Switch to English

‘చౌదరి’ కోవర్ట్‌ ఆపరేషన్‌.. బీజేపీకి డౌటొచ్చిందా!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి, భారతీయ జనతా పార్టీలో చేరడం వెనుక ‘కోవర్ట్‌’ ఆపరేషన్‌ వుందా.? అని మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమవుతూనే వున్నాయి. ఆ అనుమానాలు బలపడ్తున్నాయా.? ఏపీ బీజేపీ నేతలకి సుజనా చౌదరి మీద నమ్మకం లేదా.? తమ అధిష్టానానికి సుజనా చౌదరి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానం వస్తోందిప్పుడు.

ఇటీవల సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్‌లో పలువురు బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు కూడా జరిపారు. అయితే, సుజనా చౌదరిని ఏపీలో బీజేపీ తరఫున పెద్ద నేతగా చూసేందుకు మాత్రం ఏపీ బీజేపీ నేతలు ఇష్టపడటంలేదట. ‘ఆయన పెద్ద కోవర్టు.. ఆయన్ని అంత తేలిగ్గా ఎలా నమ్మగలం.?’ అంటూ ఓ బీజేపీ ముఖ్య నేత ఆఫ్‌ ది రికార్డ్‌గా వ్యాఖ్యానిస్తున్నారట. ‘అధిష్టానానికి ఎప్పటికప్పుడు రాష్ట్రం నుంచి నివేదికలు వెళుతుంటాయి.

ఒకవేళ టీడీపీ పట్ల సానుభూతితో సుజనా చౌదరి బీజేపీలో కోవర్టు ఆపరేషన్‌ నిర్వహిస్తుండడమే నిజమైతే, అందుకు తగ్గ సమాచారం కూడా ఢిల్లీకి అందుతుంది’ అని సదరు బీజేపీ సీనియర్‌ నేత కుండబద్దలుగొట్టేశారట. తనను ఏపీ బీజేపీ నేతలు అస్సలేమాత్రం నమ్మడం లేదన్న విషయమై సుజనా చౌదరి కూడా కాస్త ఆందోళనగానే వున్నట్లు తెలుస్తోంది. ‘పార్టీలో నాకు దక్కాల్సిన గౌరవం దక్కడంలేదు మొర్రో..’ అంటూ ఢిల్లీ బీజేపీ నేతల వద్ద సుజనా చౌదరి తాజాగా మొరపెట్టుకున్నారని సమాచారమ్‌.

‘మీ సచ్ఛీలతను నిరూపించుకునే అవకాశం వచ్చినప్పుడు ఆ పని సమర్థవంతంగా చేస్తే.. ఆ తర్వాత మీపై ఎలాంటి నెగెటివ్‌ ప్రచారమూ జరగదు’ అంటూ ఏపీకి చెందిన బీజేపీ ఢిల్లీ స్థాయి నేత ఒకరు సుజనా చౌదరికి ఉచిత సలహా కూడా ఇచ్చారట. టీడీపీలో వున్నప్పుడు తాను ‘కింగు’లా వుండేవాడిననీ, ఇప్పుడు తన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని సుజనా చౌదరి వాపోతున్నారంటూ ఆయన సన్నిహితులే మీడియాకి లీకులు పంపుతుండడం గమనార్హం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...