Switch to English

మమత వైఖరిపై బాబు అసంతృప్తి?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలను తమ జీవన్మరణ సమస్యగానే భావిస్తున్నాయి. గెలుపు కోసం సర్వ శక్తులూ ఓడ్డుతున్నాయి. విజయం సాధించడానికి ఉన్న ఏ మార్గాన్నీ కూడా వదిలిపెట్టడంలేదు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొత్తగా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఎవరూ లేరు. ఆ పార్టీకి సంబంధించినంత వరకు అన్నీ జగనే. పార్టీ భారం మొత్తం ఆయనపైనే ఉంది. తాజాగా ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ జగన్ కు తోడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తమ ప్రచారానికి జాతీయ నేతల సహాయం తీసుకుంటున్నారు.

ఓవైపు తాను రాష్ట్రం చుట్టేస్తూ.. మరోవైపు ఇతర పార్టీల నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల సేవలను వినియోగించుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్.. చంద్రబాబు మనసెరిగి ప్రచారం చేశారు. అంటే వైఎస్సార్ సీపీ అధినేత జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆయనకు అధికారం అప్పగించొద్దని కోరారు.

ఫరూక్ అయితే ఓ అడుగు ముందుకేసి, వైఎస్ మరణానంతరం తనకు సీఎం పదవిస్తే రూ.1500 కోట్లు ఇస్తారని ఆఫర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేని ఫరూక్ అబ్దుల్లా ఈ విషయం చెప్పడంతో ఎవరూ నమ్మలేదు. పైగా అదంతా అబద్ధమంటూ కాంగ్రెస్ ఖండించడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు కేజ్రీవాల్ మాత్రం జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కోరుకున్నట్టుగానే జగన్ పై ఆరోపణలు చేశారు.

అయితే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈ విషయంలో జగన్ ను ఒక్క మాట కూడా విమర్శించలేదు. విశాఖపట్నంలో ఆదివారం ఆర్భాటంగా ఏర్పాటుచేసిన సభలో మమత పాల్గొన్నారు. అయితే, ఆమె ప్రసంగం మొత్తం ప్రధాని మోదీ చుట్టూనే తిరిగింది. తాను ఓ జాతీయ నేత అని, లోకల్ పాలిటిక్స్ తో తనకు ఏం సంబంధం అన్నట్టుగా.. మోదీనే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించారు.

ఈసారి మోదీ ఇంటికే అని, ఢిల్లీ పీఠం తమదేనంటూ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునే మరోసారి ఎన్నుకోండనే మాట మినహా రాష్ట్రానికి సంబంధించి ఆమె ఏమీ మాట్లాడకపోవడం చంద్రబాబుతోపాటు ఆ పార్టీ కేడర్లో నిరాశ కలిగించిందని సమాచారం. కేజ్రీవాల్ ఆరోపణలు చేసినట్టుగానే మమత కూడా జగన్ పై ఆరోపణలు చేయాలని బాబు భావించారు.

అయితే, ఆమె అస్సలు జగన్ ప్రస్తావనే తీసుకురాలేదు. పైగా ప్రసంగాలు ముగిశాక నేతలందరూ వేదికపై చేతులెత్తి సంఘీభావం ప్రకటించడం చూస్తుంటాం. ఇందుకు చంద్రబాబు ప్రయత్నించగా.. మమత పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ విషయంలో మమత వ్యూహం కూడా సరైనదే అంటున్నారు.

ప్రధాని రేసులో ఉన్న మమత లక్ష్యం మోదీ మాత్రమేనని, జగన్ కాదని.. అందువల్లే ఆమె జగన్ ప్రస్తావన తీసుకురాలేదని అంటున్నారు. ప్రాంతీయ పార్టీల అండదండలతో ప్రధాని పీఠం అధిరోహించాలని భావిస్తున్న మమత అనవసరంగా ఏ పార్టీతోనూ కయ్యం తెచ్చుకోవాలని భావించరని, అందువల్లే జగన్ కు వ్యతిరేకంగా విమర్శలు చేయలేదని విశ్లేషిస్తున్నారు. మొత్తమ్మీద మమత వైఖరి చంద్రబాబుకు కొంచెం అసంతృప్తి కలిగించిందని చెప్పొచ్చు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...