Switch to English

భారత్‌లో కరోనా 3 లక్షలు: నెక్స్‌ట్‌ ఏంటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,417FansLike
57,764FollowersFollow

‘ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చితే భారతదేశం పరిస్థితి మెరుగ్గానే వుంది.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు..’ కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) విషయంలో కేంద్రం పదే పదే చెబుతున్న మాట ఇది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. నిన్న అత్యధికంగా.. అంటే, 10 వేలకు పైగా కేసులు.. (దాదాపుగా 11 వేల కేసులు) నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు.

దేశంలో 130 కోట్ల మంది ప్రజలుంటే, అందులో ఇప్పుడు కరోనా వచ్చింది 3 లక్షల మందికి మాత్రమేనని లైట్‌ తీసుకునే పరిస్థితి వుందా.? ఛాన్సే లేదు. ‘ఢిల్లీ, హైద్రాబాద్‌, చెన్నయ్‌, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికారిక లెక్కల కంటే చాలా ఎక్కువ వుండొచ్చు.. అమెరికా స్థాయిలో మన దేశంలో పరీక్షలు జరిగితే, అమెరికా కంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులు బయట పడేవి..’ అంటూ కొందరు నిపుణులు చెబుతున్న మాటలు.. అందర్నీ భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

తక్కువ కేసులున్నప్పుడు కఠినంగా లాక్‌డౌన్‌ని అమలు చేసి.. కేసుల తీవ్రత పెరిగాక లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చేయడంపై మొదటి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఇంకోసారి లాక్‌డౌన్‌ని దేశంలో విధించే పరిస్థితే లేదు. ఇష్టం లేకపోయినా కరోనా వైరస్‌తో మనం సహజీవనం చేయాల్సిందే. ప్రభుత్వాలు మాటలు మాత్రమే చెబుతాయి.. ప్రజలే తమ ప్రాణాల పట్ల బాధ్యత తీసుకోవాల్సి వుందిప్పుడు.

ఒక్క రోజులో 11 వేల కేసులంటే చిన్న విషయం కాదు. ఇది రానున్న రోజుల్లో మరింత పెరగబోతోంది. ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌’ లేదని కేంద్రం చెబుతున్నా, లింకులు లేకుండా నమోదవుతున్న కేసుల్ని చూస్తే వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఓ వైపు లాక్‌డౌన్‌ కారణంగా సగటు భారతీయుడు తీవ్ర ఆర్థిక సమస్యల్లోకి నెట్టివేయబడ్డాడు. ఇంత పెద్ద త్యాగం చేశాక ఇప్పుడేమో.. లాక్‌డౌన్‌ని ఎత్తేసి, కరోనా వైరస్‌తో సహజీవనం చేయమని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

సాటి మనిషిని నమ్మలేని దుస్థితి దాపురించింది కరోనా కారణంగా. పాతాళానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశమే కన్పించడంలేదు. దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేయబోతోంది. అయినా, కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పబ్లిసిటీ స్టంట్స్‌కే పరిమితమవుతున్నాయి. కరెంటు బిల్లులు, పెట్రో బాదుడు.. ఇవి కరోనా కంటే దారుణంగా సామాన్యుడ్ని చిదిమేస్తుండడం అత్యంత బాధాకరమైన విషయం. ఒక్క ఢిల్లీలోనే రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ కేసులు 5 లక్ష లనుంచి 10 లక్షల వరకు నమోదవనున్నాయనే వాదనలు తెరపైకొస్తున్నాయంటే.. దేశంలో కరోనా ఎన్ని కోట్ల మందికి వ్యాపిస్తుందో ఏమో.. తలచుకుంటేనే ‘లెక్కలు’ గుండెల్ని పిండేస్తాయ్‌ మరి.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Devara: ‘బడా నిర్మాత బడాయి కబుర్లు..’ దేవర పాటకు నెటిజన్స్ ట్రోలింగ్

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా దేవర (Devara). ఇటివలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమాలో ఫియర్...

Taapsee: డెలివరీ బాయ్ నిబద్ధత.. స్టార్ హీరోయిన్ ఎదురైనా పనిలోనే.. వీడియో...

Taapsee: సినిమా తారలంటే ఎప్పుడూ క్రేజే. తెరపై అలరించేవారు బయట ఎదురైతే ఉబ్బితబ్బిబ్బవుతాం. వెంటనే మొబైల్ తీసి సెల్పీల కోసం ప్రయత్నిస్తాం. స్టార్ హీరో, హీరోయిన్లైతే...

Jabardasth Faima: లవర్ ని పరిచయం చేసిన జబర్దస్త్ ఫైమా.. షాక్...

Jabardasth Faima: జబర్దస్త్ వేదికగా పైమా-ప్రవీణ్ కలిసి చేసిన స్కిట్స్ నవ్వులు పంచాయి. వీరిద్దరూ నిజజీవితంలోనూ ప్రేమలో ఉన్నారని ప్రచారం కూడా జరిగింది. ఇద్దరూ కలిసి...

Vijay Devarakonda : రౌడీస్టార్‌, సుకుమార్‌ కాంబో కొత్త అప్‌డేట్‌

Vijay Devarakonda : రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అంటూ నాలుగు సంవత్సరాల క్రితం అధికారికంగా ప్రకటన...

Jani Master: ‘బెంగళూరు రేవ్ పార్టీలో నేనా..?’.. జానీ మాస్టర్ స్పందన...

Jani Master: బెంగళూరు (Bengaluru) లో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. పలువురు సినీ, టీవీ నటులు పార్టీలో పాల్గొన్నట్టు...

రాజకీయం

ఏపీ ఎన్నికల సిత్రమ్: తన మీద తానే బెట్టింగ్ వేసుకున్నాడట.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల బెట్టింగ్ అనేది ట్రెండ్ సెట్టింగ్ వ్యవహారంలా మారిపోతోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలకు సంబంధించి బెట్టింగ్ జరగడమనేది సర్వసాధారణమే అయిపోయిందిప్పుడు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలోనూ బెట్టింగ్...

వైసీపీ ఆ 95 చోట్ల ఓడిపోనుందట.! ఈ లెక్క పక్కా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులపైనే వుంది. అసెంబ్లీతోపాటు లోక్ సభ నియోజకవర్గాలకూ పోలింగ్ పూర్తయ్యింది. ఎవరు గెలుస్తారన్నది జూన్ 4న తేలుతుంది. అయితే, ఎన్నికల ఫలితాల వెల్లడికి...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట.! వైసీపీ ఉవాచ.!

ఎవరు గెలుస్తారు.? ఎవరు ఓడిపోతారు.? ఈపాటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో ఓటరు తీర్పు నిక్షిప్తమైపోయింది. జాతకాలు జూన్ 4న తేలుతాయ్.! అంటే, జడ్జిమెంట్‌కి సంబంధించి తీర్పు రాసేయబడింది.. అది వెల్లడి కావాల్సి వుందంతే. కానీ,...

ఎక్కువ చదివినవి

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.. మాస్ లో క్రేజ్.. వీటన్నింటి గురించి...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

జూన్ 4న ఆంధ్ర ప్రదేశ్‌లో ఏం జరగబోతోంది.?

ఐదేళ్ళకోసారి ఎన్నికలొస్తాయ్.! మధ్య మధ్యలో ఉప ఎన్నికలు కూడా రావొచ్చు.! ఎన్నికలంటేనే ఓ ప్రసహనం. మామూలుగా అయితే, రాజకీయం అంటే సేవ.! కానీ, రాజకీయమంటే ఇప్పుడు కక్ష సాధింపు వ్యవహారం.! ఐదేళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్...

రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో కెలుకుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్ పేరు మరోమారు వార్తల్లోకెక్కింది.! ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసిన ఓ ‘స్టోరీ’ ఆమెను వార్తల్లోకెక్కించింది. పెంపుడు జంతువుల సంరక్షణ విషయమై రేణు...