Switch to English

తెలంగాణలో మరిన్ని సడలింపులు.. రాత్రివేళా బస్సులు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేంత సాధన సంపత్తి మనదేశంలో లేవు. అందువల్ల లాక్ డౌన్ ముమ్మాటికీ పాటించాల్సిందే. మన తీసుకునే ముందు జాగ్రత్త చర్యలే మనకు శ్రీరామ రక్ష’’ – ఇటీవల పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో గానీ, రైళ్లను నడొపద్దని చెప్పడంలో గానీ ఆయనే ముందున్నారు. లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రాని కంటే నాలుగు రోజులు ముందుకే ఉండేవారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన వెసులుబాట్లను సైతం తెలంగాణలో అమలు చేయలేదు. కానీ ప్రస్తుతం చాలా విషయాల్లో సడలింపులు ఇచ్చేశారు. కరోనాతో కలిసి జీవించక తప్పదని పలుమార్లు స్పష్టంచేసిన గులాబీ బాస్.. కేంద్ర మార్గదర్శకాల మేరకు పలు ఆంక్షలను ఎత్తివేశారు.

తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు మినహా ప్రస్తుతం ఎక్కడా కేసులు నమోదు కావడంలేదు. దీంతో ఆయా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు కూడా తిప్పుతున్నారు. అయితే, రాష్ట్రమంతా రాత్రివేళ కర్ఫ్యూ మాత్రం యథాతథంగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కూడా ఆ లోపలే తమ ట్రిప్పులు ముగించుకుని వచ్చేలా షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. తాజాగా ఇందులోనూ మినహాయింపు ఇచ్చారు. ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ వర్తించదని ప్రకటించారు. అంతేకాకుండా రాత్రి వేళ బస్టాండ్ల నుంచి ఆటోలు, ట్యాక్సీలు తిరగడానికి కూడా అనుమతించారు. దీంతో బస్సులు తిరిగే జిల్లాల్లో కర్ఫ్యూ దాదాపు లేనట్టే. రెండు నెలల తర్వాత రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సుల ఆదాయం పెంపొందించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్ లో కేసులు ఇంకా నమోదవుతుండటంతో సిటీ బస్సులను అనుమతించలేదు. అలాగే వ్యాపార సముదాయాలను సరి-బేసి పద్ధతిలో తెరుచుకునేందుకు అనుమతించారు. తాజాగా వాటి విషయంలోనూ సడలింపులు ఇచ్చారు. మాల్స్ లో ఉన్న షాపులు మినహా మిగిలిన షాపులన్నీ యథావిధిగా తెరుచుకోవచ్చు. తక్కువ షాపులు ఉంటే ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉంటుందనే భావనతో ప్రస్తుతం అన్ని షాపులూ తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినట్టు ప్రకటించారు. మరోవైపు ఈనెల కూడా వేతన జీవికి నిరాశ తప్పదు. మే నెల జీతాల్లో కూడా కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రతినిధులకు 75 శాతం, అఖిల భారత సర్వీసు అధికారులకు 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం, పింఛనుదారులకు 25 శాతం కోత విధించనున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...