యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని మన తెలుగు ఆడియన్స్ పిలుచుకుంటారు కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అండ్ ఇప్పుడు బాహుబలి ప్రభాస్ అని అంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్ రావడంతో ప్రభాస్ తన ప్రతి సినిమాని ఇండియన్ ఫాన్స్ కి అందించాలని అదే రేంజ్ లో చేస్తున్నారు. ఇటీవల వచ్చిన సాహో కూడా మూడు భాషల్లో షూట్ చేశారు.
తన తదుపరి సినిమా ‘జాన్(వర్కింగ్ టైటిల్)’ కూడా అదే రేంజ్ లో షూట్ జరగనుంది. తాజా సమాచారం ప్రకారం ఓ క్రేజీ కాంబినేషన్ ని ప్రభాస్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రభాస్ లానే హిందీలో సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. సాహో రిలీజ్ కి ముందే క్రిష్ ప్రభాస్ ని కలిసి సినిమా చేయడానికి మాట్లాడారు. అలాగే గత కొద్దీ రోజులుగా ప్రభాస్ ని రెగ్యులర్ గా కలుస్తూ కొన్ని లైన్స్ ని చెప్పారు. ప్రభాస్ కూడా ఓ యాక్షన్ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం ప్రభాస్ – క్రిష్ ఫిల్మ్ జస్ట్ స్టోరీ లైన్ డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. నవంబర్ కల్లా ఈ సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే ఇండియా వైడ్ మంచి సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మనం కూడా ఈ క్రేజీ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలని కోరుకుందాం.
837363 868154Real instructive and fantastic anatomical structure of articles , now thats user pleasant (:. 472462
55905 576197So, is this just for males, just for females, or is it for both sexes If it s not, then do women need to have to do anything different to put on muscle 449163