Switch to English

కేంద్రం కీలక నిర్ణయం: భారత తయారీ రంగానికి ఊతం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర భారత్ లో భాగంగా భారత తయారీ రంగానికి ఊతం ఇచ్చేలా మరో ముందడుగు వేసింది. రక్షణ శాఖకు అవసరమైన 101 పరికరాల దిగుమతులపై నిషేధం విధించింది. వాటిని స్వదేశంలోనే తయారు చేయించడం ద్వారా భారత రక్షణ పరిశ్రమకు చేయూతనివ్వాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వచ్చే ఆరేడేళ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల విలువైన ఆర్డర్లు స్వదేశీ పరిశ్రమలకు రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత రక్షణ పరిశ్రమకు ఇది సువర్ణావకాశమని ఆయన పేర్కొన్నారు.

భారత రక్షణ దళ అవసరాలకు అనుగుణంగా తమ సొంత డిజైన్లు లేదా డీఆర్ డీఓ అభివృద్ధి చేసిన డిజైన్లను ఉపయోగించి ఆయా పరికరాలు రూపొందించాలని రాజ్ నాథ్ సూచించారు. వచ్చే ఆరేడేళ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు అవసరమవుతాయని.. ఇందులో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లకు రూ.1.30 లక్షల కోట్ల చొప్పున ఉత్పత్తులు అవసరం కాగా, నేవీకి రూ.1.40 లక్షల కోట్ల వస్తువులు, పరికరాలు అవసరమవుతాయని వివరించారు.

ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు, సంబంధిత పరికరాలు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ నేపథ్యంలో వీటిని స్వదేశంలో తయారు చేయించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఈ నేపథ్యంలో మేకిన్ ఇండియా నినాదంలో భాగంగా భారత్ నుంచి ఆయుధాల ఎగుమతులు క్రమంగా పెరిగాయి. 2016 నుంచి 2019 మధ్య కాలంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 700 శాతం మేర పెరగడం విశేషం.

అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్, జర్మనీ, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికా సహా 42 దేశాలకు భారత్ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఆయా దేశాల నుంచి మిలటరీ హార్డ్ వేర్ కొనుగోలు చేసి, అనంతరం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ నేపథ్యంలో 101 ఉత్పత్తులపై నాలుగేళ్లపాటు నిషేధం విధించడం ద్వారా దేశీయంగా ఆయా పరిశ్రమలకు ఊతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో చిన్నచిన్న విడిభాగాలే కాకుండా అత్యాధునికమైన ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, చిన్న యుద్ధ నౌకలు, సోనార్ సిస్టమ్, రవాణా విమానాలు, తేలికపాటి హెలికాప్టర్లు, రాడార్ల వంటివి ఉన్నాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...