Switch to English

పాపం.. వీరు ఎంత దురదృష్టవంతులో..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేవరకు తడుతూనే ఉంటుందన్నది సామెత. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈ సామెత కొంతమంది నేతలకు సరిగ్గా సరిపోతుంది. అందివచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్న ఆ నేతలు.. అదృష్టాన్ని వదిలేసి దురదృష్టాన్ని ఎంచుకున్నారు. వారు తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం.. ఆయా నేతల రాజకీయ భవిష్యత్తునే అయోమయంలో పడేసింది. కొందరు నేతలు మాత్రం చాలా తెలివిగా వ్యవహరించి అదృష్టాన్ని ఒడిసిపట్టుకోగా.. కొంతమంది మాత్రం తమకు రాబోయే అదృష్టాన్ని చేజేతులా వదులుకుని దురదృష్టాన్ని వాటేసుకున్నారు.

ఇటీవల ఏపీలో అసెంబ్లీతోపాటు లోక్ సభకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ముందు నుంచీ పలు సర్వేలు, అధ్యయనాలు, అభిప్రాయాలూ అన్నీ కూడా వైఎస్సార్ సీపీకే అనుకూలంగా వచ్చాయి. కాస్త రాజకీయ అనుభవం ఉన్నవారు ఎవరైనా సరే క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటో అంచనా వేయగలరు. కానీ ఈ నేతలు మాత్రం తప్పుడు అంచనాలు వేసుకుని తమ రాజకీయ భవిష్యత్తుకు తామే చరమగీతం పాడుకున్నారు.

ఇలాంటివారిలో విజయవాడకు చెందిన వంగవీటి రాధాకృష్ణ, విశాఖపట్నానికి చెందిన కొణతాల రామకృష్ణ, కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వంటి నేతలున్నారు. వంగవీటి రాధాకృష్ణ, గౌరు చరితారెడ్డి దంపతులు ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వంగవీటికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశమే రాకపోగా, గౌరు చరిత పాణ్యం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. ఆ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ తరఫున బరిలోకి దిగిన కాటసాని రాంభూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఈ ఇరువురు నేతలూ పార్టీనే నమ్ముకుని ఉంటే కచ్చితంగా ఏదో ఒక పదవి వచ్చేదని, కానీ చివరి క్షణంలో పార్టీ మారి తప్పు చేశారనే అభిప్రాయాలు వస్తున్నాయి.

వంగవీటి రాధాకృష్ణ తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గమే కావాలని పట్టుబట్టకుండా పార్టీ సూచించినట్టు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచో లేదా తర్వాత ఆఫర్ చేసిన మచిలీపట్నం ఎంపీగానో పోటీ చేసి ఉంటే కచ్చితంగా విజయం సాధించి ఉండేవారు. కానీ అలా చేయకుండా తొందరపాటు నిర్ణయంతో టీడీపీలో చేరి రాజకీయంగా నష్టపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక గౌరు చరితారెడ్డి దంపతులు తమకు పాణ్యం టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో వైఎస్సార్ సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడున్న పరిస్థితులను బట్టి పాణ్యం టికెట్ ఇవ్వలేనని చెప్పిన జగన్.. వారి భవిష్యత్తును తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ, గౌరు దంపతులు వైఎస్సార్ సీపీని వీడి టీడీపీ చేరారు.

ఇక కొణతాల రామకృష్ణ కూడా అంది వచ్చిన అవకాశాన్ని కాదనుకున్నారు. తొలి నుంచీ వైఎస్సార్ సీపీలో ఉన్న ఆయనపై కొన్ని అభియోగాలు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఆయన చాలాకాలం పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్ సీపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా జగన్ ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా వేయబోగా.. కొణతాల తిరస్కరించారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తే చాలని, కొత్తగా పార్టీ కండువా వేయాల్సిన అవసరం లేదని చెప్పడంతో అవాక్కైన జగన్.. ఆయన్ను దూరం పెట్టారు. దీంతో పార్టీలో చేరే అవకాశాన్ని కొణతాల కోల్పోయారు. తద్వారా రాజకీయంగా నష్టపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

2 COMMENTS

  1. 882354 327142Youre so cool! I dont suppose Ive learn something like this before. So nice to search out any person with some unique thoughts on this topic. realy thank you for starting this up. this internet web site is one thing thats required on the net, someone with a bit of originality. useful job for bringing something new to the internet! 781214

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Hema: ‘నన్ను ఇందులోకి లాగొద్దు..’ బెంగళూరు రేవ్ పార్టీపై నటి హేమ

Hema: బెంగళూరు (Bengaluru) నగర శివారులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఓ ఫామ్ హౌస్ లో జరిగినట్టుగా వార్తలు...

Jr.Ntr Birthday special: యాక్టింగ్ డైనమైట్.. అభిమానుల సంబరం.. ‘జూ.ఎన్టీఆర్’..

Jr.Ntr Birthday special: బాల నటుడిగానే అద్భుతమైన ప్రతిభ.. యుక్త వయసులోనే హీరో.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్.. నటనలో డైనమైట్.. డ్యాన్స్ లో స్పీడ్.....

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

రాజకీయం

జగన్, చంద్రబాబు.. విదేశీ ‘రాజకీయ’ పర్యటనల వెనుక.!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. నారా చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్ళనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం వుందట. విదేశాలకు వెళితే తప్పేముంది.? ఒకరు విదేశాలకు వెళితే, పారిపోయినట్టు...

వంగా గీత మెగాభిమానం.! నిజమేనా.? నమ్మొచ్చా.?

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య అంటే, నాకు అమితమైన అభిమానం. చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అన్నా కూడా అభిమానమే. నాగబాబు అంటే కూడా అంతే గౌరవం.! ఈ మాటలు అన్నదెవరో కాదు, కాకినాడ ఎంపీ...

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు కూడా వుంటారు. అందుకే, యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...