Switch to English

చంద్రబాబుకి ఆ ‘నొప్పి’ బాగా తెలిసొస్తోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కులం, మతం, ప్రాంతం అనేవి ప్రస్తావన లేని రాజకీయాల్ని ఆశించడం పెద్ద బూతుగా మారిపోయిందిప్పుడు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కులం పేరుతో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిన విషయం కాదు. కులం, మతం, ప్రాంతం చుట్టూ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో చాలా చాలా ఎక్కువ. అవే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కారణమన్న వాదన లేకపోలేదు. విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయినా, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో కులాల చుట్టూ నడుస్తోన్న రాజకీయ పైత్యం మాత్రం చల్లారడంలేదు.

ఇక, ఈ తరహా రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఇప్పుడు తాను ఆ కుల రాజకీయాల బాధితుడినంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన మీద ‘కులం’ ముద్ర వేసింది తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీకి అనుకూలంగా నడిచే మీడియా సంస్థలే. పవన్‌ కళ్యాణ్‌, 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చినా.. ఆయన మీదా కులం ముద్ర వేసింది టీడీపీ.. దాంతోపాటుగా ఆ పార్టీ అనుకూల మీడియా. ‘టిట్‌ ఫర్‌ టాట్‌’ అన్న చందాన, ఆంధ్రప్రదేవ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ ‘కుల రాజకీయాల్లో’ తానేం తక్కువ తిన్లేదని నిరూపిస్తోంది.

సాక్షాత్తూ ఎన్నికల కమిషనర్‌కి ‘కులం’ ఆపాదించిన ఘన చరిత్ర వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీది. ఇక, ‘కులం’ పేరుతో అమరావతిపై ఆరోపణలు చేయడం.. అమరావతి కోసం ఉద్యమిస్తోన్న రైతులపై జుగుప్సాకరమైన ఆరోపణలు చేయడం.. చూస్తూనే వున్నాం. అమరావతిని ఏకంగా వైసీపీ ‘కమ్మరావతి’గా చెబుతోంది. ఈ పరిణామాలపై చంద్రబాబు చిత్రంగా ‘కలత’ చెందారు. ‘నాకు కులాన్ని ఆపాదిస్తున్నారు..’ అంటూ వాపోయారు. రాజకీయాల్లో వున్నవారెవరైనా చెప్పేది ఈ మాటే.

అంతెందుకు, ‘కులం చూడం.. మతం చూడం..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పడంలేదా.? ఏదిఏమైనా, కులం.. మతం.. ప్రాంతం.. ప్రస్తావన లేని రాజకీయాలు రాష్ట్రానికి అవసరం. దురదృష్టవశాత్తూ అది అసాధ్యంగానే కన్పిస్తోంది. ఓటు బ్యాంకు రాజకీయాలే ఈ కుల, మత, ప్రాంత ప్రస్తావనలకు కారణమన్నది నిర్వివాదాంశం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...