Switch to English

కరోనా వైరస్‌.. ఆ జ్యోతిషం నిజమైతే బావుణ్ణు కదా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నేడు జూన్‌ 21. భారతదేశంలో కరోనా పీక్‌ స్టేజ్‌ జూన్‌ 21వ తేదీ.. అని కొద్ది నెలల క్రితం కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రోజున అత్యధికంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వాలి.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాలి.. ఇదీ ఆ అధ్యయనాల సారాంశం. ఈ రోజు అత్యధికంగానే కేసులు నమోదవుతాయి.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, రేపు ఇంకా ఎక్కువ కేసులు నమోదవుతాయి. ‘కర్వ్‌’ అనేది ఇప్పట్లో కిందికి వంగేలా కన్పించడంలేదు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇంకా చెయ్యాల్సిన స్థాయిలో పరీక్షలు చేయడంలేదు. ప్రజల్లో అవగాహన పెరిగినట్లే పెరిగి, మళ్ళీ నిర్లక్ష్యం ఆవరించింది. దాంతో, దేశంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.

కాస్తలో కాస్త ఊరట ఏంటంటే, కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండడం. మరోపక్క, కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ రాకపోయినా, కరోనా వైరస్‌ సోకినవారికి చికిత్స అందించేందుకు అవసరమైన మందులు మాత్రం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గ్లెన్‌ మార్క్‌ నుంచి ఓ ఔషధం మార్కెట్‌లోకి వచ్చింది. తాజాగా మరికొన్ని కంపెనీలు కూడా తమ తమ మందుల్ని మార్కెట్‌లోకి దించుతున్నాయి. గ్లెన్‌ మార్క్‌ నుంచి ట్యాబ్లెట్లు వస్తే, హెటిరో నుంచి ఇంజెక్షన్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ట్యాబ్లెట్లతో పోల్చితే, ఇంజెక్షన్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని పలు నివేదికలు వెల్లడిస్తున్న విషయం విదితమే. దేని ప్రత్యేకత దానిదే. అయితే, ఈ మందులు అత్యంత ఖరీదైనవిగా చెబుతున్నారు. వేసుకోవాల్సిన డోసుల్ని పరిగణనలోకి తీసుకుంటే, 25 నుంచి 30 వేల వరకూ ఒక్కో వ్యక్తికి కేవలం ఈ మందులకే ఖర్చు కానుంది.

అయినాసరే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా పెద్ద ఉపశమనం. ఇక, కరోనా వైరస్‌ కేసుల పరంగా పీక్‌ స్టేజ్‌ గురించి మాట్లాడుకోవాలంటే, తాజా అంచనాల ప్రకారం అది ఆగస్ట్‌ – సెప్టెంబర్‌లో వుండొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాదు కాదు, నవంబర్‌లో అత్యధికంగా నమోదవుతాయని ఇంకొందరంటున్నారు. ఇప్పుడు నమోదవుతున్న అత్యధిక కేసులతోనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇంకా అత్యధికం అంటే.. అది ఊహలకందని స్థాయిలో వుంటుందన్నది నిర్వివాదాంశం. ఈ రోజు సూర్యగ్రహణం కావడంతో ఆ గ్రహణ ప్రభావం కరోనా వైరస్‌ మీద వుంటుందనీ, క్రమంగా దేశంలో కరోనా ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్యులు పలువురు చెబుతుండడం గమనార్హం. ఆ జ్యోతిషం నిజమయ్యే అవకాశం వుందా.? లేదా.? అన్న విషయం పక్కన పెడితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జోస్యం నిజమైతే బావుండేదన్న అభిప్రాయం మాత్రం అందరిలోనూ కలుగుతోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...