Switch to English

మంత్రి రోజాగారూ.! స్పృహలో వుండే చిరంజీవి కుటుంబాన్ని తూలనాడుతున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

సినీ నటి, వైసీపీ నేత, నగిరి ఎమ్మెల్యే.. పైగా మంత్రి కూడా అయిన ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమని, రాజకీయాల్లో నోటి దురుసుతనానికి కేరాఫ్ అడ్రస్.! రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. కానీ, రోజా విమర్శలు ‘బోర్డర్ క్రాస్ చేసేసి’ వుంటాయ్.!

ఏం, ఎవరైనా ఆ స్థాయికి దిగజారి మాట్లడలేరా.? ఎందుకు మాట్లాడలేరు. కాకపోతే, కాస్తంత సభ్యత, సంస్కారం గురించి ఆలోచిస్తారంతే. సరే, ఆ సంగతి పక్కన పెడితే, పవన్ కళ్యాణ్‌ని విమర్శించే క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవిని విమర్శల్లోకి లాగారు రోజా. ‘చిరంజీవి, ఆయన తమ్ముళ్ళ వల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు..’ అంటూ విమర్శించేశారు రోజా.

నవ్విపోదురుగాక నాకేటి.? అన్నట్టుంది మంత్రి రోజా వ్యవహారం. కొన్నాళ్ళ క్రితం, మంత్రి పదవి రాగానే రోజా స్వయంగా తన కుటుంబ సభ్యుల్ని వెంటేసుకుని, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళారు. అక్కడ భోజనం చేసి వచ్చారు. చిరంజీవితో నవ్వుతూ ఫొటోలు దిగారు కూడా.

అయినా, చిరంజీవి వల్ల ప్రజలకు ఉపయోగం లేదని రోజా చెప్పడమేంటి.? అసలు రోజా వల్ల ప్రజలకు ఉపయోగమేంటి.? ఆమె నుంచి ఏం నేర్చుకోవాలి భావి భారతం.? ఆమె మాట్లాడే ‘డిక్కీ బలిసిన కోడి’ లాంటి మాటలా.? ‘నన్ను రేప్ చేసే దమ్ము ఎవరికైనా వుందా.?’ లాంటి మాటలా.?

ఇలా నెటిజనం సోషల్ మీడియా వేదికగా రోజాని కడిగి పారేస్తున్నారు. అంతేనా, బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ద్వారా రక్తదానం, నేత్రదానం వంటి గొప్ప కార్యక్రమాల్ని చిరంజీవి చేపడుతున్న విషయాల్నీ ప్రస్తావిస్తున్నారు.. ఇవేవీ రోజాకి కనిపించడంలేదా.? అని ప్రశ్నిస్తున్నారు.

చిత్రమేంటంటే, ప్రతి విషయంలోనూ రోజాని వెనకేసుకొచ్చే బులుగు మీడియా కూడా చిరంజీవిపై రోజా విమర్శల్ని తప్పు పడుతుండడం. కోవిడ్ కష్ట కాలంలో, వైసీపీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే, మెగాస్టార్ చిరంజీవి.. తాను రాజకీయాల్లో లేకపోయినా.. సేవా భావంతో ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పారు. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.

సినీ పరిశ్రమలో ఎందరో కార్మికుల్ని చిరంజీవి ఆదుకున్నారు. సినీ నటిగా రోజా, సినీ పరిశ్రమలో ఎంతమంది కార్మికులకి సాయం చేశారు.? అన్‌స్టాపబుల్ టాక్ షోకి పవన్ కళ్యాణ్ వెళితే ప్యాకేజీ తీసుకున్నట్టు. ఈటీవీలో జబర్దస్త్ చేసిన రోజా ప్యాకేజీ తీసుకున్నట్టు కాదు. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ఇంటికి రోజా వెళ్ళడం ద్వారా ఏ ప్యాకేజీకి ఆమె కక్కుర్తి పడినట్లు.?

తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడమంటారే.. అలా చిరంజీవి ఇంటికి భోజనానికి వెళ్ళి.. చిరంజీవిని విమర్శించడం. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.? అంటూ చిరంజీవి అభిమానులు, మంత్రి రోజాపై మండిపడుతున్నారు.

చంద్రబాబు పంచన చేరి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తూలనాడిన రోజా, వైఎస్ జగన్ పంచన చేరి చంద్రబాబునీ, పవన్ కళ్యాణ్‌నీ తూలనాడుతున్నారు. రేప్పొద్దున్న పవన్ కళ్యాణ్ పంచన చేరాల్సిన అవసరం రావొచ్చు.! కానీ, ఆమె ఏమాత్రం మొహమాట పడదు. తనను తాను ఎప్పుడూ అద్దంలో చూసుకోదు.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...