Switch to English

వైసీపీ లెక్కలు తారుమారైపోతున్నాయ్.! ఇదే సాక్ష్యం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

2024 ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి ఎలా వుండబోతోంది.? కింది స్థాయిలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే వైసీపీ అధిష్టానం అర్థం చేసుకుంటోందనీ, పరిస్థితులు ఇంకా దుర్భరంగా మారకముందే, ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారనీ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. ఏ అధికార పార్టీ అయినా.. ఎక్కువో.. తక్కువో.. ‘ప్రభుత్వ వ్యతిరేకత’ ఎదుర్కోవాల్సిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అభివృద్ధి జరగకపోవడం.. ఇలా చాలా అంశాలు ‘ప్రభుత్వ వ్యతిరేకత’కు కొలమానాలుగా చెప్పుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్ళుగా రాజధాని విషయమై గందరగోళం కొనసాగుతోంది. అమరావతిని రాజధానిగా గుర్తించేందుకు అధికార వైసీపీ ఒప్పుకోవడంలేదు. ఈ క్రమంలోనే అమరావతిని, నిజంగానే స్మశానంగా మార్చేసే కుట్రలు పన్నతోంది వైసీపీ.. అన్నది విపక్షాల ఆరోపణ. అందుకు అనుగుణంగానే అమరావతిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, కడప స్టీలు ప్లాంటు, దుగరాజపట్నం పోర్టు.. ఇలాంటివన్నీ, 2019 ఎన్నికల్లో వైసీపీకి అస్త్రాలుగా మారాయి. అవేవీ, ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. సంక్షేమ పథకాల్ని అమలు చేసేశామంటూ, అదే తమ ఘనతగా చెప్పుకుంటోంది వైసీపీ.

ఇంకోపక్క, జనంలోకి వైసీపీ నేతలు వెళ్ళలేకపోతున్నారు. ప్రజా ప్రతినిథులు ఎక్కడికక్కడ ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రజా ప్రతినిథులు కొందరు, పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీలతో టచ్‌లోకి కూడా వెళుతున్నారు.

అప్పట్లో టీడీపీ అనుకూల మీడియా ఎలాగైతే టీడీపీని దెద్బతీసిందో, ఇప్పుడు వైసీపీ అనుకూల మీడియా కూడా వైసీపీని అచ్చం అలాగే, అంతకు మించి ముంచేస్తోంది. ఏ నాయకుడు పార్టీ నుంచి జంప్ చేసెయ్యబోతున్నాడో వైసీపీ అనుకూల మీడియానే చెబుతుండడం.. వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

60 శాతానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారని వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. ఇప్పుడైతే, ‘అంతకు మించి’ అనే వాదన వినిపిస్తోంది. ‘మాకు ఎదురే లేదు..’ అని వైసీపీ అంటోంటే, టీడీపీకి 2019 ఎన్నికల్లో వచ్చిన 23 కూడా వైసీపీకి వచ్చేలా లేవ్.. అని కింది స్థాయి పరిణామాలపై కొందరు రాజకీయ విశ్లేషఖులు లెక్కలు చెబుతుండడం గమనార్హం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....