Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ‘పునాదిరాళ్లు’తో బలమైన పునాది వేసుకున్న చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

డైనమిక్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్, మేచో మెగాస్టార్.. ఇవన్నీ సినీ రంగంలో చిరంజీవి కీర్తి కిరీటాలు. అభిమానులు, సినీ పరిశ్రమ, ట్రేడ్ సైతం చిరంజీవి నటన, డ్యాన్సు, ఫైట్స్ లో చూపిన వేగానికి మురిసిపోయారు. తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ టైటిల్ లానే చిన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరానికి చేరుకునేందుకు బలమైన పునాదే వేసుకున్నారు. ‘పునాదిరాళ్లు’ తొలి సినిమాగా 1978 ఫిబ్రవరి 11న ప్రారంభమైనా.. 1979 జూన్ 21న ఆయన 7వ సినిమాగా విడుదలైంది. అప్పటికే చిరంజీవి పేరు పరిశ్రమలో వినిపిస్తున్నా.. ‘పునాదిరాళ్లు’ షూటింగ్ సమయంలో పరిశ్రమకు.. చిత్ర విజయంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

ఒరిజినాలిటీ కోసం

తూర్పు గోదావరి జిల్లా ‘దోసకాయలపల్లి’లో చిరంజీవి తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధిగా నేర్చుకున్న ధియరీ కాకుండా.. ఆన్ లొకేషన్ లో ప్రాక్టికల్స్ లోనే చిరంజీవి తన ప్రత్యేకత చాటారు. చిత్రీకరణలో ఒక సన్నివేశాన్ని దర్శకుడు చెప్పగానే.. మిగిలిన నటులకు భిన్నంగా, దర్శకుడు ఎటువంటి సూచన ఇవ్వకపోయినా కేవలం సన్నివేశాన్ని ఊహించుకుని చిరంజీవే స్వయంగా కాళ్లకు మట్టి, గడ్డిని రాసుకుని వచ్చారట. చిరంజీవి చేసిన పనిని చూసిన కెమెరామెన్ పిఎస్.నివాస్ ఆశ్చర్యపోయారట. అవసరం లేదని చెప్పినా.. సీన్ లో ఒరిజినాలిటీ కోసం రాసుకున్నానని చెప్పారట. అంతటి అంకితభావాన్ని చిరంజీవి తన తొలి సినిమా షూటింగ్ సమయంలోనే చూపించి పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు.

‘పునాదిరాళ్లు’తో బలమైన పునాది వేసుకున్న చిరంజీవి

తొలి సినిమానే ప్రముఖులతో..

గూడపాటి రాజ్ కుమార్ దర్శకత్వంలో ధర్మ విజయా పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి కుమార్ నిర్మాణ సారధ్యంలో నరసింహారాజు ప్రధాన పాత్రలో నటించగా.. చిరంజీవి మొదటి సినిమా ప్రారంభమైంది. పరిశ్రమలో ఉద్దండులైన మహానటి సావిత్రి, కేవీ చలం, ప్రముఖులుగా వెలుగొందుతున్న రోజా రమణి, కవిత, గోకిన రామారావు.. వంటి సీనియర్లు సినిమాలో నటిస్తున్నారు. తొలి సినిమాలోనే దాదాపు అగ్రనటులతో నటించారు చిరంజీవి. గ్రామలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామాల్లో పేదలపై మోతుబరుల దౌర్జన్యాలను ఎదుర్కొనే యువకులుగా చిరంజీవి తదితరులు నటించారు.

‘పునాదిరాళ్లు’తో బలమైన పునాది వేసుకున్న చిరంజీవి

ప్రత్యేకత చూపడంతోనే ఎంపిక

పునాదిరాళ్లు సినిమా కోసం జరిగిన నటీనటుల ఎంపికలో చిరంజీవి చూపిన వైవిధ్యమైన ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే ఎంపిక చేసుకున్నారు. స్వతహాగా సినిమాలో రక్తం ఉడుకుతున్న యువకుడి పాత్ర. చిరంజీవి కళ్లు పలికిస్తున్న భావాలు, అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో కావాల్సిన నటన, పలకాల్సిన సంభాషణలు, ముఖంలో చూపించే భావాలు దర్శక, నిర్మాతలకు చిరంజీవిని తమ సినిమాలోకి తీసుకునేలా చేశాయి. ఆ ప్రత్యేకతను చిరంజీవి తన నటన, హావభావాలతో పునాదిరాళ్లులో స్పష్టంగా చూపించారు. దీంతో సినిమాలో సహచర నటుల మధ్యలో కూడా చిరంజీవి ప్రత్యేకంగా కనిపించి పేరు తెచ్చుకున్నారు.

‘పునాదిరాళ్లు’తో బలమైన పునాది వేసుకున్న చిరంజీవి

పరిశ్రమ, ప్రేక్షకులు మెచ్చేలా..

ప్రాణం ఖరీదు తర్వాత పునాదిరాళ్లు విడుదలయ్యే సమయానికి మధ్యలో తొమ్మిది నెలల కాలంలో చిరంజీవి నటించిన ఆరు సినిమాలు విడుదలయ్యాయి. దీంతో పునాదిరాళ్లు విడుదలయ్యే తేదీకి చిరంజీవి పేరు పరిశ్రమలో వినిపిస్తోంది. దీంతో చిరంజీవిపై దర్శక, నిర్మాతలతోపాటు ప్రేక్షకులు కూడా చిరంజీవిని ప్రత్యేకంగా చూడటం ప్రారంభించారు. అభ్యుదయ భావాల నేపథ్యంలో తెరకెక్కిన పునాదిరాళ్లు విజయం సాధించడంతోపాటు నంది అవార్డు కూడా దక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కకునేలా చిరంజీవికి పూల బాట పరచింది.

‘పునాదిరాళ్లు’తో బలమైన పునాది వేసుకున్న చిరంజీవి

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...