తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వారిసు’ పొంగల్ బరిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో మరోసారి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు ఈ స్టార్ హీరో. తమిళంలో ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో విజయ్ కూడా ఒకరు. ఇక ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే, తమిళనాట పండగ వాతావరణం నెలకొంటుంది.
కాగా, సంక్రాంతి కానుకగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విజయ్, తన సొంత ఫ్యామిలీ విషయంలో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ తన భార్య సంగీతను ప్రేమించి పెళ్లాడాడు. వారి దాంపత్య జీవితానికి 23 ఏళ్లు నిండాయి. అయితే ఈ సమయంలో విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం వారిసు చిత్రానికి సంబంధించిన ఈవెంట్స్‌లో విజయ్ మాత్రమే కనిపిస్తుండటంతో ఈ వార్తలు తమిళనాట హల్చల్ చేస్తున్నాయి.
అయితే, విజయ్ ఫ్యామిలీ బయట కనిపించడం చాలా అరుదు. విజయ్ సినిమా ఫంక్షన్లకు కూడా వారు ఎక్కువగా రారు. కాగా, వారిసు చిత్ర ప్రమోషన్స్ కంటే ముందే, తన భార్య, పిల్లలు వెకేషన్‌కు వెళ్లడంతో.. వారితో పాటు విజయ్ వెళ్లలేకపోయాడు. దీంతో వారిద్దరు విడిపోయారని.. త్వరలోనే విడాకులు తీసుకుంటారనే వార్త చక్కర్లు కొడుతోంది. కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని విజయ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
250659 579705if this post was likened to a flavor of yogurt, what flavor would it be? Banana, I feel. 731380
854897 704613An extremely intriguing examine, I may possibly not agree completely, but you do make some very legitimate factors. 707036