Switch to English

అదిరిపోయేలా జగన్ పై లోకేశ్ ట్వీట్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

ప్రజల్లో కాకుండా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే మాజీ మంత్రి నారా లోకేశ్.. తన దూకుడు పెంచారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ట్వీట్ల తుఫానుతో విరుచుకుపడ్డారు. అదిరిపోయే వెటకారంతో పలు అంశాలపై సూటిగా ప్రశ్నలు సంధించారు. బడ్జెట్ లెక్కలను ప్రస్తావిస్తూ.. వాటికి కాస్త వ్యంగ్యం జోడించి చెలరేగిపోయారు. ఇన్నాళ్లూ తన ట్వీట్లు, చేతలతో నవ్వులు పూయించిన లోకేశ్.. ఇప్పుడు సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ప్రజా సమస్యలను సందర్భోచితంగా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బాగా కృషి చేస్తున్నారు. ఓటమి నేర్పిన పాఠమో ఏమో గానీ లోకేశ్ ట్వీట్లలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శుక్రవారం జగన్ సర్కారు తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత లోకేశ్ వరుసగా ట్వీట్లు చేశారు. అవేంటో మీరూ ఓ లుక్కేయండి..

ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కడతామన్నారు. పైగా గృహరుణాలన్నీ రద్దు చేస్తామన్నారు. బడ్జెట్ చూస్తే గృహ నిర్మాణానికి కేవలం రూ.8,615 కోట్లు ఇచ్చారు. జగన్ గారూ! మీరు నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్ళు కాదుకదా?

ఆర్థికమంత్రి గారు రామాయణమంతా చదివారు, సంజీవని గురించి చెప్పారు. వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే ప్రభుత్వమే చూసుకుంటుందని ఊదరకొట్టారు. చివరికి ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు విదిల్చారు. కొండంత రాగం తీసి పాట పాడకుండా కునుకేసినట్టుంది.

జగన్ గారూ, పథకాలకు మీ పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు సరే. అమ్మఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటి? ఒక తల్లికి ఇచ్చి, ఇంకో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? పథకానికి కూడా ‘జగనన్న జంపింగ్ జపాంగ్’ అని పేరు పెడితే బాగుండేది.

జగన్ గారూ! మీ బడ్జెట్ కేటాయింపులే నామమాత్రమా? మీ హామీలు కూడా నామమాత్రమా? చూస్తుంటే మీరు నామమాత్ర ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నారు. రైతుల వడ్డీలేని రుణాలకు రూ.3,500 కోట్లు ఎందుకు కేటాయించలేదు. ఇదేనా మీ చిత్తశుద్ధి?

తమ ప్రభుత్వం కోసిన కోతలకు, బడ్జెట్ లో కేటాయించిన నిధులకు పొంతన లేదన్న విషయం పక్కనే ఉన్న గౌరవ వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. సొంత పార్టీ నేతలే గుర్రు పెట్టారంటే జగన్ గారి హామీలన్నీ గుర్తుంచుకుని, బడ్జెట్ విన్న ప్రజల పరిస్థితి ఏంటో?

ఇవీ.. జగన్ సర్కారుపై లోకేశ్ సంధించిన ట్వీట్లు. అయితే, వీటిపై ఇప్పటికే వైఎస్సార్ సీపీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. ఇవన్నీ లోకేశ్ సొంత స్క్రిప్ట్ కాదని, ఎవరి చేతో రాయించి, తన ఖాతాలో వేసుకుని ఉంటారని ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, లోకేశ్ ట్వీట్లు ఆలోచించతగ్గవే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...