Switch to English

‘వాల్మీకి’ : థియేటర్లో మిమ్మల్ని సర్ప్రైస్ చేసే 5 పాయింట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘ముకుంద’, ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘అంతరిక్షం’, ‘F2’ లాంటి సినిమాలతో క్లాస్ లుక్లో, కామెడీ టైమింగ్ తో కంప్లీట్ ఎంటర్టైనర్ మరియు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్. ఇప్పటి వరకూ చేసిన పాత్రలకి బ్రేక్ ఇచ్చి కంప్లీట్ గా లుక్ అండ్ డిక్షన్ మార్చి కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా చేసిన ‘వాల్మీకి’ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవర్ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్స్ తీయడంలో ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్న హరీష్ శంకర్ డైరెక్టర్ కావడం, టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ అయిన పూజ హెగ్డే హీరోయిన్ అవ్వడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా పరంగా చూసుకుంటే ఆడియన్స్ ఈ సినిమాలో చాలానే సర్ప్రైజ్ లు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో 5 విషయాలు మీ చేత ఈలలు వేయించి గోల చేసేలా నచ్చుతాయి. వాల్మీకి’లో మీరు వావ్ అనుకునే చేసే 5 పాయింట్స్ లోకి వెళితే..

1. వరుణ్ తేజ్

Valmiki

వరుణ్ తేజ్ హీరో.. అది అందరికీ తెలిసిందే అందులో స్పెషాలిటీ ఏముందా అని అనుకోకండి.. వరుణ్ తేజ్ ఇప్పటి వరకూ కూల్ అండ్ క్లాస్ గా ఉండే పాత్రలు, లవర్ బాయ్ గా చేసే పాత్రలే చేసాడు. కానీ కంప్లీట్ మాస్ మసాలా ఫిలిం ఒక్కటి కూడా టచ్ చేయలేదు. కానీ మెగా ఫ్యామిలీ కి మాస్ లో ఉన్న క్రేజే వేరు. అందుకే ఈ సారి కంప్లీట్ లుక్స్, మ్యానరిజమ్స్, సరికొత్త డైలాగ్ డిక్షన్, నెగటివ్ షేడ్స్ లో వైల్డ్ గా కనిపించడంతో పాటు హై రేంజ్ హీరోయిజం ఉన్న పాత్ర చేయడం ఇదే మొదటి సారి. ఇప్పటికే రిలీజ్ అయినా ట్రైలర్ మరియు అందులోని డైలాగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకులని థియేటర్స్ కి వచ్చేలా బజ్ క్రియేట్ అయ్యింది.

Also Read: వాల్మీకి మూవీ యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్

అలాగే మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఈ సినిమా పక్కాగా వరుణ్ తేజ్ కి మాస్ హీరో ఇమేజ్ ఇచ్చి నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఇంతమంది వరుణ్ తేజ్ ని మాస్ అప్పియరెన్స్ చూడాలనుకుంటున్న కాబట్టే టూ స్పెషల్ పాయింట్.

2. గద్దలకొండ గణేష్ – శ్రీదేవిల కాంబినేషన్

Varuntej Sridevi

1980-90 టైంలో జరిగే కథ కావడం, అలాగే అప్పటికే రౌడీయిజం అంటే మోజున్న గద్దెల కొండా గణేష్(వరుణ్ తేజ్) కి, లంగాఓణిలో క్యూట్, లవ్లీ అండ్ అమాయకంగా కనిపిస్తున్న శ్రీదేవి(పూజ హెగ్డే)ల మధ్య ప్రేమ కథ ఈ సినిమాకే కీలకం. ఇప్పటికే ప్రేక్షకులంతా శ్రీదేవి ప్రేమలో పడిపోయారు. ఎంతలా అంటే సోషల్ మీడియా లో వారి ఒరిజినల్ పేర్ల కంటే గణేష్ – శ్రీదేవిలుగానే ట్రెండ్ చేస్తున్నారు.

Also Read: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ మూవీ రివ్యూ & రేటింగ్

ఈ ప్రేమ కథకి బోనస్ గా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శోభన్ బాబు – శ్రీదేవి కాబినేషన్ లో వచ్చిన అల్ టైం ఫెవరైట్ సాంగ్ ‘వెళ్లువచ్చి గోదారమ్మ’ సాంగ్ రీమేక్ చెప్పడం మరో స్పెషల్ అట్రాక్షన్.

3. మనసు దోచుకున్న ఇద్దరు యంగ్ యాక్టర్స్

Atharva Mrinalni

‘వాల్మీకి’ ద్వారా ఒక హీరో, ఒక హీరోయిన్ తెలుగు వారికి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న అథర్వ మురళి ఈ సినిమాలో వరుణ్ తేజ్ పక్కన మరో హీరోగా నటించి తెలుగు వారికి పరిచయం కానున్నాడు. ఇప్పటికీ ఈ కుర్రోడు భలే ఉన్నాడే అనే క్రేజ్ తెలుగులో అథర్వకి మొదలైంది. అలాగే తమిళ్లో స్టార్ హీరో అయ్యుండి ఇక్కడ చేసాడు అంటే, ఆ రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో అనే హైప్ కూడా ఉంది.

చెన్నై భామ మిర్నాలిని రవి ఈ ఏడాదే తమిళ్లో పరిచయం అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ‘వాల్మీకి’ ట్రైలర్, సాంగ్ ప్రోమోస్ లో చూసి ఈ భామకి అబ్బాయిలు ఫిదా అయిపోయారు. దాంతో తెలుగులో సినిమాకి రిలీజ్ కి ముందే పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. అంతే కాకుండా సినిమా రిలీజ్ కాకముందే మరో మూడు సినిమాలకి సైన్ చేసేసింది. తెరపై అథర్వ – మిర్నాలిని రవి పెయిర్ ని చూడడానికి కూడా చాలా క్రేజ్ ఉంది.

వీరిద్దరితో పాటు మరో యంగ్ టాలెంట్ అయిన డింపుల్ హయాతి స్పెషల్ సాంగ్ మరో హైలైట్. కచ్చితంగా కుర్రకారంతా వెర్రెక్కిపోయేలా డింపుల్ స్టెప్స్ ఉండడం మరో స్పెషల్ బోనస్.

4. బ్రహ్మాజీ హిలేరియస్ కామెడీ

Brahmaji

హరీష్ శంకర్ సినిమాల్లో బ్రహ్మాజీ కి చాలా స్పెషల్ రోల్ ఉంటుంది. అలాగే ఇందులో కూడా రౌడీ గ్యాంగ్ కి యాక్టింగ్ క్లాసెస్ చెప్పే యాక్టింగ్ టీజర్ గా చేశారు. ఇప్పటికే ట్రైలర్ లో వచ్చిన ‘I’m not done yet’ డైలాగ్ అన్ని చోట్లా హల్ చల్ చేస్తోంది. ముఖాయమగా సెకండాఫ్ మొత్తం ఉంది కడుపుబ్బా నవ్వించే పాత్ర ఇది. సీరియస్ గా ఉంటూ పిచ్చ పిచ్చగా నవ్వించే పాత్రలో ఆడియన్స్ అందరినీ బ్రహ్మాజీ తెగ నవ్వించడం ఖాయం. బ్రహ్మాజీ కెరీర్లో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉన్న ఫుల్ లెంగ్త్ రోల్ చేయలేదు. సో బ్రహ్మజీ రోల్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

5. స్టార్స్ గెస్ట్ అప్పియరెన్స్

Nithin

కథా పరంగా ఈ సినిమాలో చాలా చోట్ల మనకు బాగా పరిచయం ఉన్న స్టార్స్ చాలా మంది కనపడుతుంటారు. స్పెషల్ అప్పియరెన్స్ పాత్రలు ఎప్పుడూ సినిమాకి ఒక పెద్ద బూస్టింగ్ లాగా హెల్ప్ అవుతాయి. మాకు తెలిసిన దాని ప్రకారం యంగ్ హీరో నితిన్, సాయి పల్లవి, స్టార్ డైరెక్టర్ సుకుమార్ లాంటి వాళ్ళు మిమ్మల్ని సినిమాలో సర్ప్రైజ్ చేస్తారు.

2 గంటల 54 నిమిషాల నిడివి ఉండే ‘వాల్మీకి’ సినిమా పూర్తయ్యే సరికి ప్రేక్షకుల చేత బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుందా? లేక ఓకే ఓకే అనిపించుకుంటుందా అనేది కచ్చితంగా చెప్పాలంటే ఇంకో 12 గంటలు ఆగాలి. కానీ మేము పైన చెప్పిన 5 పాయింట్స్ మాత్రం పక్కాగా మీచేత విజిల్స్ వేయిస్తాయి. ఇన్ని కొత్త పాయింట్స్ ఉన్నాయంటే బ్లాక్ బస్టర్ అవుతుందనే ఆశిద్దాం.. ఏమంటారు.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...