Switch to English

‘రోటి క‌ప‌డా రొమాన్స్’ టైటిల్ లోగోను ఆవిష్కరించిన “దిల్ “రాజు.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

హుషారు, సినిమా చూపిస్తమావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ సృజన్‌ కుమార్ బొజ్జం తో కలిసి నిర్మించిన తాజా చిత్రం ’ రోటి కపడా రొమాన్స్‘. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష ,మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ లోగోను శుక్రవారం స్టార్ ప్రొడ్యూసర్ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్ర కథ నేను విన్నాను. ఇలాంటి టైటిల్ తో నేను ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను తీద్ధామని అనుకున్నాను. అయితే తమ సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ గా వుంటుందని అడిగితే ఈ టైటిల్ ఇచ్చేశాను. కొత్త నటీనటులతో , సాంకేతిక నిపుణులతో, ట్రెండీ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం కంటెంట్ కొత్తగా వుంటుందని అనుకుంటున్నాను. కొత్త కంటెంట్ ఇస్తే మన ఆడియన్స్ సినిమాను తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రం కూడా అదే కోవలో చేరాలని ఆశిస్తున్నాను‘ అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మా సంస్థలో చాలా యూత్ ఫుల్ సినిమాలు చేశాను. ఆడియన్స్ కూడా ఆ చిత్రాలను బాగా ఆదరించారు. మళ్లీ అలాంటి యూత్ ఫుల్ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాను నిర్మించాను. పక్కా యూత్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో ఆల్ ఎమోషన్స్ వుంటాయి అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ కొన్నేళ్ల క్రితం దిల్ రాజు గారికి కథ చెప్పాలని ఆయన ఆఫీస్ బయట తిరుగుతుండేవాడిని. ఇప్పుడు నా సినిమాకు ఆయనే టైటిల్ ఇచ్చి ఆయన చేతుల మీదుగా టైటిల్ ను ఆవిష్కరించడం నాకెంతో ప్రత్యేకమైనది. రోటి కపడా రొమాన్స్ ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఆల్ ఎమోషన్స్ వుంటాయి. నేటి యూత్ కనెక్ట్ అవుతారు. ఇప్పటి వరకు నిర్మాత వేణు ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. ఆ కోవలోనే ఆయన నాకు అవకాశం ఇచ్చారు. కథకు తగ్గ నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...