Switch to English

అల.. విమర్శలపై త్రివిక్రమ్ స్పందన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

‘అల… వైకుంఠపురంములో’ చిత్రానికి భారీ వసూళ్లు, చక్కటి ప్రశంశలు వచ్చాయి. అదే సమయంలో కొన్ని విమర్శలూ వచ్చాయి. పాత తెలుగు చిత్రం ‘ఇంటి గుట్టు’ స్పూర్తితో త్రివిక్రమ్ ఈ చిత్రం తీశారనీ, ‘అల..’లో ద్వితీయార్థం అంతా ‘అత్తారింటికి దారేది’ని అటూ ఇటూ మార్చి తీసినట్టు ఉంటుందని కామెంట్స్ వినిపించాయి. వీటిపై త్రివిక్రమ్ స్పందించారు.

“పదేళ్లుగా విమర్శలు చేయడం ఫ్యాషన్ అయింది. విజయవంతమైన ప్రతి చిత్రం ఫలానా చిత్రానికి కాపీ అనో, ఆ కథ నాదేననో, మరొకటనో రచ్చ చేస్తున్నారు. ‘మగధీర’ నుండి ఇప్పటివరకూ ఈ మధ్య కాలంలో ఇటువంటి సమస్యలు, విమర్శలు ఎదుర్కొని సినిమా ఏది ఉందో చెప్పండి? ఆ విమర్శల్లో నిజం ఎంతో? అవెంత నిలబడ్డాయో అందరికీ తెలుసు” అని త్రివిక్రమ్ అన్నారు.

ప్రేక్షకులు అందరినీ మెప్పించలేమని మాటల మాంత్రికుడు అభిప్రాయపడ్డారు. “నేను ‘చిరునవ్వు’తో సినిమాలో ఒక డైలాగ్ రాశా. ఇప్పుడూ అదే చెబుతా. “ప్రపంచంలో కొంతమందికి ఆంజనేయస్వామి అంటే ఇష్టం. కొందరికి షిరిడీ సాయిబాబా, కొందరికి వెంకటేశ్వరస్వామి ఇష్టం. దేవుడే మనుషులు అందరినీ మెప్పించలేకపోయాడు. మనమెంత? (నేనెంత? అని అర్థం)” అని త్రివిక్రమ్ సమాధానం ఇచ్చారు.

అల్లు అర్జున్, పూజా హెగ్డే మధ్య లవ్ ట్రాక్ కూడా విమర్శల నుండి తప్పించుకోలేకపోయింది. కాళ్లు అని చెప్పి హీరోయిన్ తొడలు చూపించారని కొందరు విమర్శించారు. వాటిపై త్రివిక్రమ్ స్పందిస్తూ “నిజంగా అటువంటి దురాలోచనతో ఆ సన్నివేశాలు తీయడలేదు. మా మనసులో ఆ ఇంటెన్షన్ లేదు. ఒకవేళ అలా తీసి ఉంటే ప్రేక్షకులు అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు” అన్నారు. దర్శకుడిగా అండగా అల్లు అర్జున్ నిలబడ్డారు.

సంక్రాంతి విన్నర్, ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్లు వేయడం గురించీ త్రివిక్రమ్ మాట్లాడారు. “సినిమా విడుదలైన పది, పన్నెండు రోజుల తర్వాత ఇండస్ట్రీ హిట్ అని అనౌన్స్ చేశాం. వసూళ్లు ఒక్క రూపాయి తక్కువ వచ్చాయని చెప్పినా అల్లు అరవింద్ గారు ఒప్పుకుంటారు. కానీ, ఒక్క రూపాయి ఎక్కువ చెబితే తాట తీస్తారు. రిజల్ట్ అర్థమైన తర్వాతే సంక్రాంతి హిట్ అని పోస్టర్ వేశాం” అని త్రివిక్రమ్ చెప్పారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...