Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: దిల్ బేచారా – సుశాంత్ కి అద్భుతమైన వీడ్కోలు, మరువలేని అనుభవం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow
Movie దిల్ బేచారా
Star Cast సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంజన సింఘి, సైఫ్ అలీ ఖాన్..
Director ముఖేష్ చబ్రా
Producer ఫాక్స్ స్టార్ స్టూడియోస్
Music ఏఆర్ రెహమాన్
Run Time ఒక గంట 41 నిముషాలు
Release జూలై 24, 2020

40 రోజుల క్రితం యావత్ భారత సినీ ప్రపంచాన్ని విష్మయానికి గురి చేసిన ఘటన బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం.. ఇప్పటికీ తన ఆత్మహత్య వెనకున్న కారణం తెలియలేదు. అది కాసేపు పక్కన పెడితే సుశాంత్ సింగ్ నటించిన ఆఖరి చిత్రం ‘దిల్ బేచారా’ నేడు ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..

కథ:

కేవలం కథ పరంగా చూసుకుంటే మణిరత్నం ‘గీతాంజలి’ సినిమాని మళ్ళీ 31 సంవత్సరాల తర్వాత ఇంకో బ్యాక్ డ్రాప్ లో చూసినట్టు అనిపిస్తుంది. ఇక దిల్ బేచారా కథలోకి వస్తే.. థైరాయిడ్ కాన్సర్ తో బాధపడుతూ బాగా బోరింగ్ లైఫ్ గడుపుతున్న అమ్మాయి కిజీ బసు(సంజన సంఘి).. తన బోరింగ్ లైఫ్ లోకి యాక్టివ్ గా ఉంటూ, తనకి నచ్చిన పనిచేసే ఇమ్మాన్యూల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మాని(సుశాంత్ సింగ్ రాజ్ పుత్) ఎంటర్ అవుతారు. మానికి ఎప్పటికైనా రజినీకాంత్ లా స్టార్ హీరో అవ్వాలని కోరిక. అందుకే తన ఫ్రెండ్ తో కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తుంటారు. ఆ సినిమాలో హీరోయిన్ గా కిజిని సెలక్ట్ చేసి, ఒప్పిస్తారు. ఆ సినిమా ప్రయాణంలో మాని – కిజిలు ప్రేమలో పడతారు. కిజికి ఉన్న ఒకే ఒక్క కోరిక, తనకి బాగా ఇష్టమైన పాట రాసిన అభిమన్యు వీర్(సైఫ్ అలీ ఖాన్)ని కలవాలనుకోవడం. దాని కోసం మాని ఏం చేసాడు. ఆ తర్వాత మాని గురించి కిజికి తెలిసిన నిజం ఏమిటి? ఇద్దరిలో ఎవరు ప్రాణాలతో ఉన్నారు? ఎవరు చనిపోయారు? అనేదే కథ.

తెర మీద స్టార్స్..

సినిమాలో ఎందరు ఉన్నా అందరూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం మాత్రమే సినిమా చూస్తారు. చూసినంత సేపు ఎంత బాగా చేస్తున్నాడు, ఎంతలా నవ్విస్తున్నాడు, ఎమోషన్ తో ఏడిపించేసాడే అని బాగా కనెక్ట్ అవుతాం. అదే సమయంలో మా ఇంట్లో పిల్లాడిలా ఉన్నాడే, అప్పుడే ఇతనికి ఇంత కష్టం వచ్చి చనిపోయాడా అనే ఫీలింగ్ ఉండడం వలన మరింతగా సుశాంత్ పాత్రని ఎంజాయ్ చేస్తాము, అంతేహ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి చివరి సీన్ లో ఏడ్చేస్తాము. ఒక్క మాటలో చెప్పాలంటే సుశాంత్ కెరీర్లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ తో వెండి తెరకి వీడ్కోలు చెప్పాడని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ సంజన సంఘి చాలా బాగా నటించింది, సుశాంత్ కి మంచి జోడీ అనిపించుకుంది. కథని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో తన వంతు పాత్ర పర్ఫెక్ట్ గా పోషించింది. సైఫ్ అలీ ఖాన్ కనిపించేది ఒక్క సన్నివేశమే అయినా చాలా బాగుంటుంది.

తెర వెనుక టాలెంట్..

ఈ సినిమా కథని హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ స్పూర్తితో ఈ కథని రాశారు. కానీ ఆ కథే మన తెలుగు సినిమా గీతాంజలిని పోలి ఉంటుంది. అదీకాక సినిమా ఓపెనింగ్ సీన్ లో హీరోయిన్ చెప్పే వాయిస్ ఓవర్ లోనే కథ ఇదే అని మనకి క్లియర్ గా అర్ధంవవుతుంది. ఇలాంటి సినిమాలకి కథనంలో ఎమోషనల్ డ్రైవ్ చాలా ప్రధానం. మొదట్లో బాగానే అనిపించినా ఆ తర్వాత ఆ ఫీల్ కొంత డ్రాప్ అవుతుంది, సినిమా కూడా అలా అలా వెళుతుంటుందే తప్ప ఎక్కడా ఎగ్జైట్ చెయ్యదు. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఎమోషనల్ గా మారి అందరినీ హత్తుకుంటుంది. కథనం పరంగా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. దర్శకుడిగా పరిచయం అవుతూ ముఖేష్ చబ్రా ఓ మంచి ఎమోషనల్ సినిమా తీసాడు. అలాగే నటీనటుల నుంచి అద్భుతమైన నటనని రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే యాదృచ్ఛికమే అయినా సుశాంత్ కి అత్యంత విశిష్టమైన నివాళిగా, చూసిన ప్రతి ఒక్కరికీ సుశాంత్ గుర్తుండిపోయే సినిమాని ఇచ్చాడు.

ఈ సినిమాకి అసలైన హీరో ఏఆర్ రెహమాన్.. ఆయన పాటలు ముఖ్యంగా నేపధ్య సంగీతం చూస్తున్న వారిని హీరో – హీరోయిన్ పాత్రల్లో లీనమయ్యేలా చేసింది. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా సూపర్బ్..

విజిల్ మోమెంట్స్:

– సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మర్చిపోలేని నటన

– ఎమోషనల్ సీన్స్

– మొదటి 30 నిముషాలు + చివరి 15 నిముషాలు

– ఏఆర్ రెహమాన్ నేపధ్య సంగీతం

బోరింగ్ మోమెంట్స్:

– సినిమా మధ్యలో చాలా స్లో అనిపించడం

– సాగదీసి సడన్ గా క్లైమాక్స్ కి వచ్చేయడం

విశ్లేషణ:

‘దిల్ బేచారా’ – అబ్బా.. సినిమా అదిరిపోయింది, అంతకి మించి అద్భుతమైన కథ అని చెప్పుకునే సినిమా అయితే కాదు. కానీ ప్రేమ, అందులోని ఎమోషన్ ప్రతి ఒక్కరికి పరిచయమే కాబట్టి సుశాంత్ ప్రేమకి, నటనకి ఫిదా అయిపోయి అలా చూస్తుంటాము. అలాగే ఇంత ఎనర్జిటిక్ గా నవ్వించిన సుశాంత్ ని చూస్తున్నంతసేపు ఎంత బాగున్నాడు నీకు ఎంత కష్టం వచ్చింది. ఎందుకు వదిలి వెళ్లిపోయావ్ అనే బాధ తెలియయకుండానే మనలో ఉండడం వలన చివరి సీన్ లో చెమర్చిన కళ్ళతో సినిమాని ముగిస్తారు. చివరిగా సుశాంత్ కి ఓ అద్భుతమైన నివాళి మరియు చూసిన వారికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అనుభవం ఈ ‘దిల్ బేచారా’.

చూడాలా? వద్దా?: ఇంటిల్లిపాది కూర్చుని హ్యాపీగా చూడచ్చు.!

గమనిక: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా ఈ ‘దిల్ బేచారా’.. నటన పరంగా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమా, పైగా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే సినిమా. కావున ఇలాంటి సినిమాకి రేటింగ్ ఇచ్చి ఆ అనుభూతిని డిస్టర్బ్ చేయకూడదని మేము రేటింగ్ ఇవ్వడం లేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...