Switch to English

అబ్జర్వేషన్‌: ఉత్తరాంధ్రని వెనక్కి నెట్టిందెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అయినా, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో అయినా.. అత్యంత వెనుకబడిన జిల్లాల లిస్ట్‌ తీస్తే, ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచేది శ్రీకాకుళం. విజయనగరం జిల్లా పరిస్థితి కూడా అంతే. శ్రీకాకుళంతో పోల్చితే విజయనగరం కాస్త బెటర్‌. విశాఖపట్నం రూపంలో పెద్ద నగరం వున్నా, జిల్లా పరంగా చూస్తే విశాఖపట్నం కూడా వెనుకబడిన జిల్లాగానే భావించాలి.

నిజానికి, ఉత్తరాంధ్ర రాజకీయ చైతన్యంలో వెనకబడి లేదు. బోల్డంతమంది రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర నుంచి ఎదిగారు. కానీ, వెనుకబాటు గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా, ముందుగా ఉత్తరాంధ్ర పేరు విన్పిస్తుంటుంది. గడచిన రెండు మూడు దశాబ్దాల్ని చూసుకుంటే, ఉత్తరాంధ్ర మరింత వెనక్కి నెట్టివేయబడ్డ మాట వాస్తవం. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ‘ఉద్దానం’, కిడ్నీ వెతలతో విలవిల్లాడుతోందంటే, ఆ పాపం పాలకులది కాక ఇంకెవరిది.?

ఉత్తరాంధ్ర నుంచి రాజకీయంగా ఎదిగినవారిలో చాలామందే వున్నారని ఇప్పటికే చెప్పుకున్నాం. వారిలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు ముఖ్యులు. గంటా శ్రీనివాసరావు,, అచ్చెన్నాయుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్‌ చాలానే వుంటుంది. విశాఖ సంగతి పక్కన పెడితే, ఈ మధ్య విజయనగరం – శ్రీకాకుళం జిల్లాల వెనుకబాటుతనం గురించిన చర్చ జోరుగా సాగుతోంది.

అసెంబ్లీ సాక్షిగా శ్రీకాకుళం వెనుకబాటుతనం గురించి ధర్మాన పెద్ద ప్రసంగమే చేశారు. బొత్స తక్కువేమీ తిన్లేదు. అయితే, ఉత్తరాంధ్రలో.. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇటు ధర్మాన, అటు బొత్స ఆర్థికంగా ఎదిగిన వైనం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.

గడచిన రెండు దశాబ్దాల్లోనే వీరిద్దరి బంధుగణం అనూహ్యమైన రీతిలో ఆస్తుల్ని కూడేసిన మాట వాస్తవం. ఈ ఇద్దరి అవినీతి గురించి, గతంలో వైఎస్సార్సీపీ నేతలే గళం విప్పారు. అలాంటిది, విశాఖలో రాజధాని కావాలంటూ, దానికి ఉత్తరాంధ్ర వెనుకాబటుతనాన్ని ధర్మాన, బొత్స ప్రస్తావిస్తున్నారంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఏం, శ్రీకాకుళం జిల్లాలో.. విజయనగరం జిల్లాలో అభివృద్ధి గురించి ఎందుకు నినదించడంలేదు.? విశాఖ మీదనే వీళ్ళకి ప్రేమెందుకు.? ఆయా జిల్లాల ప్రజానీకం సంధిస్తున్న ప్రశ్నలివి.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌, అందులో వాల్టేరు డివిజన్‌.. వీటి గురించి ఇటు బొత్సగానీ, అటు ధర్మానగానీ మాట్లాడకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ప్రత్యేక హోదాతోపాటు, ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి రావాల్సిన ప్యాకేజీపై ఈ ఇద్దరూ గళం విప్పడంలేదెందుకు.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...