేదా? అనేదే ఈ బంగారు బుల్లోడు కథ.

తెరమీద స్టార్స్..

తెరమీద మనకు అందరూ తెలిసిన నటీనటులే కనిపిస్తారు, అలాగే ఇది అల్లరి నరేష్ సినిమా అనగానే కూసిన కామెడీ ఆశిస్తారు.. కానీ అల్లరి నరేష్ నుంచి తెలిసిన నటీనటుల వరకూ ఎవరూ, ఏ సందర్భంలోనూ నవ్వించలేకపోయారు. అల్లరి నరేష్ కి కామెడీ కన్నా ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. అవి బాగా చేసాడు కానీ నవ్వించలేదు. హీరోయిన్ పూజ ఝవేరి కూడా కొన్ని చోట్ల ఓకే అనిపిస్తే, కొన్ని చోట్ల ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. పెర్ఫార్మన్స్ కూడా సోసోగా ఉంది. స్వాతి ముత్యపు జల్లులలో సాంగ్ మాత్రం కాస్త గ్లామర్ డోస్ తో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ ఉన్నది చాలా తక్కువ సేపు కానీ ఒకటి రెండు పంచ్ లు పేలాయి. పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, రాజేష్, పృథ్వి లాంటి తదితరులు ఉన్నా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది.

తెర వెనుక టాలెంట్..

ప్రమోషన్స్ లో భాగంగా నా సినిమాలన్నిటిలో కామెడీ ఉంటోంది కథ ఉండడం లేదు, అందుకే ఈ సారి ఓ కథతో ఈ సినిమా చేసాను అన్నారు మన అల్లరి నరేష్. అన్నట్టుగానే ఈ సినిమాలో ఓ చిన్న పాటి కథ, ఆ కథకి ఓ ఎమోషన్ ఉంది. అక్కడి వరకూ ఓకే కానీ ఆ ఎమోషన్ ని అల్లరి నరేష్ ఇమేజ్ తో బాలన్స్ చేసేలా చేయలేకపోవడం, అలాగే కామెడీ కూడా జీరో ఉండడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. స్వతహాగా అల్లరి నరేష్ అంటే కామెడీ ఆశిస్తారు, కానీ ఇందులో మొదటి నుంచి చివరి దాకా చూసినా నవ్వుకుందాం అంటే ఒక్క ముక్క కామెడీ కూడా లేదు. డైరెక్టర్ గిరి ఎమోషన్ ని మొదటి రెండు మూడు సీన్స్ లో ఆడియన్స్ కి కనెక్ట్ చేసాడు, కానీ ఆ తర్వాత జరగాల్సిన స్టోరీలో ఏ మాత్రం ముందుకు వెళ్ళలేదు, రాసుకున్న కామెడీ వర్కౌట్ అవ్వలేదు, కథనంలో కొత్తదనం లేదు, ఆడియన్స్ ని హుక్ చేయలేదు. సెకండాఫ్ లో గెటప్ శీను తో లేడీ గెటప్ వేయించి ఓ జబర్దస్త్ ట్రాక్ చేయించారు. అలాంటివి ఆల్రెడీ బుల్లితెరపై చూసి ఎంజాయ్ చేసేస్తున్నారు, ఇక బిగ్ స్క్రీన్ పై చూడాల్సిన అవసరం ఏంటి, పోనీ నవ్వించగలిగారా అంటే అదీ లేదు. దాంతో ఆడియన్స్ బోరింగ్ బాబోయ్ బోరింగ్ అంటూ బయటకి వెళ్తారు.

చెప్పుకోదగినవి అంటే, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ.. పల్లె వాతావరణాన్ని బాగా చూపించి సినిమాకి ఆ ఫీల్ ని బాగా తెచ్చారు. సాయి కార్తీక్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇక ఎడిటింగ్ అయితే మొదటి 10 నిమిషాల తర్వాత నుంచీ ప్రతీది లాగ్ లానే అనిపిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– కథలో రాసుకున్న కీ ఎమోషన్, ఆ సీన్స్ లో తనికెళ్ళ భరణి నటన
– ఇంటర్వల్ ట్విస్ట్

బోరింగ్ మోమెంట్స్:

– కీ పాయింట్ తప్ప కథలో బలం లేకపోవడం
– కథనం
– నవ్వించలేకపోవడం
– బోరింగ్ గా సాగే నేరేషన్
– ఇది అల్లరి నరేష్ సినిమానేనా అనే ఫీల్ ని కలగజేయడం
– సోది అనిపించే కామెడీ ట్రాక్స్

విశ్లేషణ:

‘బంగారు బుల్లోడు’ – ఓ హిట్ సినిమా టైటిల్, అందులోనూ ఆ టైటిల్ వాడుకుంది అల్లరి నరేష్ మరియు జానర్ కూడా సీరియస్ కాదు, కామెడీ ఎంటర్టైనర్.. ఇన్ని చెప్పాక ప్రేక్షకులు 2 గంటల 9 నిమిషాల సినిమాలో ఓ గంటైనా హాయిహాగా నవ్వుకుంటాం అనుకొనే సినిమాకి వస్తారు, గంట ఏమో గానీ కనీసం ఒక నిమిషం పాటు కూడా సినిమాలో ఎక్కడా నవ్వించలేకపోవడం బాధాకరం. అల్లరి నరేష్ సినిమా అనే మార్క్ ని ఇంకా కిందకి తీసుకొచ్చేయడమే కాకుండా, అల్లరి నరేష్ సినిమా ఇంత దారుణంగా కూడా తీస్తారా అనే ఫీలింగ్ ని క్రియేట్ చేసి బయటకి పంపుతారు.

చూడాలా? వద్దా?: స్కిప్ చేసేయడమే బెస్ట్ ఆప్షన్.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...