Switch to English

నిమ్మగడ్డ బిగ్‌ విక్టరీ: తిరిగి ఎస్‌ఈసీ పదవిలోకి..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఇటీవల గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ని కలిసి తనను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. నిమ్మగడ్డ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, నిమ్మగడ్డను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీని ఆదేశించారు .

కరోనా వైరస్‌ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడంతో ప్రభుత్వ పెద్దలకీ, నిమ్మగడ్డకీ మధ్య ‘గ్యాప్‌’ పెరిగింది. ఈ క్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, నిమ్మగడ్డపై ‘సామాజిక వర్గం’ పేరుతో వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఆ తర్వాత, ఎన్నికల సంస్కరణల పేరుతో నిమ్మగడ్డ పదవీ కాలాన్ని తగ్గించేందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ కూడా తీసుకొచ్చింది జగన్‌ ప్రభుత్వం.

కొత్త ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్‌ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కూడా. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తనను తొలగించేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ చెల్లదంటూ నిమ్మగడ్డ, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే, సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది.. హైకోర్టు తీర్పుపై ‘స్టే’ కోరినా పలుమార్లు సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే, ఇంకా ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో వుందనుకోండి.. అది వేరే విషయం.

సుప్రీంలో విచారణ జరుగుతోంది గనుక, హైకోర్టు ఆదేశాల్ని అమలు చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంటే, దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వుంటుందంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సూచనతో నిమ్మగడ్డ, గవర్నర్‌ని కలవడం.. నిమ్మగడ్డను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో.. ఏ క్షణాన అయినా నిమ్మగడ్డ తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవిలో కూర్చోవడం ఖాయంగానే కన్పిస్తోంది. ‘నిమ్మగడ్డ తిరిగొస్తే ఏం పీకుతాడు.?’ అని సాక్షాత్తూ ఓ మంత్రిగారే ఎగతాళి చేసిన నేపథ్యంలో.. నిమ్మగడ్డ, తిరిగి పదవిలోకి రావడం అనేది అత్యంత కీలక పరిణామంగానే భావించాల్సి వుంటుంది.

నిమ్మగడ్డ బిగ్‌ విక్టరీ: తిరిగి ఎస్‌ఈసీ పదవిలోకి..?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...