Switch to English

బ్రేకింగ్‌ గాసిప్‌: ఢిల్లీకి జగన్‌.. తన సమస్యలకి పరిష్కారం దొరికేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

రాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్‌ గాసిప్‌ జోరుగా చక్కర్లు కొడుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఢిల్లీ పెద్దలు అసహనంతో వున్నారట. పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారుతుండడం వెనుక ‘పెద్ద కారణాలే వున్నాయి’ అన్న కోణంలో, తాజా పరిస్థితులపై ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరపాలనుకుంటున్నారట వైఎస్‌ జగన్‌. న్యాయస్థానాల్లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతుండడం వెనుక టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోన్న విషయం విదితమే. కీలకమైన విషయాల్లో టీడీపీ కంటే, బీజేపీనే ‘లీడ్‌’ తీసుకుని న్యాయస్థానాల్లో ఫిర్యాదులు చేయడాన్ని ఇప్పటిదాకా వైసీపీ లైట్‌ తీసుకుంటూ వచ్చింది.

అయితే, తాజాగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిసనర్‌ నిమ్మగడ్డ వ్యవహారంలోనూ బీజేపీనే లీడ్‌ తీసుకుంది. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. కొంత కాలం క్రితం, ఇంగ్లీషు మీడియం విషయంలో రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. అంతకు ముందు కూడా పలు సందర్భాల్లో వెంకయ్యపై వైసీపీ కీలక నేతలు నోరు జారారు, దిగజారుడు వ్యాఖ్యలూ చేశారు. అప్పటినుంచే అసలు కథ మొదలయ్యిందని అంటున్నారు. మరోపక్క, అమరావతి విషయంలో కూడా వెంకయ్యనాయుడు, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాల్సి వుందని వ్యాఖ్యానిస్తే, అప్పుడూ వైసీపీ, వెంకయ్యపై ఘాటైన విమర్శలు చేసింది.

ఉపరాష్ట్రపతి హోదాలో వున్న వెంకయ్యపై వైసీపీ అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బీజేపీ వర్గాల్లో కొంత అసహనానికి కారణమయ్యింది.. క్రమక్రమంగా అదిప్పుడు తీవ్ర రూపం దాల్చిందని గుసగుసలు విన్పిస్తున్నాయి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతోపాటు, పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ భేటీ కావాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్‌ ఖరారయినట్లు తెలుస్తోంది. వీలైతే, ప్రధానితోనూ భేటీ కావాలని వైఎస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారట.

ఇదిలా వుంటే, వైఎస్సార్సీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రిని వైఎస్‌ జగన్‌ కలవనుండడం నిజమేననీ, ముఖ్యమంత్రితోపాటు పలువురు అధికారులు.. వారితోపాటు తాము కూడా ఢిల్లీకి వెళతామనీ చెప్పారు. జల్‌శక్తి మంత్రితో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యే అవకాశముందనీ, రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రంతో సీఎం జగన్‌ చర్చిస్తారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కాగా, పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం కోసం ప్రధానిని ఆహ్వానించనున్నట్లు గతంలో ప్రకటించిన సీఎం జగన్‌, ఆ కార్యక్రమాన్ని జులైలో నిర్వహించనున్న దరిమిలా.. ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరికితే, ఆ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...