Switch to English

విశాల్ లాఠీ మూవీ రివ్యూ

Critic Rating
( 1.00 )
User Rating
( 1.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు ఆయన తమిళ సినిమాలతో సమానంగా ఇక్కడా డబ్బింగ్ చిత్రాలు మార్కెట్ చేసేవి. అయితే పరిస్థితిలో మార్పు వచ్చింది. వరస ప్లాపులతో తెలుగులో మార్కెట్ పూర్తిగా డీలా పడింది. ఈ నేపథ్యంలో విశాల్ నుండి వచ్చిన తాజా చిత్రం లాఠీ. మరి ఈ చిత్రంతోనైనా విశాల్ హిట్ కొడతాడా?

కథ:

ఒక రేప్ నిందితుడిపై లాఠీ ఛార్జ్ చేసిన ఘటనలో మురళి కృష్ణ (విశాల్) సస్పెండ్ అవుతాడు. అయితే డిఐజి సహాయంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఆ డిఐజి ఒక క్రిమినల్ పై లాఠీ ఛార్జ్ చేయమని ఆదేశిస్తాడు.

దాని తర్వాత మురళీకృష్ణ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? దాని వల్ల మురళికృష్ణ కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చింది అన్నది చిత్రం చూసి తెలుసుకోవాలి.

నటీనటులు:

విశాల్ తనకు అలవాటైన పద్దతిలోనే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన స్టయిల్, బాడీ లాంగ్వేజ్ లో ఎలాంటి మార్పూ లేదు. గత కొన్ని సినిమాలుగా విశాల్ ఎలా చేస్తున్నాడో అదే చేసాడు. పైగా విశాల్ ఇప్పటికే చాలానే పోలీస్ పాత్రలు చేసేసాడు. ఇందులో కొత్తగా చేయడానికంటూ ఏం లేదు. దురదృష్టవశాత్తూ లాఠీలో నిరాసక్తతతో నటించినట్లు అనిపిస్తుంది.

విశాల్ భార్యగా చేసిన సునైనా పర్వాలేదు. ప్రభు చిన్న కామియో పాత్రలో కనిపించాడు. విలన్లుగా నటించిన వారి గురించి చెప్పుకోవడం కూడా దండగ.

సాంకేతిక నిపుణులు:

ఏ. వినోద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. పోన్ పార్తీబన్ కథ అందించాడు. అయితే ఇద్దరూ కూడా తమ విభాగాల్లో రాణించలేదు. కథ కానీ నరేషన్ కానీ ఇప్పటికే మనం వందలాది సినిమాల్లో చూసేసిందే. ప్రతీ సీన్ ముందే ఏం జరుగుతుందో ఊహించేయొచ్చు. నరేషన్ అయితే నిస్సారంగా సాగింది.

సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నదాంట్లో ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్. ఏం లేని దాన్ని కూడా ఏదో ఉంది అని ఫీల్ అయ్యామంటే అది సంగీత దర్శకుడి చలవే. ఇక సినిమాటోగ్రఫీ జస్ట్ యావరేజ్ గా అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ ఓకే. ఎడిటింగ్ బ్యాడ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పాజిటివ్ పాయింట్స్:

  • అక్కడక్కడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

నెగటివ్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీ
  • నెమ్మదిగా సాగే కథనం

విశ్లేషణ:

విశాల్ కు మీరు ఎంత పెద్ద వీరాభిమాని అయినా అయ్యుండచ్చు కానీ లాఠీ మీకు పరీక్ష పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థియేటర్ లో కాదు ఎక్కడైనా కూడా ఈ సినిమాను ఈజీగా స్కిప్ కొట్టేయొచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 1/5

10 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...