Switch to English

రాయలసీమలో ఏపీ హైకోర్ట్‌.. ఏమిటీ వైపరీత్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

రాయలసీమలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దిశగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అడుగులేస్తోందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. గతంలోనే.. అంటే టీడీపీతో విడిపోయాక, భారతీయ జనతా పార్టీకి రాయలసీమ మీద ప్రేమ పుట్టుకొచ్చి.. రాయలసీమ డిక్లరేషన్‌ని తెరపైకి తెచ్చింది. టీడీపీ పతనానికీ.. దాంతోపాటు ఏపీలో బీజేపీ పతనానికీ అదే తొలిమెట్టు.

నిజానికి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎంతో ప్రత్యేకమైనది. హైకోర్టు మాత్రమే ఎందుకు.? రాజధాని రాయలసీమలో వుండాలని ఎందుకు కోరుకోకూడదు.? కానీ, ఎవరు అధికారంలో వుంటే, వారికి అనుకూలంగానే నిర్ణయాలు జరుగుతాయి. చంద్రబాబు అధికారంలో వున్నారు గనుక, అమరావతి రాజధాని అయ్యింది. ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు.. ఆ రాజధాని అమరావతిలో వుంటుందా.? లేదా.? అన్నది ఇప్పుడే చెప్పలేం.

కేంద్రం తరఫున రాజధాని విషయమై నిధుల విడుదలలో చిత్తశుద్ధిని బీజేపీ ప్రదర్శిస్తే.. ఆ తర్వాత ఏపీ ప్రయోజనాల గురించి బీజేపీ నేతలు ఎంచక్కా మాట్లాడొచ్చు. దాదాపు 25 వేల కోట్ల రూపాయల విలువైన పనులు అమరావతిలో జరుగుతున్నాయని సాక్షాత్తూ వైఎస్‌ జగన్‌ సర్కారే ఒప్పుకుంది. ఈ పనులు చంద్రబాబు హయాంలో జరిగాయి, వైఎస్‌ జగన్‌ హయాంలో ఆగిపోయాయి. అవి మళ్ళీ ప్రారంభమవుతాయా.? లేదా.? అన్నది చెప్పలేం.

తాత్కాలిక హైకోర్టు అమరావతి పరిధిలోనే వుంది. శాశ్వత హైకోర్టుకి సంబంధించి ఇప్పటికే ప్లాన్‌ సిద్ధమయ్యింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగి వుంటే, హైకోర్టు శాశ్వత నిర్మాణ పనులు ముందుకు సాగేవేమో. ఇప్పుడు అమరావతిలో కాదు, రాయలసీమలో హైకోర్టు.. అంటూ బీజేపీ చెప్పినా, వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చెప్పినా.. అది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. నెలల తరబడి నడిచే వ్యవహారం. దానికి మళ్ళీ బోల్డంత ఖర్చు.

ఆంధ్రప్రదేశ్‌ విషయంలో వైసీపీకి అయినా, బీజేపీకి అయినా చిత్తశుద్ధి వుంటే.. రాజధాని విషయంలో ఇప్పుడు ఇంత సందిగ్ధమే నెలకొని వుండేది కాదు. రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి పెదవి విప్పకపోవడమంటే, అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...