Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: బీజేపీ పతనం మొదలైందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

దేశంలో బీజేపీ తప్ప, ఇంకో పార్టీ ఏదన్నా సమీప భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేంత స్థాయిలో ‘బలం’ పుంజుకునే పరిస్థితి వుందా.? ఈ ప్రశ్నకు చిన్న పిల్లాడినడిగినా సమాధానం ఒకటే వస్తుంది.. ‘లేదు’ అని.! ప్రస్తుతం పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ అలా వున్నాయి. అయితే, రాజకీయాల్లో ఈక్వేషన్స్‌ ఎప్పుడైనా మారిపోవచ్చు. ‘అధికారం’ తలకెక్కించుకుని, విర్రవీగితే.. ఎంతటి బలవంతులైనా, చరిత్ర హీనులుగా మిగిలిపోయారనడానికి చాలా ఉదాహరణలు కనిపిస్తాయన్నది వేరే చర్చ.

విపక్షాల అనైక్యతే, ప్రస్తుతానికి బీజేపీ బలం. కాంగ్రెస్‌ పార్టీ.. తిరిగి పూర్వ వైభవం సంపాదించుకోవడం అంత తేలిక కాదు. ఇక, ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే.. ఏ పార్టీకి ఆ పార్టీకే అంతర్గతంగా చాలా సమస్యలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ‘బలంగా’ వున్నట్లు కనిపిస్తున్నా.. ఆ పార్టీల్ని పీల్చి పిప్పి చేసే దిశగా బీజేపీ దగ్గర బీభత్సమైన వ్యూహాలున్నాయి.. ఈ వ్యూహాల్లో కొన్ని ఇప్పటికే సమర్థవంతంగా అమలయ్యాయి.. చాలా ప్రాంతీయ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. అలాంటివాటిల్లో టీడీపీ కూడా ఒకటి.

అయితే, దేశంలో ‘వేవ్‌’ మారుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా గాలి వీస్తోంది. కానీ, ఆ బీజేపీ వ్యతిరేక గాలి.. ఇంకో వైపుకి వెళ్ళడానికే పరిస్థితులు అనుకూలంగా లేవు. అదే బీజేపీకి అడ్వాంటేజ్‌. త్వరలో బీహార్‌ ఎన్నికలు జరగనున్నాయి. పరిస్థితులేమో అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలూ జరగనున్నాయి ముందు ముందు. వాటిల్లోనూ బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తప్పకపోవచ్చు.

కరోనా వైఫల్యాల్ని, చైనాతో యుద్ధమంటూ.. పక్కదారి పట్టిస్తోంది మోడీ సర్కార్‌. వ్యవసాయ రంగంలో కొత్త చట్టాలంటూ మోడీ సర్కార్‌ అభాసుపాలవుతోంది. నేషనల్‌ మీడియా ఎంతగా మేనేజ్‌ చేస్తున్నా.. రైతుల ఆందోళనలు మాత్రం, బీజేపీ రాజకీయ వ్యూహాల్ని తిప్పి కొట్టేస్తున్నాయి. ఎలా చూసుకున్నా.. రానున్న కాలం బీజేపీకి అత్యంత కష్ట కాలమేనన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మిత్రపక్షాలేవీ బీజేపీని మళ్ళీ ఇదివరకటిలా నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ పంచన చేరే కొత్త మిత్రులూ కనిపించడంలేదు. సో, రెండోసారి అధికారంలోకి వచ్చాక.. బీజేపీ తిరోగమనం వైపు రాజకీయంగా అడుగులేస్తోందని అనుకోవాలేమో.! దానర్థం రాజకీయంగా బీజేపీ పతనం మొదలైనట్లేనా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....