Switch to English

వైఎస్సార్సీపీకి తలనొప్పిగా మారుతున్న వాలంటీర్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఈ మధ్య పదే పదే విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతోంది. నిజానికి, ‘వాలంటీర్‌’ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటినుంచే, ‘అది కేవలం పార్టీ కార్యకర్తలకోసం’ అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ‘పార్టీ కార్యకర్తలకు, ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు.. పార్టీ ప్రచారం కోసం ప్రభుత్వం ఖర్చు నుంచి వేతనాలు..’ అంటూ చాలా విమర్శలు విపక్షాల నుంచి వచ్చాయి.

కానీ, ఆ వాలంటీర్‌ వ్యవస్థ అత్యద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పదే చెబుతున్నారు. నిజమే, గ్రామ స్థాయిలో చాలా చోట్ల వాలంటీర్లు అత్యద్భుతంగా పనిచేస్తున్నారు. ఏ వ్యవస్థలో అయినా లోపాలు మామూలే అన్నట్లు, గ్రామ వాలంటీర్‌ వ్యవస్థలో కూడా లోపాలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు అవినీతిపరులు అక్రమార్కులు వున్నట్లే, వాలంటీర్లలోనూ వున్నారు. అయితే, వాలంటీర్‌ వ్యవస్థని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం, ఆ వ్యవస్థ మీద ఆరోపణలు వచ్చినప్పుడు అంతే సీరియస్‌గా స్పందించాలి.

కానీ, వాలంటీర్‌ ఎవరి మీదన్నా దాడికి దిగితే.. ఆ ఘటనలో వాలంటీర్‌ని బాధితుడిగా చూపి, అవతలి వ్యక్తులపై దోషులన్న ముద్ర వేయడం ప్రభుత్వానికిగానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీకిగానీ మంచిది కాదు. వాలంటీర్లు దోపిడీలకు పాల్పడుతున్నారు.. వాలంటీర్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. వాలంటీర్లు హత్యలకు పాల్పడుతున్నారు.. అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయినా, ప్రభుత్వం తరఫున చర్యలు కన్పించడంలేదు.

మరోపక్క, ‘వాలంటీర్లలో మెజార్టీ అవకాశాలు మన పార్టీ కార్యకర్తలకే దక్కాయి.. వాలంటీర్‌ పోస్టులు పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నాం..’ అని ఓ సందర్భంలో వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి విపక్షాలు. దాంతో, ‘వాలంటీర్లు ఏం చేసినా’ అది వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోతోంది. మరోపక్క, గ్రౌండ్‌ లెవల్‌లో బాగా పనిచేస్తోన్న వాలంటీర్లకు అధికార పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి తలనొప్పులు ఎదురవుతున్నాయట. ‘పనులన్నీ మీరే చేసేస్తే మాకు పదవులెందుకు.? మా దగ్గరకి జనం రావడంలేదు..’ అంటూ వాలంటీర్లపై దాడులకు దిగుతున్నారు అధికార పార్టీ నేతలు. ‘వాలంటీర్‌ వ్యవస్థపై అధికార పార్టీ నేతల కినుక.. ముఖ్యమంత్రికి మొర..’ అంటూ వైసీపీ అనుకూల మీడియాలోనే కథనాలు వస్తుండడం గమనార్హం.

కరోనా వైరస్‌ నేపథ్యంలోనూ ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లను అభినందించాల్సిందే. అదే సమయంలో, వాలంటీర్‌ వ్యవస్థకే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నవారిని ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు వెనకేసుకొస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేమీ వుండదు. ఇటీవల ఓ వాలంటీర్‌, పోలీస్‌ అధికారులపైనే తప్పతాగి బూతులతో విరుచుకుపడితే, ఆ ఘటనలో వాలంటీర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి, పోలీసులపై చర్యలు తీసుకున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటివి ప్రభుత్వ ప్రతిష్టను మరింత దెద్బతీస్తాయనడం నిస్సందేహం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...