Switch to English

వైఎస్సార్సీపీకి ఏపీలో టఫ్‌ టైమ్ మొదలైనట్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏడాది పాలనని పూర్తి చేసుకున్నారు. రెండో ఏడాదిలో ఆయన ముందు చాలా సవాళ్ళున్నాయి. సంక్షేమ పథకాలతో ప్రజల మెప్పు పొందగలిగామని తొలి ఏడాది ‘పాజిటివ్‌ రిపోర్ట్‌’ చూసుకుని తమలో తామే మురిసిపోతున్నారు వైసీపీ నేతలు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రికి ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ నెగెటివ్‌గా వుండే పరిస్థితి లేదు.

కానీ, ముఖ్యమంత్రి గ్రౌండ్‌ లెవ్‌లో ఏం జరుగుతుందోనన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఆ విషయం పక్కన పెడితే, గత కొద్ది రోజులుగా విపక్షాలు చాలా యాక్టివ్‌ అవుతున్నాయి. టీడీపీ, జనసేన – బీజేపీ, వామపక్షాలు.. ఆఖరికి కాంగ్రెస్‌ పార్టీ కూడా తనవంతుగా యాక్టివ్‌ రోల్‌ పోషించాలనుకుంటోంది రాష్ట్రంలో. గడచిన ఏడాది కాలంలో ప్రభుత్వం చెప్పుకుంటున్న గొప్పల సంగతి పక్కన పెడితే, చాలా మైనస్‌లూ లేకపోలేదు. వాటి మీదనే విపక్షాలు ఎక్కవగా ఫోకస్‌ పెడ్తాయి.

ఇసుక దగ్గర్నుంచి మద్యం వరకూ.. అన్ని విషయాల మీదా ఫోకస్‌ పెడుతూ, సోషల్‌ మీడియా వేదికగా అధికార పార్టీ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్నాయి విపక్షాలు. ఈ విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు.. కాంగ్రెస్‌ పార్టీ కూడా తన ఉనికిని చాటుకుంటుండడం గమనార్హం.

ప్రధానంగా టీడీపీ, తనకు సోషల్‌ మీడియాలో వున్న బలాన్ని మేగ్జిమమ్ చూపించేస్తోంది వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా. ఓ పక్క ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్‌ మీడియాపై జగన్‌ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోందంటూ గగ్గోలు పెడ్తున్న టీడీపీ, ఇంకోపక్క సోషల్‌ మీడియా వేదికగా తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది.

ఇక, జనసేన విషయానికొస్తే.. కన్‌స్ట్రక్టివ్‌ క్రిటిసిజమ్ మాత్రమే కన్పిస్తోంది జనసైనికుల నుంచి. పవన్‌కళ్యాణ్‌కి వున్న అశేషమైన సినీ అభిమానులు మాత్రం, హద్దులు దాటేస్తున్నారనుకోండి.. అది వేరే విషయం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ పాలనకి సంబంధించి ఎక్కడ ఏ లోటుపాటు జరిగినా.. అది ముందుగా సోషల్‌ మీడియాకే ఎక్కుతోంది. ఫొటోలు, వీడియోలతో సహా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ జగన్‌ సర్కార్‌ వైఫల్యాల్ని నిలదీస్తున్నారు నెటిజన్లు.

ఈ క్రమంలో టీడీపీ ఫస్ట్‌ ప్లేస్‌లో వున్నా, ఆ పార్టీ నుంచి ఎక్కువగా వివాదాస్పద పోస్టింగ్స్‌ వుంటున్నాయి. జనసేన మాత్రం కన్‌స్ట్రక్టివ్‌ క్రిటిసిజంలో ముందు వరుసలో వుంటోంది. ‘ప్రభుత్వం సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపుతున్న దరిమిలా జనసైనికులు సంయమనం పాటించాలి..’ అంటూ పదే పదే జనసేనాని విజ్ఞప్తి చేస్తోన్న విషయం విదితమే. మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీకి ముందు ముందు మరింత ‘టఫ్‌’ కాబోతోందన్నమాట రాజకీయంగా.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...