Switch to English

ఎక్స్ క్లూజివ్: ఏపీ 24/7 ఛానెల్ ఇబ్బందులకు కారణమయిన ఒక యాంకర్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ కేంద్రంగా ప్రారంభమైన ఏపీ 24/7 ఛానెల్ తక్కువ సమయంలోనే మంచిపేరు తెచ్చుకుంది. రాజధాని కేంద్రంగా ఛానెల్ ప్రసారాలు చేయటం, పేరులోనే ఏపీ ఉండటంతో ఆంధ్రా ప్రేక్షకులు కూడా మన అనే ఫీలింగ్ తో ఆదరించారు. అంతా బాగుందనుకున్నంటున్న సమయంలో మంది ఎక్కువయితే మజ్జిగ పలచనైనట్లు డైరెక్టర్లు సుమారు 12 మంది ఉండటంతో ఛానెల్ ను నడిపే తీరులో అంతర్గతంగా లుకలుకలు స్టార్టయ్యాయి. సీఈవోగా ఉన్న వెంకటకృష్ణ ఆన్ స్క్రీన్ పై చూపించిన పనితీరుకు భిన్నంగా ఆఫ్ స్క్రీన్ లో పనిచేయటం కూడా ఇంకొన్ని ఇబ్బందులకు గురిచేసింది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో టిడిపికి ఈ ఛానెల్ అనుకూలంగా పనిచేసిందని నిర్ధారించిన వైసీపీ టాప్ సర్కిల్ తాము పవర్ లోకి వచ్చిన తర్వాత ఈ ఛానెల్ ను టార్గెట్ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏకంగా వెంకట కృష్ణ తన పదవికి రిజైన్ చేసి వెళ్లిపోవటం  ఈ గుసగుసల్ని నిర్ధారించేట్లు చేసింది. ఈ నేపధ్యంలో ఛానెల్ నుండి బయటకు వెళ్లిన వీకే.. రాజ్ న్యూస్ ను హ్యాండోవర్ చేసుకోవాలని ప్రయత్నించటంతో సహా ఇంకొన్ని ప్రయత్నాలు చేసి అవన్నీ ఫలించని నేపధ్యంలో తిరిగి ఏపీ 24/7 లో రీఎంట్రీ ఇచ్చారు.

ఓవైపు వైసీపీకి యాంటీ ముద్ర వేసుకోవటం, ఛానెల్ ఆర్ధికవనరులు బాగా తగ్గిపోవటం వంటి పరిణామాలు ఛానెల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వీటన్నింటితో పాటు ఓ మహిళా యాంకర్ వ్యవహారం ఛానెల్ లో దుమారం రేపింది. డిప్యూటీ సీఈవోగా స్టాఫ్ అంతా అనధికారికంగా, సెటైరికల్ గా పిలుచుకునే సదరు యాంకర్ తీరుతో సాటి యాంకర్లు, పీసీఆర్ సిబ్బంది ఎన్నో ఇబ్బందులు చవిచూశారు. ఇందుకు ఛానెల్ లో కీరోల్ లో ఉన్న వ్యక్తి అండదండలు ఆ యాంకర్ కు ఉన్నట్లు బహిరంగ రహస్యం..అయితే  వారిద్దరి మధ్య సంబంధం ఏంటని మీరు మమ్మల్ని ఏమీ అడగొద్దు, ఈపాటికే మీకు అర్ధమై ఉంటుందని భావిస్తున్నాం…తోటి యాంకర్లకు షెడ్యూలింగ్ ఇవ్వటం, ఇంటర్వ్యూల విషయంలో తనదే తుది నిర్ణయం కావటం, సిబ్బంది దగ్గర గర్వం ప్రదర్శించటం వంటి ఆమె చేష్టలతో అందరూ విసిగిపోయారట.

ఇదంతా ఒక ఎత్తయితే  మార్కెటింగ్ లో కీలకస్థాయిలో ఉన్న ఒక వ్యక్తిపై వీకే చేయి చేసుకోవటం ఆ ఇష్యూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంతో అప్పటివరకూ జరుగుతున్న తంతు చూసి విసిగిపోయిన ఛానెల్ ఛైర్మన్ మురళీకృష్ణం రాజు ఏకంగా తనపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో తాను ఛానెల్ ను నడపలేనంటూ చెప్పుకొచ్చిన ఆయన, ఆ తర్వాత ఏం చేశారో కానీ వీకే మొత్తానికి ఛానెల్ నుండి బయటకు వెళ్లటం తప్పనిసరైంది. ఎన్నికల తర్వాత వీకే ఎందుకు బయటకు వెళ్లారో మళ్లీ నాలుగు నెలలకే ఎందుకు జాయినయ్యారో, ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఎందుకు మానేసారో తెలియని సామాన్య సిబ్బంది మాత్రం అసలు ఛానెల్ లో ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేకపోవటం మళ్లీ కరోనా కష్టాలు ఎదురవ్వటంతో మమ్మల్ని బయటపడేసే నాధుడెవ్వరని వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వాళ్ల ఆశలు చిగురించేలా బయటకు వెళ్లిన ఛైర్మన్ మురళీ కృష్ణంరాజు సోమవారం (27 వ తారీఖు )ఛానెల్ కార్యాలయానికి రానున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీకే టీం గా ముద్రపడి ఛానెల్ ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్నవారందరినీ పక్కనబెట్టేందుకు కూడా ఆయన ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్ లో ఉన్న సిబ్బంది జీతాల్ని కూడా త్వరలోనే క్లియర్ చేయనున్నట్లు భోగట్టా.

ప్రస్తుతం జంబో టీంగా ఉన్న డైరెక్లర్ల సంఖ్య కూడా నాలుగుకు కుదించినట్లు తెలుస్తోంది. ఇందులో మురళీ కృష్ణంరాజు షేర్ దాదాపు 80 శాతం కాగా దిలీప్ వర్మ, మిల్లెట్ రాజులతో పాటు మరొక డైరెక్టరు మిగతా షేర్లను పంచుకున్నట్లు సమాచారం. ఓవరాల్ గా ఉద్ధానపతనాల్నిఅత్యంత వేగంగా చవి చూసిన ఏపీ 24/7 ఛానల్ ఇప్పుడు కీలకదశలో ఉంది. దానితోనే ఆ ఛానెల్ సిబ్బంది భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ఏది ఏమైనా ఒక ఛానెల్ లో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు కొంతమంది యాంకర్ల చేతిలో కీలుబొమ్మల్లా మారి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పోతే ఆ ఛానెల్ భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా మారుతుందనటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు..ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే ఛానెల్ కు ఆదాయం బాగానే ఉన్నప్పటికీ సిబ్బందికి జీతాలు కావాలనే ఆపారనీ , అందుకు కారణమైన సదరు కీలకవ్యక్తులు, భారీ మొత్తాన్ని(సుమారు 8 కోట్లు) పక్కదారిపట్టించారన్న వార్తలు ఇప్పుడు మీడియా సర్కిల్స్ లోనూ, ఆ ఛానెల్ లోనూ గుప్పుమంటున్నాయి. ఇందులో నిజానిజాలు ఇంకా బయటపడలేదు కానీ…లోగుట్టు మాత్రం పెరుమాళ్లకే ఎరుక…

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...