Switch to English

బాబాయ్‌ వర్సెస్‌ అమ్మాయ్‌: సింహాద్రి ‘అప్పన్న’ చుట్టూ చిత్రమైన రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు మీదకి బ్రహ్మాస్త్రంలా ఆయన సోదరుడి కుమార్తె సంచైతని ప్రయోగించారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. చిత్రమేంటంటే, సంచైత.. బీజేపీ నేత. రాష్ట్రంలో రాజకీయాలు ఎంత చిత్రంగా వున్నాయో చెప్పడానికి సంచైతకు మన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతల్ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అప్పగించడమే నిదర్శనం.

మన్సాస్‌ ట్రస్ట్‌ పరిధిలో పెద్దయెత్తున భూములున్నాయి. పలు దేవాలయాలున్నాయి. వీటన్నిటి మీదా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్ను పడిందన్నది విపక్షాల ఆరోపణ. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే కొందరు బీజేపీ నేతలు కూడా, మన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతలు సంచైతకు అప్పగించడాన్ని తప్పుపట్టడం. ఇదిలా వుంటే, సంచైత వర్సెస్‌ అశోక్‌ గజపతిరాజు మధ్య రాజకీయ పోరు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. కేవలం అశోక్‌ గజపతిరాజు ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయడానికే సంచైతను తీసుకొచ్చినట్లుగా నడుస్తోంది వ్యవహారం. ఆమె కూడా, పనిగట్టుకుని బాబాయ్‌ మీద విమర్శలు చేయడానికే ప్రాధాన్యతనిస్తున్నారు.

మరోపక్క సంచైత, ఆమె తల్లి ఎప్పుడో తమ కుటుంబానికి దూరమైపోయిందనీ, ఆమెకు ఎలాంటి వారసత్వ హక్కులూ లేవని అశోక్‌ గజపతిరాజు ఆరోపిస్తున్నారు. అంతే కాదు, అసలు సిసలు వారసులం తామేనంటూ ఊర్మిళ (అశోక్‌ సోదరుడు ఆనంద గజపతిరాజు మరో కుమార్తె) మీడియా ముందుకొచ్చారు.

ఈ వ్యవహారాలు కాస్సేపు పక్కన పెడితే, ‘ప్రసాద’ పథకం పరిధిలోకి సింహాచలం దేవస్థానాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇది తన ఘనతేనని సంచైత చెబుతున్నారు. ఆ క్రెడిట్‌లో కొంత భాగం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికీ ఇస్తున్నారు. అదే సమయంలో, చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించలేదనీ, అశోక్‌ గజపతిరాజు కూడా పట్టించుకోలేదనీ విమర్శించారు.

దానికి కౌంటర్‌ ఇస్తూ అశోక్‌ గజపతిరాజు, 2017లోనే సింహాచలం దేవస్థానం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ ‘ప్రసాద’ పథకం విషయమై విన్నవించామని, దాని ఫలితంగానే ఇప్పుడు కేంద్రం, సింహాచలం దేవస్థానానికి తీపి కబురు అందించిందని అంటున్నారు.

సంచైతకు మన్సాస్‌ ట్రస్ట్‌ బాధ్యతలు వచ్చింది ఈ మధ్యనే.. సింహాచలం దేవస్థానం బాధ్యతల్నీ కొద్ది నెలల క్రితమే అందుకున్నారు. ఇంతలోనే ఆమె ఇవన్నీ చేయగలిగారా.? నిజమైతే మంచిదే. కానీ, ఉత్తరాంధ్రకు సంబంధించిన కీలకమైన అంశం రైల్వే జోన్‌. అది ప్రకటితమైందిగానీ.. అమల్లోకి రాలేదు. సంచైతకు రాష్ట్ర ప్రభుత్వ ఆశీస్సులు.. కేంద్రం వద్ద పలుకుబడి వుంటే.. ఆ రైల్వే జోన్‌ వ్యవహారంపై బాధ్యత తీసుకోవచ్చు కదా.? ప్రత్యేక హోదా గురించి మాట్లాడొచ్చు కదా.!

కేంద్రం తరఫున రాష్ట్రానికి ఏమొచ్చినా.. అది తమ ఖాతాలో వేసేసుకోవడం వైసీపీకి అలవాటైపోయింది. ఈ క్రమంలో సంచైత, సింహాచలం క్రెడిట్‌ని తన ఖాతాలో వేసేసుకున్నారు. ఇంటి గొడవలు వుంటే.. అది వేరే సంగతి. ఇంటి గొడవల్ని, రాజకీయాల్ని మిళితం చేసేస్తే ఎలా.? అన్నది ఉత్తరాంధ్రలో సంచైత రాజకీయంపై ప్రముఖంగా విన్పిస్తోన్న విమర్శ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...