Switch to English

మెగా మిస్టరీ: చిరంజీవిపై ‘కుల ముద్ర’ ఎలా పడింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించాక ఆయన మీద కుల ముద్ర పడింది. కానీ, అప్పటి పరిస్థితులు వేరు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి సినిమాల్లో తిరుగులేని స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న స్వర్గీయ ఎన్టీఆర్‌ మీద కుల ముద్ర వేసేందుకు కొందరు ప్రయత్నించినా, ఆ పప్పులుడకలేదు. ప్రధానంగా ఓ ‘కమ్మ’టి సామాజిక వర్గం, స్వర్గీయ ఎన్టీఆర్‌ మీద కుల ముద్ర పడకుండా జాగ్రత్తపడింది.

కానీ, మెగాస్టార్‌ చిరంజీవి పరిస్థితి వేరు. ఆ ‘కమ్మ’టి సామాజిక వర్గానికి మరో ప్రముఖ సామాజిక వర్గం తోడై, చిరంజీవి మీద బలవంతంగా ‘కుల ముద్ర’ వేసేసింది. చిరంజీవిని రాజకీయంగా అణగదొక్కేందుకు, చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం మొదలైనప్పుడే ‘బీజం’ పడటం గమనార్హం. ఏకంగా చిరంజీవి ఇంట్లోనే చిచ్చుపెట్టారు. ఎలాగైతేనేం, చిరంజీవి ఆ ‘ప్రకంపనల్ని’ తట్టుకున్నారు.. రాజకీయ పార్టీని స్థాపించారు. అప్పుడే అసలు కథ మొదలయ్యింది. నిస్సిగ్గుగా చిరంజీవి మీద జుగుప్సాకరమైన విమర్శలు చేయించారు. ఈ క్రమంలో చిరంజీవి స్థాపించిన బ్లడ్‌ బ్యాంకుని కూడా రాజకీయాల్లోకి లాగారు.

అప్పటిదాకా చిరంజీవిని అన్ని విధాలా ప్రశంసించినవారే, ఆ తర్వాత చిరంజీవిపై బురద జల్లడం మొదలు పెట్టారు. కొంతమంది చిరంజీవి వెన్నంటే వుండి వెన్నుపోటు పొడిచారు కూడా. ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలో కలిసిపోవడానికి ఏ శక్తులైతే కారణమయ్యాయో.. ఆ శక్తులూ ఆ తర్వాత చిరంజీవి మీద ‘విలీన’ విమర్శలు చేయడం గమనార్హం.

రాజకీయాల్లోకి వచ్చి చిరంజీవి ఏమైనా పోగొట్టుకున్నారా.? అన్నది వేరే చర్చ. కానీ, సినిమాల్లోనే కొనసాగి వుంటే.. చిరంజీవి ఇంకా చాలా లాభపడేవారన్నది నిర్వివాదాంశం. గతం గతః ఆనాటి రాజకీయ కల్లోలాన్ని బహుశా చిరంజీవి ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయిపోయారు. అసలు రాజకీయాలంటేనే ఆమడ దూరం జరిగిపోతున్నారు చిరంజీవి.

అచ్చం అన్నయ్య చిరంజీవిలానే ఇప్పుడు తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి కూడా ‘కుల ముద్ర’ వేసేశారు కొందరు. చిరంజీవి జెండా పీకేయడం గురించి అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా సంస్థలు ఇప్పుడు జెండా పీకేసే పరిస్థితుల్ని కొనితెచ్చుకోవడం గమనార్హం. ఒక్కటి మాత్రం నిజం.. చిరంజీవి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ‘అందరివాడు’. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...