రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన ఏపీ 24/7 ఛానెల్ తక్కువ సమయంలోనే మంచిపేరు తెచ్చుకుంది. రాజధాని కేంద్రంగా ఛానెల్ ప్రసారాలు చేయటం, పేరులోనే ఏపీ ఉండటంతో ఆంధ్రా ప్రేక్షకులు కూడా మన అనే ఫీలింగ్ తో ఆదరించారు. అంతా బాగుందనుకున్నంటున్న సమయంలో మంది ఎక్కువయితే మజ్జిగ పలచనైనట్లు డైరెక్టర్లు సుమారు 12 మంది ఉండటంతో ఛానెల్ ను నడిపే తీరులో అంతర్గతంగా లుకలుకలు స్టార్టయ్యాయి. సీఈవోగా ఉన్న వెంకటకృష్ణ ఆన్ స్క్రీన్ పై చూపించిన పనితీరుకు భిన్నంగా ఆఫ్ స్క్రీన్ లో పనిచేయటం కూడా ఇంకొన్ని ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో టిడిపికి ఈ ఛానెల్ అనుకూలంగా పనిచేసిందని నిర్ధారించిన వైసీపీ టాప్ సర్కిల్ తాము పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ ఛానెల్ ను టార్గెట్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏకంగా వెంకట కృష్ణ తన పదవికి రిజైన్ చేసి వెళ్లిపోవటం ఈ గుసగుసల్ని నిర్ధారించేట్లు చేసింది. ఈ నేపధ్యంలో ఛానెల్ నుండి బయటకు వెళ్లిన వీకే.. రాజ్ న్యూస్ ను హ్యాండోవర్ చేసుకోవాలని ప్రయత్నించటంతో సహా ఇంకొన్ని ప్రయత్నాలు చేసి అవన్నీ ఫలించని నేపధ్యంలో తిరిగి ఏపీ 24/7 లో రీఎంట్రీ ఇచ్చారు.
ఓవైపు వైసీపీకి యాంటీ ముద్ర వేసుకోవటం, ఛానెల్ ఆర్ధికవనరులు బాగా తగ్గిపోవటం వంటి పరిణామాలు ఛానెల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వీటన్నింటితో పాటు ఓ మహిళా యాంకర్ వ్యవహారం ఛానెల్ లో దుమారం రేపింది. డిప్యూటీ సీఈవోగా స్టాఫ్ అంతా అనధికారికంగా, సెటైరికల్ గా పిలుచుకునే సదరు యాంకర్ తీరుతో సాటి యాంకర్లు, పీసీఆర్ సిబ్బంది ఎన్నో ఇబ్బందులు చవిచూశారు. ఇందుకు ఛానెల్ లో కీరోల్ లో ఉన్న వ్యక్తి అండదండలు ఆ యాంకర్ కు ఉన్నట్లు బహిరంగ రహస్యం..అయితే వారిద్దరి మధ్య సంబంధం ఏంటని మీరు మమ్మల్ని ఏమీ అడగొద్దు, ఈపాటికే మీకు అర్ధమై ఉంటుందని భావిస్తున్నాం…తోటి యాంకర్లకు షెడ్యూలింగ్ ఇవ్వటం, ఇంటర్వ్యూల విషయంలో తనదే తుది నిర్ణయం కావటం, సిబ్బంది దగ్గర గర్వం ప్రదర్శించటం వంటి ఆమె చేష్టలతో అందరూ విసిగిపోయారట.
ఇదంతా ఒక ఎత్తయితే మార్కెటింగ్ లో కీలకస్థాయిలో ఉన్న ఒక వ్యక్తిపై వీకే చేయి చేసుకోవటం ఆ ఇష్యూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో అప్పటివరకూ జరుగుతున్న తంతు చూసి విసిగిపోయిన ఛానెల్ ఛైర్మన్ మురళీకృష్ణం రాజు ఏకంగా తనపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తాను ఛానెల్ ను నడపలేనంటూ చెప్పుకొచ్చిన ఆయన, ఆ తర్వాత ఏం చేశారో కానీ వీకే మొత్తానికి ఛానెల్ నుండి బయటకు వెళ్లటం తప్పనిసరైంది. ఎన్నికల తర్వాత వీకే ఎందుకు బయటకు వెళ్లారో మళ్లీ నాలుగు నెలలకే ఎందుకు జాయినయ్యారో, ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఎందుకు మానేసారో తెలియని సామాన్య సిబ్బంది మాత్రం అసలు ఛానెల్ లో ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేకపోవటం మళ్లీ కరోనా కష్టాలు ఎదురవ్వటంతో మమ్మల్ని బయటపడేసే నాధుడెవ్వరని వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వాళ్ల ఆశలు చిగురించేలా బయటకు వెళ్లిన ఛైర్మన్ మురళీ కృష్ణంరాజు సోమవారం (27 వ తారీఖు )ఛానెల్ కార్యాలయానికి రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీకే టీం గా ముద్రపడి ఛానెల్ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నవారందరినీ పక్కనబెట్టేందుకు కూడా ఆయన ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న సిబ్బంది జీతాల్ని కూడా త్వరలోనే క్లియర్ చేయనున్నట్లు భోగట్టా.
ప్రస్తుతం జంబో టీంగా ఉన్న డైరెక్లర్ల సంఖ్య కూడా నాలుగుకు కుదించినట్లు తెలుస్తోంది. ఇందులో మురళీ కృష్ణంరాజు షేర్ దాదాపు 80 శాతం కాగా దిలీప్ వర్మ, మిల్లెట్ రాజులతో పాటు మరొక డైరెక్టరు మిగతా షేర్లను పంచుకున్నట్లు సమాచారం. ఓవరాల్ గా ఉద్ధానపతనాల్నిఅత్యంత వేగంగా చవి చూసిన ఏపీ 24/7 ఛానల్ ఇప్పుడు కీలకదశలో ఉంది. దానితోనే ఆ ఛానెల్ సిబ్బంది భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ఏది ఏమైనా ఒక ఛానెల్ లో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు కొంతమంది యాంకర్ల చేతిలో కీలుబొమ్మల్లా మారి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పోతే ఆ ఛానెల్ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారుతుందనటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు..ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే ఛానెల్ కు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ సిబ్బందికి జీతాలు కావాలనే ఆపారనీ , అందుకు కారణమైన సదరు కీలకవ్యక్తులు, భారీ మొత్తాన్ని(సుమారు 8 కోట్లు) పక్కదారిపట్టించారన్న వార్తలు ఇప్పుడు మీడియా సర్కిల్స్ లోనూ, ఆ ఛానెల్ లోనూ గుప్పుమంటున్నాయి. ఇందులో నిజానిజాలు ఇంకా బయటపడలేదు కానీ…లోగుట్టు మాత్రం పెరుమాళ్లకే ఎరుక…
716544 662634After study numerous the websites together with your site now, and that i genuinely appreciate your method of blogging. I bookmarked it to my bookmark website list and are checking back soon. Pls have a look at my web page likewise and let me know if you agree. 53079
Asking questions are truly nice thing if you are not understanding
anything totally, except this post presents pleasant understanding even.
210056 259611Hello there, I discovered your weblog by way of Google at exactly the same time as searching for a comparable subject, your internet site got here up, it seems to be fantastic. Ive bookmarked it in my google bookmarks. 738557