Switch to English

చైనాతో యుద్ధమా.? రాజకీయాలొద్దు ప్లీజ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,451FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ చైనా – భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనాలోనే పుట్టిన కరోనా వైరస్‌ పట్ల అగ్రరాజ్యం అమెరికా గుర్రుమంటోన్న విషయం విదితమే. అసలు ఆ వైరస్‌ పుట్టు పూర్వోత్తరాలేంటన్నదానిపై విచారణ జరగాల్సిందేనని ప్రపంచ దేశాలతోపాటు భారతదేశం కూడా నినదించడం చైనాకి ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ కారణంగానే, సరిహద్దుల్లో కవ్వింపులు షురూ చేసింది. పొరుగునున్న నేపాల్‌ని కూడా భారతదేశం మీదకి ఎగదోస్తోంది చైనా. పాకిస్తాన్‌ – చైనాల మధ్య స్నేహం గురించి తెలియనిదెవరికి.? వెరసి, భారతదేశానికి సరిహద్దుల్లో శతృవులు పెరిగిపోతున్నారన్నమాట.

భారత భూభాగానికి సమీపంలో చైనా, భారీ స్థాయిలో సైన్యాన్నీ, ఆయుధాల్ని మోహరిస్తోంది. ‘ఏ క్షణాన అయినా చైనా, భారతదేశం మీద యుద్ధం ప్రకటించవచ్చు..’ అనేలా వుంది పరిస్థితి. మరోపక్క, సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. కీలక విభాగాలతో. రక్షణ సలహాదారు అజిత్‌ దోభాల్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయితే, పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించినంత తేలిక కాదు, చైనాతో వ్యవహారం. ఆయుధ సంపత్తి పరంగా చూసుకుంటే, చైనా కంటే భారత్‌ వెనుకబడి వుందన్నది నిర్వివాదాంశం. అదే సమయంలో, యుద్ధమంటూ జరిగితే చైనాకి ధీటుగా బదులివ్వగల సత్తా భారతదేశానికి వుంది. అయినాగానీ, ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం ఇరు దేశాలకీ మంచిది కాదు. మరీ ముఖ్యంగా భారతదేశానికి అసలే మంచిది కాదు.

కానీ, సరిహద్దుల్లో చైనా కవ్వింపులు ముదిరి పాకాన పడుతున్నాయి. చాలా ఏళ్ళ క్రితమే భారత్‌లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్న చైనా, ఇప్పుడు కొత్త వివాదాల్ని తెరపైకి తెస్తోంది. పాక్‌ ఆక్రమిత కాశ్మిర్‌ అని ఎలా అంటున్నామో, చైనా ఆక్రమిత కాశ్మీర్‌ కూడా వుంది.. అదే అక్సాయ్‌ చిన్‌. దానికి సమీపంలో, భారతదేశంలో వున్న ప్రాంతాలూ తమవేనని చైనా అంటోంది. చైనాతో దౌత్యపరంగా చేయడానికేమీ వుండదు. ఎందుకంటే, చైనా బుద్ధి ఎప్పటికీ మారదు.

ఇదిలా వుంటే, పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత రాజకీయం చేసిందో చూశాం. గత ఎన్నికల్లో ఆ సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశాన్ని అత్యద్భుతంగా వాడేసుకున్నారు కమలనాథులు. ఇప్పుడూ అదే స్థాయి రాజకీయానికి తెరలేపారన్న విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

‘దౌత్యం’లో మోడీ సర్కార్‌ విఫలమయ్యిందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. కాంగ్రెస్‌ కావొచ్చు, మరో రాజకీయ పార్టీ కావొచ్చు.. ఈ సందర్భంలో రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఏదిఏమైనా, భారతదేశం ఏదన్నా సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడే ఇలాంటి సరిహద్దు సమస్యలు ఎందుకు వస్తుంటాయో ఏమో.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...