Switch to English

రాహుల్‌ వర్సెస్‌ శ్రీముఖి: ‘బిగ్‌’ రచ్చ రంబోలా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

రాహుల్‌ సిప్లిగంజ్‌, శ్రీముఖి.. బిగ్‌హౌస్‌లోకి రాకముందే మంచి స్నేహితులట. కానీ, ఆ స్నేహం కాస్తా బద్దలైపోయింది బిగ్‌ హౌస్‌ పుణ్యమా అని. తమ మధ్య తలెత్తిన చిన్న వివాదం కారణంగా శ్రీముఖి, పదే పదే రాహుల్‌ని అర్థం పర్థం లేకుండా నామినేట్‌ చేస్తూ వచ్చింది. ఎలాగోలా రాహుల్‌, శ్రీముఖితో గొడవని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు.

తాజాగా మరోసారి శ్రీముఖి, రాహుల్‌ ఒకరి మీద ఒకరు గట్టిగా అరిచేసుకున్నారు. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా రెండో స్థానం దక్కించుకుని సేఫ్‌ అవుదామనుకున్న శ్రీముఖి, ఈ క్రమంలో రాహుల్‌ని బతిమాలుకోవాల్సి వచ్చింది. కానీ, ఇక్కడ శ్రీముఖి అహం ప్రదర్శించింది. నెంబర్‌ 2 పొజిషన్‌లో వున్న రాహుల్‌ని మెప్పించి, ఆ పొజిషన్‌ దక్కించుకునే అవకాశాన్ని పక్కన పెట్టి.. రాహుల్‌ని డామినేట్‌ చేయాలనుకుంది.

‘ఇప్పటిదాకా జరిగిన టాస్క్‌లలో నువ్వు ఇచ్చిన బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఏంటో ఒక్కటి చెప్పు?’ అంటూ శ్రీముఖి నిలదీసింది. ‘నా సంగతి తర్వాత.. నేనున్న పొజిషన్‌ కావాలనుకుంటున్నావు కాబట్టి, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు..’ అంటూ రాహుల్‌ తొలుత మామూలుగానే చెప్పాడు. కానీ, శ్రీముఖి అందుకు ఒప్పుకోలేదు. రాహుల్‌ని పదే పదే కించపర్చేలా వ్యవహరించింది. రాహుల్‌ని ఎలా రెచ్చగొడితే అతను రెచ్చిపోతాడో, మాటలు తూలేస్తాడో శ్రీముఖికి బాగా తెలుసు. అయితే, రాహుల్‌ ఇక్కడ కాస్త తనను తాను కంట్రోల్‌ చేసుకోగలిగాడు.

కాస్సేపు మాటల యుద్ధం గట్టిగానే సాగినా, చివరికి శ్రీముఖి పప్పులుడకలేదు. చిత్రమేంటంటే, నెంబర్‌ వన్‌ బోర్డు దగ్గరున్న బాబా భాస్కర్‌, ఆ పొజిషన్‌ని శ్రీముఖికి ఇచ్చేస్తానని ముందే చెప్పాడు. సింపుల్‌గా బాబాని మెప్పించి, ఆ పొజిషన్‌ దక్కించుకునే అవకాశం వున్నా.. రాహుల్‌తో గొడవ పెట్టుకోవడం.. తద్వారా స్క్రీన్‌ స్పేస్‌ దక్కించుకోవడం.. అనే అతి తెలివితేటలే ప్రదర్శించి అభాసుపాలయ్యింది శ్రీముఖి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

ఎక్కువ చదివినవి

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...