నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం తనదంటూ ఒకటికి వందసార్లు చెప్పుకుంటుంటారు చంద్రబాబు. కానీ, ఒకప్పటి నాయకత్వ లక్షణాలు ఆయనలో ఇప్పుడు ఏమాత్రం కన్పించవు. గతంలో ఆయనకు అవకాశాలు అలా కలిసొచ్చాయి.. ఇప్పుడు ఆ అవకాశాలు బెడిసి కొట్టేస్తున్నాయని చెప్పడం కూడా సబబేనేమో. ఏదైతేనేం, తెలుగుదేశం పార్టీకి అత్యంత పతనావస్థను తీసుకొచ్చేశారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో ఎలాగో అదృష్టం కలిసొచ్చిందిగానీ, అంతకు ముందే.. నాయకుడిగా ఆయనలో ‘స్టామినా’ మాయమైపోయింది. ఆ కారణంగానే, గడచిన ఐదేళ్ళలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు.
బలోపేతం సంగతి తర్వాత, తెలంగాణలో ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయిన టీడీపీ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆ దిశగానే వడివడిగా అడుగులు వేసేస్తోంది. కోడెల శివప్రసాద్ మరణానంతరం మేగ్జిమమ్ పొలిటికల్ మైలేజ్ పొందడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలే చేశారు. కోడెల మృతి పట్ల అందరిలోనూ సానుభూతి వుంది. కోడెల బలవన్మరణానికి వైఎస్ జగన్ సర్కార్ వేధింపులే కారణమన్న భావన కూడా ప్రజల్లో గట్టిగానే వుంది. కానీ, చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు.. తెలుగుదేశం పార్టీకి దక్కాల్సిన పొలిటికల్ మైలేజ్‌ని దూరం చేసేలా వున్నాయి.
Also Read: కోడెల శివప్రసాద్ తర్వాత లిస్ట్‌లో వున్నదెవరు.?
కోడెల ఎపిసోడ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఇతరత్రా చాలా అంశాల్ని చంద్రబాబు ప్రస్తావించారు.. ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ని కలిశారు చంద్రబాబు. నిజానికి, చంద్రబాబుకి గవర్నర్ల వ్యవస్థ అంటే అస్సలు గిట్టదు. ఆ విషయాన్ని గతంలోనే ఆయన పలుమార్లు నొక్కి వక్కాణించారు. మరి, వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ దగ్గరకు ఎందుకు వెళ్ళారన్నది వైసీపీ ప్రశ్న. చంద్రబాబుకి ఇష్టం లేకపోయినా.. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్రధమ పౌరుడు గవర్నరే. సో, చంద్రబాబుకి అది తప్పలేదు. సీబీఐ విషయంలోనూ చంద్రబాబు తీరు హాస్యాస్పదంగా మారుతోంది.
ఇదే సీబీఐ మీద, బీజేపీతో విడిపోయాక చంద్రబాబు చేసిన యాగీ అంతా ఇంతా కాదు. ఇప్పుడేమో కోడెల మృతిపై సీబీఐతో విచారణ చేయమంటున్నారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేయాల్సి రావొచ్చుగాక. అలాంటప్పుడు ఒకింత విజ్ఞత పాటించాల్సి వుంటుంది. నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు ఆ విజ్ఞతను క్రమక్రమంగా కోల్పోయారని అర్థమవుతోంది. అందుకే, చంద్రబాబుకీ.. తెలుగుదేశం పార్టీకీ ఇప్పుడీ దుస్థితి.
801687 719469I cannot thank you fully for the blogposts on your internet page. I know you placed a great deal of time and effort into all of them and hope you know how considerably I appreciate it. I hope I will do precisely the same for one more individual at some point. Palm Beach Condos 560700