Switch to English

6గురు నిందితుల్లో 5గురు మైనర్లే.. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ పై సీపీ ప్రెస్ మీట్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జూబ్లీహిల్స్ లో బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో సమగ్ర దర్యాప్తు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈకేసులో నిందితులు మొత్తం ఆరుగురిలో ఒకరు మేజర్ కాగా మిగిలిన ఐదుగురు మైనర్లేనని తెలిపారు. మేజర్ పేరు సాదుద్దీన్ మాలిక్ కాగా.. మైనర్లు అయినందున వారి పేర్లు వెల్లడించేందుకు వీల్లేదని అన్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వివరించారు.

బెంగళూరు నుంచి మొదలు..

‘మార్చి 28న బెంగళూరులో నివసించే ఓ విద్యార్ధి పాఠశాలల ప్రారంభానికి ముందు పార్టీ చేసుకోవాలని పబ్ విషయమై ముగ్గురు స్నేహితులను సంప్రదించాడు. వారు అమ్మేసియా పబ్ ను సూచించడంతో నాన్ ఆల్కహాలిక్, నాన్ స్మోకింగ్ పార్టీ కోసం పబ్ బుక్ చేశారు. అందరూ మైనర్లు కావడంతో మేజర్ అయిన ఉస్మాన్ ఆలీఖాన్ తో పబ్ బుక్ చేయించారు. మే 28న పార్టీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మే 25న బెంగళూరు నుంచి వచ్చిన అబ్బాయి పబ్ లో రూ.1లక్ష అడ్వాన్స్ ఇచ్చారు. స్నేహితుల ద్వారా బాధితురాలు టికెట్ బుక్ చేసుకుంది’.

పార్టీ జరిగిన రోజు..

పార్టీ జరిగిన రోజు మధ్యాహ్నం 1.10 గంటలకు బాధితురాలితోపాటు బాలుడు పబ్ లోకి వెళ్లారు. 1.50 వరకూ డ్యాన్స్ చేసిన అనంతరం బాలుడు వెళ్లిపోయాడు. మరో స్నేహితురాలితో బాలిక అక్కడే ఉంది. 3.15 గంటలకు 5.10 గంటలకు నిందితుల్లో ఒకరు, సాదుద్దీన్ బాలికతో మాటలు కలిపి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో 5.40 గంటలకు బాలిక, ఆమె స్నేహితురాలు పబ్ నుంచి బయటకు వచ్చేశారు. ఇది గమనించిన మిగిలిన నిందితులు బాలికను ఫాలో అయ్యారు. అత్యాచారం చేయాలనే ఆలోచన కూడా అప్పుడే వచ్చినట్టు తెలుస్తోంది. బాధితురాలి స్నేహితురాలు క్యాబ్ లో వెళ్లిపోయింది.

బాలికను ట్రాప్ చేసి సాదుద్దీన్ తోపాటు ముగ్గరు మైనర్లు ఆమెను బెంజి కార్లో తీసుకెళ్లారు. అక్కడి నుంచి బేకరీకి వెళ్లారు. కారులోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. 5.54 తర్వాత బెంజి నుంచి ఇన్నోవాలోకి మారాక.. అందులో సాదుద్దీన్ మాలిక్, ఐదుగురు మైనర్లు వెళ్లారు. రోడ్ నెంబర్ 44లో ఓచోట ఆపి మైనర్ ఆమెపై అత్యాచారం చేశాడు. మిగిలిన నిందితులు కారులో తిరుగుతూ అత్యాచారం చేశారు. ఈక్రమంలో ఆమె మెడ, ఇతర శరీర భాగాలపై గాయాలయ్యాయి., ఘటన తర్వాత ఆమెను పబ్ వద్ద దించేసి వెళ్లిపోయారు.

మూడు రోజుల తర్వాత..

తండ్రికి ఫోన్ చేయడంతో వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. మూడు రోజుల తర్వాత గాయాలు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం. 1న కేసు నమోదు చేసి 3వ తేదీన సాదుద్దీన్ ను అరెస్టు చేశాం. సాదుద్దీన్ తోపాటు నలుగురు మైనర్లు ఆమెపై అత్యాచారం చేశారు. మరో మైనర్ అత్యాచారం చేయలేదు. బలమైన ఆధారాల సేకరణ వల్ల కొంత ఆలస్యమైంది. నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవితఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. అత్యాచారం చేయకపోయినా కారులో ఆమెను ముద్దాడిన ఐదో మైనర్ కు 5-7 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉంది. ఘటనను వీడియోలు తీసీ వాళ్లే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపై పోలిస్ క్లియరెన్స్ ఇచ్చాకే పబ్ లకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’ అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...