ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమ వైపుకు ప్రశ్నాస్త్రాలు దూసుకెళుతున్నాయి సినిమా టిక్కెట్ల వ్యవహారానికి సంబంధించి. వినియోగదారుడికీ, ఉత్పాదకుడికీ మధ్యన ప్రభుత్వ ప్రమేయమెందుకు.? అంటూ వివాదాస్పద ఫిలిం మేకర్ రామ్ గోపాల్ సంధించిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోందా.? అంటే, మంత్రిగారి వరుస ట్వీట్లతో ‘ఔను’ అని చెప్పక తప్పదేమో.
మంత్రి పేర్ని నానితో ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో ఆర్జీవీ మాట్లాడుతూ పలు ప్రశ్నాస్త్రాలు సంధించాడు. సోషల్ మీడియా వేదికగా కూడా వాటిని ప్రస్తావించాడు రామ్ గోపాల్ వర్మ. దాంతో, వర్మ ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని సమాధానమిస్తూ వరుస ట్వీట్లేశారు.
సినిమా టిక్కెట్ ధరను వెయ్యి, రెండు వేలకు పంపడం ఎంతవరకు సమంజసం.? అంటూ పేర్ని నాని ప్రశ్నించేశారు. ఏ చట్టం చెబుతోందిలా ధరలు పెంచడానికి.? అన్నది పేర్ని నాని ప్రశ్న. బాగానే వుందిగానీ, చెత్త మీద పన్ను వేయమని ఏ చట్టం చెబుతోందిట.? పండగ సమయాల్లో ఆర్టీసీ బస్సు ఛార్జీలపై అదనపు బాదుడు బాదెయ్యాలని ఏ చట్టం చెబుతోందట.?
అన్నిటికీ మించి, ఎన్నికల్లో నిబంధనలకు మించి ఖర్చు చేయవచ్చని ఏ చట్టం చెబుతోందిట.? ఓటు విలువ 2 వేల నుంచి అవసరాన్ని బట్టి ఇరవై వేల రూపాయల వరకు పలుకుతోన్న ప్రజాస్వామ్యం మనది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలే కాదు, పంచాయితీ ఎన్నికల్లోనూ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లి రాజకీయం చేశాయి రాజకీయ పార్టీలు.
‘ప్రజలకు పంచేశాం..’ అని ఘనంగా చెప్పుకుంటారా.? ప్రజల్ని వంచిస్తున్నామని ఘనంగా చెప్పుకుంటారా.? ఈ ప్రశ్నకు ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాల్సి వుంటుంది. ‘అబ్బే, మేం డబ్బులు పంచలేదు..’ అని బుకాయించొచ్చుగాక, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కోసం దొంగ ఓటర్లు ఎలా వచ్చారన్నది అధికార పార్టీకే తెలియాలి.
ఎమ్మెల్యే టిక్కెట్టు, ఎమ్మెల్సీ టిక్కెట్టు, ఎంపీ టిక్కెట్టు.. ఆఖరికి వార్డు మెంబర్గా టిక్కెట్టు కావాలంటే, దానికి వేలంపాట తరహాలో ఖర్చు చేయాల్సి వస్తోంది. మరి, ఇవన్నీ ఏ చట్ట ప్రకారం జరుగుతున్నాయట.? ‘గురివింద’ నీతి అంటే ఇదే మరి.
Und vor insbesondere, es dauert nur ein wenigen Minuten bis erstellen ein Online Casino.
623010 240728Seriously quite excellent contribution, I genuinely depend on up-dates of your stuff. 380993
702597 829023Glad to be 1 of several visitants on this wonderful internet website : D. 693899