Switch to English

తెలుగుకు అరుదైన గౌరవం ఇచ్చిన ఆస్ట్రేలియా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మాతృభాషలో బోధనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ప్రహసనమే జరుగుతోంది. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తీసేసి, ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధించాలనే సర్కారు ప్రయత్నాలకు ప్రస్తుతానికి కోర్టు అడ్డుకట్ట వేసినా.. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దీనిని పలువురు భాషాభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. ఏపీ సర్కారు మాత్రం తన పట్టు వీడటంలేదు. ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 97 శాతం మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపించారని పేర్కొంది.

తాజాగా తెలుగు విషయంలో ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు భాషాభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని స్కూళ్లలో తెలుగు భాషను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకునే అవకాశం కల్పించింది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు తెలుగును ఐచ్చిక సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. పైగా తెలుగును ఎంచుకున్నవారికి ఉత్తీర్ణతలో 5 పాయింట్లు అదనంగా కేటాయిస్తారు. అంతేకాకుండా అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లు శాశ్వత నివాసం కోసం తెలుగు భాష ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది నిజంగా మన తెలుగు భాషకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కల్పించిన అరుదైన గౌరవం అనడంలో ఎంతమాత్రం సందేహం అక్కర్లేదు.

మన మాతృభాషకు ఆంధ్రప్రదేశ్ లో దక్కని గౌరవం ఎక్కడో సుదూరంలో ఉన్న దేశంలో దక్కడం విశేషం. నిజానికి ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధిస్తేనే వారికి సులభంగా అర్ధమవుతుందని నిపుణులు కూడా స్పష్టంచేస్తున్నారు. ఎవరికైనా సరే మాతృభాష తర్వాతే ఇతర భాషల అవసరం ఉంటుందని.. కానీ దురదృష్టవశాత్తు తెలుగు విషయానికి వచ్చేసరికి అందరూ చిన్నచూపు చూస్తున్నారని పలువురు భాషాభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

చాలామంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలని కోరుకుంటున్నారే తప్ప.. మాతృభాషలో చదవాలని మాత్రం కోరుకోవడంలేదని పేర్కొంటున్నారు. బీహార్, యూపీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సివిల్స్ కూడా మాతృభాషలో రాసి ఉద్యోగాలు పొందినవారు చాలామంది ఉన్నారు. రష్యా, జపాన్, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్ సహా ప్రపంచంలోని దాదాపు 75 శాతం దేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన సాగుతోంది. ఈ నేపథ్యంలో మన దగ్గర కూడా అదే కొనసాగితే బాగుంటుందనేది పలువురి మాట.

మన తెలుగు భాషకు ఆస్ట్రేలియా అరుదైన గౌరవం ఇచ్చిన నేపథ్యంలో మన భాషను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంటున్నారు. మరి ఇప్పటికైనా ఏపీలో తెలుగు మాధ్యమంలో బోధన విషయంలో సర్కారు నిర్ణయం మారుతుందేమో చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...