డేటింగ్ యాప్ ల ద్వారా పరిచయమైన అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ ఏకంగా రూ.69 లక్షలు సమర్పించుకున్నాడో వైద్యుడు. ఇంత డబ్బు పోగొట్టుకున్నా అతడి తీరు మారలేదు. ఇంకా చాటింగులు చేస్తూనే ఉన్నాడు. చివరకు కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో అతడి బ్యాంకు అకౌంట్ స్తంభింపచేయాల్సి వచ్చింది. ముషీరాబాద్ లో కుటుంబంతో కలిసి నివసించే 60 ఏళ్ల డాక్టర్.. గుజరాత్ లో కూడా క్లినిక్ నిర్వహిస్తున్నారు.
నెలలో కొన్ని రోజులు గుజరాత్ లో, కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉంటారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం ఓ డేటింగ్ యాప్ లో అమ్మాయి పరిచయమైంది. ఆమెతో రోజూ చాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో ఆ యువతి ఆయన్ను ప్రేమిస్తున్నానంటూ వల విసిరింది. అది నిజమేననుకున్న ఆ వైద్యుడు.. ఆమెకు మరింత దగ్గరయ్యారు.
ఇద్దరూ నగ్నంగా వీడియో కాల్స్ కూడా చేసుకున్నారు. అయితే, ఆ వీడియో కాల్ రికార్డు చేసిన సదరు యువతి.. బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో గతేడాది నవంబర్ లో దాదాపు రూ.39 లక్షల వరకు ఆ యువతికి చెల్లించారు. అయినా వదలకపోవడంతో చివరకు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పోనీ అక్కడితో అయినా ఆయన తీరు మారలేదు.
మళ్లీ డేటింగ్ యాప్స్ లో ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. పైగా గత నెల రోజుల్లో మరో రూ.30 లక్షలు అలాగే ముట్టజెప్పినట్టు కనుగొన్నారు. దీంతో వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, ఆయన బ్యాంకు ఖాతా స్తంభింపచేశారు.
159078 95562Immer etliche Firmen bentzen heutzutage Interimmanagement als innovatives und ergnzendes Gertschaft i. Spanne der Unternehmensfhrung. Denn hiermit wird Kenntnisstand leistungsfhig, bedarfsgerecht und schnell ins Unternehmen geholt. 420145
713868 698689I gotta favorite this web web site it seems really beneficial . 787507
857827 335985Some genuinely nice and utilitarian info on this web web site , likewise I believe the layout has wonderful functions. 873911