యూట్యూబ్ వీడియోలు చూసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముఠా సభ్యులను ప్రవేశపెట్టారు. ముఠాలోని ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కేసు వివరాలను వెల్లడిస్తూ..
‘యూట్యూబ్ లో వీడియోలు చూసి వీరు దొంగతనాలు చేస్తున్నారు. మొత్తం 6గురిని అదుపులోకి తీసుకున్నాం. ముఠాలోని మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 23 బైకులు, 6 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి, సీసీటీవీ, డీవీఆర్, 3 మొబైల్ ఫోన్స్, 35 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నాం. జగదీష్ మార్కెట్ గుడిలో వీరు చేసిన దొంగతనంలో ఆచూకీ దొరికింది. ఈ ముఠా 6నెలల కాలంలో 26 దొంగతనాలు చేశారు. వీరికి వాజిద్ అనే వ్యక్తి నాయకుడు. ఈ గ్యాంగ్‌లోని అబ్దుల్ సమీర్‌పై మర్డర్ కేసు కూడా ఉంది. ఈ కేసులో ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్ట్ చేశాం’ అని అన్నారు.
573498 401606I adore foregathering helpful info, this post has got me even a lot more info! . 90127
722522 622522Thanks for this great post! It has long been quite useful. I wish that youll carry on posting your wisdom with us. 389781
427399 830573I want to thank you for the excellent post!! I undoubtedly liked every bit of it. Ive bookmarked your web website so I can take a appear at the latest articles you post later on. 214683
358905 911987I conceive this internet site contains some rattling superb details for everyone : D. 117309