నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో తనయుడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న :అహింస’ సినిమా ట్రైలర్ ను హీరో రామ్ చరణ్ విడుదల చేసారు. తేజ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని అందించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.
ఇండస్ట్రీకి ఎంతో మంది నటీ నటులను మరియు హీరో హీరోయిన్స్ ను పరిచయం చేసిన తేజ అహింస ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అభిరామ్ ను పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే రానా హీరోగా దూసుకు పోతున్న ఈ సమయంలో అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో ఆయన కెరీర్ పై అంతా ఆసక్తిగా ఉన్నారు.
ట్రైలర్ ను చూస్తూ ఉంటే తేజ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల మార్క్ కనిపిస్తుంది. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తేజ అహింసను తెరకెక్కించినట్లుగా ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది. సదా ను కీలక పాత్రలో చూపించిన తేజ కొత్త నటీ నటులను చాలా మందినే పరిచయం చేయబోతున్నాడు.
అహింస ట్రైలర్ విడుదల సందర్బంగా దర్శకుడు తేజ కు , హీరో అభిరామ్ కు ట్విటర్ వేదికగా హీరో రాం చరణ్ అభినందనలు తెలియజేశారు.
631263 292380hello, i came in to learn about this subject, thanks alot. will put this web site into my bookmarks. 517121