వాల్మీకి మూవీ యూఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం యొక్క యుఎస్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ కోసం ఈ పేజీ ని తప్పక చూడండి @ 6:00 PM EST, 3:30 AM IST

08:25 PM: సినిమా మొదటిలో గణేష్ ని కాల్చే సీన్ ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్. అలాగే రోలింగ్ టైటిల్ సీన్ తో కచ్చితంగా హ్యాపీగా, సర్ప్రైజ్ లా ఫీల్ అయ్యి నవ్వుకుంటూ బయటకి వస్తారు. సినిమా సమాప్తం.. శుభమ్.. మరికాసేపట్లో రివ్యూ ఇస్తాం..

08:20 PM: క్లైమాక్స్ లో గణేష్ అథర్వకి చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ బాగున్నాయ్.. శాంపిల్ డైలాగ్స్
‘సిన్మా డబ్బులు ఇస్తది అని తెలుసు , పేరు ఇస్తది అని తెలుసు కానీ నాకు ప్రేమని ఇచ్చింది’,      ‘నువ్వు నా కథ రాయడానికి రాలేదు, నా కథని మార్చడానికి వచ్చావు’

08:15 PM: అథర్వ – మృణాళిని రవి ప్రేమ కథ గురించి గణేష్ కి తెల్వగానే కథ మళ్ళీ సీరియస్ మోడ్ లోకి వెళ్ళింది. ఎమోషనల్ ఫీల్ వైపు వెళ్తున్న క్లైమాక్స్ కాస్త సాగదీస్తున్నట్టు ఉంది. కానీ వరుణ్ తేజ్ మాత్రం తన పెర్ఫార్మన్స్ తో సీన్ ని ఎలివేట్ చేస్తున్నాడు.

08:07 PM: సెకండాఫ్ చివరికి చేరుకునే సరికి అనవసరైన సీన్స్ తో కాస్త సాగదీస్తున్నట్టు వెళ్తోంది. కథలో గణేష్ సినిమా పెద్ద హిట్ అవుతుంది.

08:00 PM: అథర్వ ఆ రౌడీ గ్యాంగ్ తోనే సినిమా ఫినిష్ చేస్తాడు. చివరి రోజు జరిగే గుమ్మడికాయ పూజ సీన్ లో కామెడీ బాగుంది. అలాగే హిందీ నుంచి తెచ్చుకున్న విలన్స్ మీద రావు రమేష్ వేసే సెటైర్ చాలా బాగుంది.

07:55 PM: ఎలాగోలా యాక్టింగ్ ట్రైనింగ్ ఫినిష్ చేసి అథర్వ, గణేష్ హీరోగా సినిమా మొదలు పెట్టాడు. సెట్లో కూడా బ్రహ్మాజీ యాక్టింగ్ బాగా చెయ్యమని రౌడీస్ తో ఆదుకునే విధానం కామెడీగా ఉంటుంది.

07:50 PM: గద్దల కొండ గణేష్ మరియు ఆ రౌడీ గ్యాంగ్ కి యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి యాక్టింగ్ టీచర్ ముని మాణిక్యం పాత్రలో బ్రహ్మాజీ ఎంట్రీ.. కాస్త స్లో అవుతున్న సినిమాకి బ్రహ్మాజీ కామెడీ మళ్ళీ స్పీడ్ అవ్వడానికి హెల్ప్ అయ్యింది. బ్రహ్మాజీ పంచ్ డైలాగ్స్ నవ్విస్తాయి.

07:45 PM: అథర్వ చేసేదేమీ లేక ఆ రౌడీస్ తోనే ఆడియన్స్ చేయడం మొదలు పెడతాడు.. అందులో గణేష్ రామ్ చరణ్ మగధీర సినిమాలోని ‘ ఒక్కొక్కన్ని కాదు షేర్ ఖాన్’ డైలాగ్ చెప్పడం మెగా అభిమానులకి అరిచి గోలచేసి ఈలేసే మోమెంట్..

07:40 PM: అథర్వ రాసిన కథ విన్నాక గణేష్ నేనే హీరోగా చేస్తున్న అని చెప్పడం అథర్వకి బిగ్ షాక్..

07:35 PM: ‘జర్రా జర్రా’ అంటూ ఆల్రెడీ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన సాంగ్ విజువల్ గా కూడా మాస్ ఆడియన్స్ చేత స్టెప్పులేయిస్తుంది. సింగిల్ స్క్రీన్ లో ఈ పాటకి మామూలు గోల ఉండదు. మెయిన్ గా దింపులే హయతి స్టెప్స్, గ్లామర్ డోస్ సాంగ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది.

07:29PM: గద్దల కొండ గణేష్ కథ మొత్తం విన్న అథర్వ సినిమా కథ చేయడం మొదలు పెట్టాడు.

07:25PM: గణేష్ జీవితాన్ని మార్చేసే ఎమోషనల్ సీన్.. ఇప్పటి వరకూ సరదా సరదాగా కుర్రాడి లైఫ్ ని ఎంజాయ్ చేసిన గణేష్ గ్యాంగ్ స్టర్ గద్దల కొండ గణేష్ గా మారే సీన్ ని ఎమోషనల్ గా బాగా ఎలివేట్ చేశారు. లవ్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ ముగిసింది.

07:20 PM: శ్రీదేవి కోసం గొడవలు మానేద్దాం అనుకున్న టైంలో లోకల్ ఎమ్మెల్యే కి అది నచ్చక పథకం వేస్తాడు..

07:15 PM: రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘వెళ్లువచ్చి గోదారమ్మ’ రీమెక్ సాంగ్ టైం. కంప్లీట్ రెట్రో లుక్ లో తీసిన ఈ సాంగ్ ఇప్పటి జెనరేషన్ నచ్చుతుంది.

07:10PM: గద్దల కొండ గణేష్ తన ప్రేమని శ్రీదేవికి చెప్పే సీన్ ని బాగా తీశారు. 80-90 లుక్ లో పూజ హెగ్డే కుర్రకారు మతిపోగొట్టేలా ఉంది.

07:04 PM: అదే టైంలో కాలేజ్ లో శ్రీదేవిగా అలియాస్ పూజ హెగ్డే పరిచయం అయ్యింది. అమ్మాయి ప్లస్ పేరు నచ్చడంతో గణేష్ కి శ్రీదేవి మీద ప్రేమ మొదలైంది.

06:59 PM: 1980-90 బ్యాక్ డ్రాప్స్ లో వరుణ్ తేజ్ యంగ్ లుక్ లో ఫ్లాష్ బ్యాక్ మొదలైంది. వరుణ్ తేజ్ హీరోయిన్ శ్రీదేవికి పిచ్చ ఫ్యాన్..

06:54 PM: అథర్వకి తను గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాల్సి వచ్చిందో అనే ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలైంది. అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్..

06:50 PM: సెకండాఫ్ చాలా కామెడీ సీన్స్ తో మొదలైంది. ఫస్ట్ హాఫ్ లో సీరియస్ గా ఉన్న వరుణ్ తేజ్ ఇక్కడ కాస్త కామెడీ చేయడం స్టార్ట్ చేశారు.

06:43 PM: ఇంటర్వల్ రిపోర్ట్: వరుణ్ తేజ్ మాస్ క్యారక్టరైజేషన్, ఎలివేషన్స్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్, ఆయాంక బోస్ విజువల్స్ మరియు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ హైలైట్స్. వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ పాత్రలో నటించలేదు, జీవించాడు.

06:40 PM: గద్దల కొండ గణేష్ మీద ప్లాన్ చేసే మర్డర్ సీన్ తో సినిమాని ఒక పీక్ మోమెంట్ కి తీసుకొచ్చి ఇంటర్వల్ ఇచ్చారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరింది. ఇక అసలు కథ సెకండాఫ్ లోనే మొదలవ్వుద్ది.

06:34 PM: ‘ఎవడైతే ఎక్కువ ఆగమాగంచేసినోడు, ఇప్పుడే ఆడే ఆగమైపోయిండు’ లాంటి వరుణ్ చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియన్స్ చాలా బాగా నచ్చుతాయి.

06:30 PM: సినిమా ఆసక్తికరంగా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది. ఇప్పటి వరకూ అయాంక బోస్ విజువల్స్, మిక్కీ జె మేయర్ మ్యూజిక్, వరుణ్ తేజ్ నటన మరియు మంచి కామెడీ సీన్స్ కథని ఇంటర్వెల్ వరకూ బాగా డ్రైవ్ చేశాయి.

06:25 PM: తనని చంపడానికి వచ్చినోడికి వచ్చిన గద్దల కొండ గణేష్ సలహా ‘ అందుకే పెద్దోళ్ళు చెప్పిర్రు నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు దాచుకోవాలా, రెండు కాల్చుకోవాలా అని’.. ఈ సీన్ సందర్భం మరియు హీరో ఎలివేషన్ కి విజిల్స్ పడడం పక్కా..

06:20PM: అథర్వ – మృణాళిని మధ్య వచ్చే ‘గగన వీధిలో’ సాంగ్ మాంటేజ్ విజువల్స్ చాలా బాగున్నాయి. పాట ఎంత హిట్ అయ్యిందో విజువల్స్ అంతకు మించి హిట్ అవుతాయి. స్పెషల్ గా మృణాళిని రవి చాలా చాలా క్యూట్ గా ఉంది.

06:15 PM: అథర్వ గద్దల కొండ గ్యాంగ్ గురించి తెలుసుకునే క్రమంలో మాళవిక(మృణాళిని రవి)తో పరిచయం అవ్వడం, అలాగే వారిద్దరి మధ్య జరిగే సీన్స్ చాల క్యూట్ గా ఉన్నాయి.

06:08 PM: ఆపోజిట్ గ్యాంగ్ కి వార్నింగ్ – ‘ఇవాల్టి నుంచి ఎలా చంపాలో కాదు, నా నుంచి ఎలా బతకాలో ఆలోచించమను’ అనే డైలాగ్ వరుణ్ చెప్పిన విధానం సూపర్బ్

06:04 PM: అథర్వ -సత్య కలిసి గద్దల కొండా గణేష్ గురించి విషయాలను తెలుసుకునే సీన్స్ చాలా కామెడీగా ఉన్నాయి.

05:59 PM: అందరు నవ్వుకునేలా అల్లరి పిల్ల పాత్రలో మిర్నాలిని రవిని పరిచయం చేశారు.

05:54 PM: అథర్వ గద్దల కొండ గణేష్ గురుంచి తెలుసుకునే క్రమంలో ‘వక వక’ పాత మొదలైంది. మాంటేజ్ లా తీసిన ఈ పాటలో వరుణ్ తేజ్ ఎలివేషన్స్ సూపర్బ్. సుప్రియ పథక్ ని గణేష్ అమ్మగా పరిచయం చేశారు.

05:50 PM: దయా దాక్షణ్యాలు లేని రూత్ లెస్ గ్యాంగ్స్టర్ గా వరుణ్ తేజ్ నటన అదిరింది. అతని లుక్, మ్యానరిజమ్స్, డైలాగ్ డిక్షన్ ఇలా అన్నీ అభిమానుల చేత ఈలలు వేయిస్తాయి.

05:44 PM: ఎలాంటి సినిమా తీయాలా అనే క్రమంలో అథర్వ గ్యాంగ్ స్టర్ అయిన గద్దల కొండ గణేష్ మీద సినిమా చేయడానికి డిసైడ్ అవుతాడు. రాజా రవీంద్రతో వచ్చే సీన్ సింపుల్ అండ్ గుడ్.

05:40 PM: అథర్వ ఫ్రెండ్ గా సత్య పరిచయం అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ కామెడీ బాగుంది.

05:30PM: ఫ్లాష్ బ్యాక్ లో బైరాగి అనే పాత్ర ద్వారా హాయ్ రేంజ్ డైలాగ్స్ తో వరుణ్ తేజ్ ని కానీ అలియాస్ గద్దల కొండ గణేష్ గా పరిచయం చేశారు.. ఈ సీన్ మెగా ఫాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది.

‘మనుషులు చాలా డబ్బు సంపాదిస్తారు, కానీ చానా భయం సంపాదించినా’ అనే డైలాగ్ అదిరింది.

05:25PM: తమిళ స్టార్ హీరో అథర్వ ని చాలా సింపుల్ గా పరిచయం చేశారు. అవకాశాల కోసం ట్రై చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ గా అథర్వ ఏడాది లో సినిమా చేస్తా అని తన ఫామిలీ తో ఛాలెంజ్ చేస్తాడు.

05:20PM: పేకాట క్లబ్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని పరిచయం చేశారు. సడన్ ట్విస్ట్.. సుబ్బరాజు గద్దల కొండ గణేష్ ని కాల్చడంతో.. ఆరు నెలల క్రితం అసలు కథ మొదలైంది.

05:15PM: ‘వాల్మీకి’ అదే అదే ‘గద్దల కొండ గణేష్’ సినిమా ఇప్పుడే మొదలైంది.. చాలా సింపుల్ గా టైటిల్స్ పడుతున్నాయి..

5 COMMENTS

సినిమా

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే భారం!

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత బలపరుస్తుందా లేదా అన్నది నిర్ణయించే అంశంగా...

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

Varanasi: బ్లాక్ ఫారెస్ట్ లో మహేశ్ బాబు.. ట్రెక్కింగ్ ఏం చేస్తున్నాడో తెలుసా..?

Varanasi: మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. భారీ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో...

Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ టీమ్ కు ప్రమాదం.. ఒకరు మృతి

Fauji: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘ఫౌజీ’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాదే సినిమాను విడుదల చేసేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.....