Switch to English

టీడీపీపై ఈ బ్లేమ్‌ గేమ్‌ ఇంకెన్నాళ్ళు జగన్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

అధికారంలో వున్న పార్టీని నిలదీయడమే ప్రతిపక్షం పని. కానీ, అధికార పక్షానికి వేరే పని వుంటుంది. అదే పరిపాలన అందించడం. పరిపాలన సంగతి పక్కన పెట్టి, అధికారంలోకి వచ్చాక కూడా రాజకీమయే చేయాలన్న ‘కక్కుర్తి’ అధికారంలో వున్నవారికి వుంటే ప్రజలకు దిక్కెవరు.? ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు గనుక, వస్తూనే.. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు వైఎస్‌ జగన్‌. కక్ష సాధింపు చర్యలంటే.. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం మాత్రమే.

చంద్రబాబు పాలనలో అన్యాయం, అక్రమాలు జరిగాయంటూ గడచిన ఐదేళ్ళుగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిందారోపణలు చేస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే తీరు కన్పిస్తోంది. పార్టీ శ్రేణుల్ని ఉత్సాహ పరచాలంటే.. ఆ మాత్రం ‘యాగీ’ తప్పదేమో. కానీ, చంద్రబాబు పాలనను విమర్శించడం తప్ప, తమకు ఇంకో ‘పని’ ఏమీ లేదన్నట్టు వైఎస్‌ జగన్‌ కావొచ్చు, వైసీపీలోని ఇతర ముఖ్య నేతలు కానీ వ్యవహరిస్తే.. ముందు ముందు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుంది.

చంద్రబాబు పాలనలో తెరపైకొచ్చిన పథకాల్లో ఇప్పటికే చాలావరకు పథకాల్ని పీకి పారేశారు.. కొన్నిటికి పేర్లు మార్చేశారు. ఈ క్రమంలో, ఆ పథకంలో అవినీతి, ఈ పథకంలో అవినీతి.. అంటూ రోజుకో కొత్త లెక్కని చట్ట సభల్లోనే వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రెస్‌ మీట్లలో ఎలాంటి ఆరోపణలు చేసినా ఫర్లేదుగానీ.. చట్ట సభల్లో ఆరోపిస్తే, అందుకు తగ్గ లెక్కలు చూపాలి. లెక్కలు చూపితే సరిపోదు, నిజాలు నిగ్గు తేల్చాలి. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని చెబితే సరిపోతుందా.? చర్యలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి స్థానంలో వున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డే కదా.!

ప్రజా వేదికని కూల్చేశారు సరే, బాధ్యులపై చర్యలెందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు వైసీపీలో ఏ ముఖ్య నేతా సమాధానం చెప్పడంలేదు. ముందుగా అధికారులపైనా, గత పాలకులపైనో చర్యలు తీసుకుని.. ఆ తర్వాత ప్రజా వేదికను కూల్చివేసి వుంటే వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మంచి పేరు వచ్చేదేమో. ఇప్పుడు, తాజాగా జగన్‌ సర్కార్‌ కన్ను ‘అన్నా క్యాంటీన్ల’ మీద పడింది. అందులో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంటే, ‘రాజన్న క్యాంటీన్లు’ తీసుకురావడానికి ముందస్తు ప్లాన్‌ అన్న మాట. ‘అమ్మ ఒడి’ పథకం గురించిన జరిగిన ప్రచారం వేరు, ఆ తర్వాత అమలులో విధించిన ‘కొర్రీలు’ వేరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళల పెన్షన్‌ విషయమై వైఎస్‌ జగన్‌ మాట తప్పేసి, మడమ తిప్పేశారాయె. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేయడం తప్ప, చంద్రబాబు పాలనపై విమర్శలు చేసి, ఈ రెండు నెలల్లో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వెలికి తీసిన ‘అవినీతి సొమ్ము’ ఏమన్నా వుందా.?

4 COMMENTS

  1. 706043 919397I was curious if you ever thought of changing the page layout of your website? Its very well written; I love what youve got to say. But maybe you could a little more in the way of content so people could connect with it better. Youve got an awful lot of text for only having one or 2 images. Maybe you could space it out better? 572722

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 02 జూన్ 2024

పంచాంగం తేదీ 02- 06-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:31 గంటలకు తిథి: బహుళ ఏకాదశి రాత్రి 1.20 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం:...

Anand Devarakonda: వేసవిలో ఫ్యామిలీ మూవీ ‘గం..గం.. గణేశా’: ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్. హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పై కేదార్ సెలగంశెట్టి,...

Vizag: వేరే మహిళతో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర

Vizag: భర్త మరో మహిళతో కలిసి ఉండగా మిస్ వైజాగ్ (Miss Vizag) టైటిల్ విన్నర్ నక్షత్ర (Nakshatra) ఆందోళన చేయడం కలకలం రేపింది. భర్త మరో మహిళతో ఉన్న షూటింగ్ ఆఫీసుకు...

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...