Switch to English

జనసేనాని పవన్‌పై చిరంజీవికి ‘మెగా’ నమ్మకమెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

2009 ఎన్నికల సమయంలో తెలుగునాట ప్రజారాజ్యం పార్టీతో హల్‌చల్‌ చేశారు చిరంజీవి. అప్పట్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు దక్కించుకున్నా, ఎక్కువ కాలం ప్రజారాజ్యం పార్టీని నడపలేకపోయారు చిరంజీవి. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయోగానీ, ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోవడానికి మాత్రం చాలా కారణాలే వున్నాయి.

తాను సాధించలేనిది, తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ సాధిస్తాడన్న గట్టి నమ్మకం మాత్రం ఇప్పటికీ చిరంజీవిలో అలాగే వుంది. జనసేన పార్టీకి చిరంజీవి ఇప్పటిదాకా బాహాటంగా ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. అయితే, తన సోదరుడి పట్ల తనకు పూర్తి నమ్మకం వుందని మాత్రం చిరంజీవి పదే పదే చెబుతున్నారు.

జనసేన ఆవిర్భవించాక రెండు ఎన్నికల్ని చూసింది. ఒక ఎన్నికల్లో అసలు జనసేన పోటీ చేయలేదు. ఇటీవలి ఎన్నికల్లో జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి, ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటుని.. అదీ ఆంధ్రప్రదేశ్‌లో దక్కించుకుంది. ఆ ఎమ్మెల్యే కూడా అడపా దడపా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు.

ఇప్పుడున్న రాజకీయ ట్రెండ్‌లో జనసేన నిలదొక్కుకోవడం సాధ్యమేనా.? అని చిరంజీవిని ప్రశ్నిస్తే, ‘పవన్‌కళ్యాణ్‌కి పట్టుదల ఎక్కువ. దేన్నీ అంత తేలిగ్గా తీసుకోడు. ఒక్కసారి సీరియస్‌గా తీసుకున్నాడంటే, ఆ తర్వాత అతని ఆలోచనలు ఇంకోలా వుంటాయి. ఖచ్చితంగా పవన్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పారు.

18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగి, చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు సాధించిన చిరంజీవే ప్రజారాజ్యం పార్టీని ఎక్కువ కాలం నడపలేకపోయిన దరిమిలా, ఒక్క ఎమ్మెల్యే సీటుతో జనసేనాని ఏం చేయగలరు.? పైగా, రెండు చోట్లా ఆయన ఓడిపోయారాయె.! ఇదే విషయాన్ని చిరంజీవి వద్ద ప్రస్తావిస్తే, పవన్‌ గురించి తనకు బాగా తెలుసనీ, ఖచ్చితంగా రాజకీయాల్లో పవన్‌ తాను అనుకున్న మార్పుని సాధిస్తాడనీ పునరుద్ఘాటించారు.

2 COMMENTS

  1. 847565 300114Very best individuals messages are meant to charm allow honor toward groom and bride. Newbie speakers in front of excessive locations really should usually our own gold colored dominate in presenting and public speaking, which is to be individual interests home. best man speach 39399

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...